Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ, దశరథను సెక్యూరిటీ గార్డు ఆఫీసులోకి వెళ్లకుండా ఆపుతాడు. మా ఆఫీసులోకి వెళ్లకుండా ఆపుతావా? అని సెక్యూరిటీని తోసేసి తండ్రీకొడుకులు లోపలికి వెళ్తారు. అప్పటికే ఆఫీస్ ను తనకు నచ్చినట్లు మాలిని మార్చేస్తుంది.
శివ నారాయణ ఫైర్

ఇక మాలినిని కలవాలంటే పర్మిషన్ అవసరమని లోపల సెక్యూరిటీ చెప్పడంతో శివ నారాయణ మండిపడతాడు. ఎవర్రా మేడం? నా ఆఫీసులో మీ అధికారం ఏంటీ? అని శివ నారాయణ ఫైర్ అవుతారు. అప్పుడే వచ్చిన బోర్డు మెంబర్స్ డైరెక్ట్ గా లోపలికి వెళ్తారు. కానీ శివ నారాయణను మాత్రం ఆపుతారు.
హాస్పిటల్ కు దీప
మరోవైపు యాక్సిడెంట్ అయిన దీపను సూరజ్, జ్యోత్స్న కలిసి కార్లో హాస్పిటల్ కు తీసుకెళ్తారు. సూరజ్ ను త్వరగా వెళ్లమని జ్యో గొడవ పడుతుంది. దీప బాధ చూడలేక జ్యోత్స్న ఫీల్ అవుతుంది. వదినకు యాక్సిడెంట్ ఎలా జరిగిందని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. చూడలేదని జ్యో గొడవ పడుతుంది.
మాలిని కౌంటర్
మరోవైపు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ బోర్డు మెంబర్స్ తో మాలిని మీటింగ్ పెడుతుంది. ఓపిక నశించిపోయిన శివ నారాయణ బలవంతంగా లోపలికి వెళ్తాడు. నా ఆఫీసుకు నన్నే రానివ్వకుండా ఆపుతావా? అని శివ నారాయణ అడుగుతాడు. మీ ఆఫీసా? మా బోర్డు మెంబర్స్ తో మీటింగ్ జరుగుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అని మాలిని కౌంటర్ వేస్తుంది.
వరుస షాక్ లు
ఈ బోర్డు మెంబర్స్ ఇప్పటి నుంచి నా బోర్డు మెంబర్స్. గౌరీ ప్రసాద్ నా మనిషే. తన రెస్టారెంట్ ను అమ్ముతాననడం, పోటీకి రావడం. నన్ను ఓడించడం అంతా నేనాడించిన నాటకం అని మాలిని బాంబు పేలుస్తుంది. అది మీరు కొనలేదు. మిమ్మల్నే మేం కొన్నాం. కళ్లు మూసుకొని కుటుంబం అంతా సంతకాలు పెట్టారు కదా అని మాలిని అంటుంది.
{{/usCountry}}ఈ బోర్డు మెంబర్స్ ఇప్పటి నుంచి నా బోర్డు మెంబర్స్. గౌరీ ప్రసాద్ నా మనిషే. తన రెస్టారెంట్ ను అమ్ముతాననడం, పోటీకి రావడం. నన్ను ఓడించడం అంతా నేనాడించిన నాటకం అని మాలిని బాంబు పేలుస్తుంది. అది మీరు కొనలేదు. మిమ్మల్నే మేం కొన్నాం. కళ్లు మూసుకొని కుటుంబం అంతా సంతకాలు పెట్టారు కదా అని మాలిని అంటుంది.
{{/usCountry}}సూరజ్ అందరినీ నమ్మించి సంతకాలు పెట్టించిన విషయాన్ని శివ నారాయణ గుర్తు చేసుకుంటాడు. మీరు నా కొడుకు సూరజ్ పేరు మీద జ్యోత్స్న రెస్టారెంట్స్ ను రాసిచ్చారు. ఇకపై జ్యోత్స్న రెస్టారెంట్స్ మావి. మీ టైమ్ అలా ఉంది. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి. ఈ మేనేజర్ కూడా నా మనిషే అని మాలిని మరో ట్విస్ట్ ఇస్తుంది.
