Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. అందరికీ మీ మీద నమ్మకం పోయింది. ఆ నమ్మకం నిలబెట్టుకోండి. దీప, బావ ఏ తప్పు చేయలేదని నేనంటే.. ‘నా మనవరాలిని కూడా మీకు నచ్చినట్లు మార్చేశారా’ అని తాత అంటాడు. అందుకే సపోర్ట్ చేయలేనని కార్తీక్, దీపకు జ్యోత్స్న చెప్తుంది.
సాయం చేస్తానన్న జ్యోత్స్న

నేను సుమిత్ర, దశరథల కన్నకూతురు కాకపోయినా వాళ్ల వైపే నిలబడ్డా. ఏది ఏమైనా నేను వాళ్ల కూతురినే. వాళ్ల కోసం ఉంటాను. వాళ్లతోనే ఉంటా. నాకు వీలైన సాయం చేస్తానని జ్యోత్స్న చెప్తుంది. మనమంత కలిసి ఒక మాట మీద ఉంటేనే ఇదంతా జరుగుతుందని దీప అంటుంది.
అమ్మగారని పిలవాలి
అప్పుడే దశరథ వచ్చి షాకింగ్ గా మాట్లాడతాడు. ఆశ్రయం పొందడానికి వచ్చిన శరణార్థులం. ఏదో ఒక రోజు వదిలి వెళ్లిపోతాం. అలవాటు అయితే మళ్లీ కష్టమని దశరథ అంటాడు. చిన్నయ్య అని దీప పిలిస్తే వద్దంటాడు. నువ్వేమీ మా ఇంట్లో పనిమనిషివి కాదు. మేమే ఆశ్రయం పొందుతున్నాం. నేనే అమ్మగారు అని పిలవాలని దశరథ అనగానే అందరూ షాక్ అవుతారు.
బాధపెట్టిన దశరథ
మాటలు మనుషులను మార్చేస్తాయి. లోపలికి వెళ్లు జ్యోత్స్న అని దశరథ చెప్తాడు. నాన్న నువ్వేనా ఇలా మాట్లాడేదని దీప ఎమోషనల్ అవుతుంది. అవును నేనే. నువ్వు నా కూతురు అని తెలియకపోయినా బాగుండేది. మేం ఈ ఇల్లు వదిలి వెళ్లేంతవరకూ జ్యోత్స్నకు దూరంగా ఉండండి. నువ్వు ఇదే ఈ జ్యోత్స్న తండ్రికి చేసే సాయమని దశరథ తన మాటలతో దీపను మరింత బాధపెడతాడు.
మాలిని ఫోర్స్
మరోవైపు జ్యోత్స్న రెస్టారెంట్స్ బాధ్యతలను తీసుకోమ్మని సూరజ్ ను ఫోర్స్ చేస్తుంది మాలిని. వాడిని బలవంతం పెట్టొద్దని దక్షిణామూర్తి చెప్పినా మాలిని వినదు. నా కొడుకుకు నా మీద నమ్మకం లేదని మాలిని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది. నేను జ్యోత్స్న రెస్టారెంట్స్ బాధ్యతలు తీసుకోలేను. అది నా గతం. అదే ఆఫీసులో దీప వదినకు అడ్వైజర్ గా చేశా. నా గతంలోకి నేను వెళ్లలేనని సూరజ్ చెప్తాడు.
{{/usCountry}}మరోవైపు జ్యోత్స్న రెస్టారెంట్స్ బాధ్యతలను తీసుకోమ్మని సూరజ్ ను ఫోర్స్ చేస్తుంది మాలిని. వాడిని బలవంతం పెట్టొద్దని దక్షిణామూర్తి చెప్పినా మాలిని వినదు. నా కొడుకుకు నా మీద నమ్మకం లేదని మాలిని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది. నేను జ్యోత్స్న రెస్టారెంట్స్ బాధ్యతలు తీసుకోలేను. అది నా గతం. అదే ఆఫీసులో దీప వదినకు అడ్వైజర్ గా చేశా. నా గతంలోకి నేను వెళ్లలేనని సూరజ్ చెప్తాడు.
{{/usCountry}}గతాన్ని చూసి భయపడటానికి నువ్వు ఏ తప్పు చేశావ్? నీ తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోగలిగాం. నువ్వు నీ గతాన్ని మర్చిపోవద్దు. ఆఫీస్ కు వచ్చి బాధ్యతలు తీసుకో. నీ కోసమే ఈ పని చేయ్ అని మాలిని అంటుంది. నా కోసం అయితే నేను చాలా చేస్తానమ్మా. అవి నువ్వు తట్టుకోలేవు. నీ కోసం చేేసే కొడుకులాగే ఉండనివ్వు అని సూరజ్ క్లారిటీ ఇస్తాడు.
