Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. మా కుటుంబం ఎంత బాధపడిందో, మీ కుటుంబం కూడా అంతే బాధపడాలని జ్యోత్స్నతో సూరజ్ చెప్తాడు. పగ తీర్చుకోవడం కోసమే నాతో ప్రేమ నటించావా? అని జ్యోత్స్న అడుగుతుంది.
నన్ను ప్రేమించలేదా?

నేను ఏదైనా నా తల్లి కోసమే చేశానని సూరజ్ చెప్తాడు. నన్ను ప్రేమించలేదని కళ్లలోకి చూసి చెప్పు అని జ్యోత్స్న అడుగుతుంది. కానీ సూరజ్ మాత్రం పక్కకు చూసి మాట్లాడతాడు. ఇప్పుడు నీ మనసులో నా మీద ప్రేమ లేదా? మా అమ్మ మీద పగతో నువ్వు ఇలా చేశావంటే నమ్ముతా. కానీ ప్రేమ కూడా అబద్ధం అంటే నమ్మనని జ్యోత్స్న అంటుంది.
జ్యోత్స్న ప్రశ్నలు
మా అమ్మ శత్రువులు నాకూ శత్రువులే అని మండపంలో చెప్పావ్ కదా. నాది కూడా అదే మాట అని సూరజ్ అంటాడు. నన్ను మార్చావ్. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదన్నంతగా మార్చావ్. ఇప్పుడు పగ, ప్రతీకారం కోసం ప్రేమ, పెళ్లిని రద్దు చేసి వెళ్లిపోతే నీ కోసం బతకాలన్న మనిషి ఏమైపోతుందోనని ఆలోచించావా అని జ్యోత్స్న అడుగుతుంది.
జ్యో గుండె ముక్కలు
సూరజ్ అనే మనిషి పరిచయం కాకముందే ఎలా ఉండేదానివో, ఇప్పుడు అలాగే ఉండు అని సూరజ్ సలహా ఇస్తాడు. అలా ఉండలేను. నన్ను మర్చిపోతావా? నా మనసు నీతోనే ఉండిపోతుందని జ్యోత్స్న ఫీల్ అవుతుంది. అన్ని మర్చిపో. నువ్వు కోరుకునే విధంగా మారిపో. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు బతుకు. నా మనసుకు నచ్చినట్లు నేను బతుకుతానని సూరజ్ చెప్పేసరికి జ్యో గుండె ముక్కలు అవుతుంది.
మాలిని షాక్
మరోవైపు దక్షిణామూర్తి ఇంటికి కార్తీక్, దీప వస్తారు. వాళ్లను చూసి మాలిని షాక్ అవుతుంది. పెళ్లి ఆగిపోయిన తర్వాత మీ శివ నారాయణ తాత ఎందుకు మౌనంగా ఉన్నారో మామయ్యకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ముఖం చూడలేక మిమ్మల్ని రాయబారానికి పంపించాడా? సూరజ్ ను తీసుకెళ్తారా? అని మాలిని అంటుంది. మేం వచ్చింది తాత కోసమని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు.
సొంత కూతురేనా?
{{/usCountry}}మరోవైపు దక్షిణామూర్తి ఇంటికి కార్తీక్, దీప వస్తారు. వాళ్లను చూసి మాలిని షాక్ అవుతుంది. పెళ్లి ఆగిపోయిన తర్వాత మీ శివ నారాయణ తాత ఎందుకు మౌనంగా ఉన్నారో మామయ్యకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ముఖం చూడలేక మిమ్మల్ని రాయబారానికి పంపించాడా? సూరజ్ ను తీసుకెళ్తారా? అని మాలిని అంటుంది. మేం వచ్చింది తాత కోసమని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు.
సొంత కూతురేనా?
{{/usCountry}}సుమిత్ర అత్త నీ సొంతకూతురేనా? ఎక్కడైనా దొరికిందా? తాత అని కార్తీక్ అడిగేసరికి దక్షిణామూర్తి మైండ్ బ్లాక్ అవుతుంది. నా సొంత కూతురే అని దక్షిణామూర్తి చెప్తాడు. మరి ఎందుకు సాధించాలనుకుంటున్నావ్? కూతురికి పెళ్లి చేసేముందు నీకు ఇష్టం ఉందా? లేదా? అని అడగాలి. కానీ నువ్వు అడగలేదు. అందుకే ఇష్టమున్న పెళ్లి చేసుకుంది అంతే కదా అని కార్తీక్ అంటాడు.