తండ్రీకొడుకులు షాక్ లో ఉన్నట్లున్నారు. ఇంకా అయిపోలేదు. మిమ్మల్ని పతనం చేయడమే లక్ష్యం. మీ రెస్టారెంట్ పేరు మీద నీ సంతకంతో బ్యాంకులో నేను లోన్లు తీసుకున్నా. నా కొడుకు, కాంచన కోడలు నీతో చాలా సార్లు సంతకాలు చేయించారు. వాళ్లను నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టావని వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది మాలిని. దీంతో శివ నారాయణ కూలబడిపోతాడు.
మాలిని గెలిచిందని
జ్యోత్స్న రెస్టారెంట్ లు తగలబడుతున్నాయి. నీ సామ్రాజ్యాన్ని నీ కళ్ల ముందే నాశనం చేస్తున్నానని మాలిని కన్నింగ్ గా చెప్తుంది. ఛైర్మన్ స్వయంగా సంతకం చేసిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్లు కోర్టుకు వెళ్లినా మనకేం ప్రాబ్లం లేదని లీగల్ అడ్వైజర్ మాలినికి చెప్తాడు.
శివ నారాయణకు చేతగాక ఓడిపోయాడు. మాలిని గెలిచిందని జనాలు చెప్పుకుంటారని మాలిని అంటుంది. దీంతో ఆవేశంతో శివ నారాయణ ఊగిపోతాడు. నా భర్త చావుకు, మామయ్యకు జరిగిన అవమానానికి ఇలా చేశా. కానీ ఇది సరిపోదని మాలిని అంటుంది. ఇక బోర్డు మెంబర్స్ పై దశరథ ఫైర్ అవుతాడు. మా నాన్నను మోసం చేసిన మనిషికి సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తాడు.
బయటకు గెంటేస్తూ
దక్షిణామూర్తి లాంటి స్నేహితుడిని మోసం చేసిన శివ నారాయణ నిజ స్వరూపం గురించి అందరికీ చెప్పా. వాళ్లు మిమ్మల్ని మోసం చేయలేదు. నా ఆఫర్ ను ఒప్పుకొన్నారు. మీరు ఇక బయల్దేరొచ్చని సెక్యూరిటీతో శివ నారాయణ, దశరథను గెంటేయిస్తుంది మాలిని. అంతా అయిపోయింది నాన్న, పూర్తిగా మోసపోయామని దశరథ ఫీల్ అవుతాడు.
దీప బతకడం కష్టం
మరోవైపు జ్యోత్స్న తన ఫోన్ కార్లో పోగొట్టుకున్న విషయం మర్చిపోతుంది. నర్స్ ఫోన్ నుంచి కార్తీక్ కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇంతలో డాక్టర్ వచ్చి దీప బతకడం కష్టమని షాక్ ఇస్తుంది. ఆమె ప్రెగ్నెంట్. కడుపుకు దెబ్బ తగిలింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆమె భర్త ఉన్నారా? అని డాక్టర్ అడుగుతుంది.
సూరజ్ ను సంతకం పెట్టకుండా అడ్డుకున్న జ్యోత్స్న తానే సంతకం చేస్తుంది. ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ కావాలని డాక్టర్ చెప్తుంది. జ్యోత్స్న బ్లడ్ ఇస్తానంటుంది. ప్రాణం కాపాడేందుకు ఒక అర్హత కావాలి. నీకు అది లేదని జ్యోత్స్న వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లోనే ఫోన్ మర్చిపోయిన కార్తీక్ ఇంటికి వెళ్తాడు.
సూరజ్ ఏమో హాస్పిటల్ నుంచి కార్తీక్ కు కాల్ చేయించి దీపకు యాక్సిిడెంట్ జరిగిన విషయం చెప్పేలా చేస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.