శౌర్య చెప్పిన నిజం
ఇటు ఫోన్లో సూరజ్ ఫొటోలు చూస్తూ జ్యోత్స్న ఫీల్ అవుతుంది. శౌర్య వచ్చి గట్టిగా అరుస్తుంది. సూరజ్ బాబాయిని జ్యోత్స్న కలిసిందని శౌర్య అందరికీ చెప్పేస్తుంది. సూరజ్ బాబాయిని నేనే పిలిచా. కానీ జ్యోత్స్న సరిగ్గా మాట్లాడలేదు. ఇప్పుడేమో ఫొటోలు చూస్తుందని శివ నారాయణకు శౌర్య చెప్తుంది. ఆ ఫొటోలను డిలీట్ చేయమని జ్యోకు శివ నారాయణ చెప్తాడు.
ఫొటోలు డిలీట్
జ్యో, సూరజ్ పెళ్లి ఎందుకు ఆగిపోయిందని శౌర్య అడుగుతుంది. శౌర్య నువ్వు నీ ఫ్రెండ్స్ తో బొమ్మల పెళ్లి ఆట ఆడుకున్నావు కదా. జ్యో, సూరజ్ పెళ్లి కూడా బొమ్మల పెళ్లే అని కార్తీక్ చెప్తాడు. మరి జ్యోకు సూరజ్ బాబాయితో నిజంగా పెళ్లి జరగదా అని శౌర్య అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక అందరూ సైలెంట్ అయిపోతారు. సూరజ్ ఫొటోలను డిలీట్ చేయమని దశరథ కూడా చెప్తాడు.
ఫోన్లో నుంచి తీసేయొచ్చు కానీ మైండ్ లో నుంచి తీయలేకపోతున్నా. అక్కడి నుంచి డిలీట్ చేసే ఆప్షన్ లేదని జ్యోత్స్న ఫీల్ అవుతుంది. జ్యోత్స్న బాధ చూసి మాలినికి బుద్ధి చెప్పాల్సిందేనని దీపతో కార్తీక్ మాట్లాడతాడు. తన దగ్గర ఐడియా ఉందంటాడు. రేపటి నుంచి మన కొత్త ఆట మొదలవుతుందని కార్తీక్ ఆత్మవిశ్వాసంతో చెప్తాడు.
ఛైర్మన్ గా సూరజ్
మరోవైపు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు తన కొడుకు సూరజ్ ఛైర్మన్ గా ఉంటాడని బోర్డు మెంబర్స్ మీటింగ్ లో మాలిని అనౌన్స్ చేస్తుంది. ఛైర్మన్ అయిన సందర్భంగా సూరజ్ కు మాలిని పెన్ను గిఫ్ట్ గా ఇస్తుంది. సంతకాలన్నీ అదే పెన్నుతో చేయాలంటుంది. ఇక సీఈఓ ఎవరు అని బోర్డు మెంబర్స్ అడుగుతారు. అప్పుడే దీప, కార్తీక్ ఆఫీసులో అడుగుపెడతారు.
సీఈఓగా దీప
జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ వచ్చారని మాలిని మేడానికి చెప్పమని మేనేజర్ కు చెప్పి కార్తీక్ పంపిస్తాడు. వెనుకాలే కార్తీక్, దీప లోపలికి వెళ్తారు. నేను ఈ కంపెనీకి సీఈఓగా కొనసాగుతున్నా. అలాగే మా బావ ఈ కంపెనీకి అడ్వైజర్ అని దీప బాంబ్ పేలుస్తుంది. కార్తీక్ ఇది మీ తాత ఆస్తి కాదు. ఇది మాలిని సంస్థానం. దీనికి కిరీటం లేని మహారాజు నా కొడుకు సూరజ్. ఏం జరగాలన్నా నిర్ణయం తీసుకోవాల్సింది వాడేనని మాలిని గర్వంగా చెప్తుంది.
ఇప్పుడు నడిచేది ప్రజాపాలన. నా భార్య జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ సీఈఓ అని కార్తీక్ అంటాడు. అప్పుడే అగ్రిమెంట్ ను సూరజ్ కు కార్తీక్ ఇస్తాడు. అది చూసి సూరజ్ ఫ్యూజులు ఔట్ అవుతాయి. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.