చావు అంచుల వరకూ
కళ్ల ముందు కనపడట్లేదా నీ అత్త చేసిన పాపం అని చనిపోయిన తన భర్త గురించి మాట్లాడుతుంది మాలిని. నా భర్త చావుకు మీ అత్త కారణం కాదా? అని మాలిని అడుగుతుంది. గతంలో జరిగింది వినడం తప్పా మేం చూడలేదు. తండ్రి చావుకు ప్రతీకారమని నీ మనవడు పెళ్లి వద్దని వచ్చేశాడు. అది భరించలేని మా అత్త చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిందని కార్తీక్ అనగానే దక్షిణామూర్తి కంగారు పడతాడు.
మీ మనవడు చంపేశాడు
సుమిత్రకు ఏమైందని దక్షిణామూర్తి టెన్షన్ గా అడుగుతాడు. కూతురి పెళ్లి ఆగిపోవడంతో బ్రెయిన్ షాక్ కు గురైంది. షాక్ ఇంకాస్త గట్టిగా తగిలి ఉంటే నీ కూతురు ఫొటో ముందు దీపం ఉండేది. పగ కూడా మనిషికి ప్రాణాంతకమైన వ్యాధి తాత. నీ కూతురిని ఈ చేతులతో పెంచావు కదా. ఈ చేతులతో తలకొరివి పెడతావా? జ్యోత్స్న నీ మనవరాలే కదా. మరి ఎందుకు ఇంతపెద్ద శిక్ష వేశాడని తాతను మార్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.
మనసును చంపడము కూడా హత్యే. నా మరదలను నీ మనవడు చంపేశాడు. జ్యోత్స్న మనసు ఈ ఇంట్లోనే ఉంది. ఒక పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుందని అంటారు. కానీ ఇక్కడ రెండు కుటుంబాలు కలిస్తేనే పెళ్లి అవుతుంది. గతాన్ని వదిలేయ్ తాత. నీ కూతురు తన కూతురు కోసం వదిలేస్తుంది. కూతురి కన్నీళ్లు తుడవడానికి తండ్రిని మించిన బంధం ఉండదు. అందరం కలిసిపోదాం తాత అని కార్తీక్ చెప్తాడు. ఈ మాటలకు దక్షిణామూర్తి మారిపోతాడేమోనని మాలిని టెన్షన్ పడుతుంది.
మాలిని ఎమోషనల్ డ్రామా
ఇదంతా వింటున్న మాలిని చప్పట్లు కొడుతుంది. నువ్వు మీ తాత శివ నారాయణ కంటే వంద రెట్లు తెలివైనవాడివి. గొడవకు మాటలతో వచ్చావ్. చేయి పట్టుకొని కూతురి గురించి మాట్లాడితే తన కొడుకు చావును మామయ్య మర్చిపోతారనుకున్నావా? కొడుకు ఎలా చనిపోయాడో, అప్పుడు సుమిత్ర ఏం చేసిందో అన్నీ గుర్తున్నాయని దక్షిణామూర్తిని ఎమోషనల్ గా దెబ్బకొడుతుంది మాలిని.
దీప రిక్వెస్ట్
నేను ఎవరినీ వదిలిపెట్టను. ఇది ఆరంభం మాత్రమేనని మాలిని అంటుంది. ఆ కోపం మా మీద చూపించండి. మేం మీ ఇంట్లోనే ఉంటాం. మీకు సేవల చేస్తాం. మీకూ ఊడిగం చేస్తాం. మీ పగలు, ప్రతీకారాలు మా మీద తీర్చుకోండి. మా సుమిత్రమ్మను ప్రాణాలతో ఉండనివ్వండని దీప రిక్వెస్ట్ చేస్తుంది.
సుమిత్ర తరపున మాట్లాడటానికి ఎవరే నువ్వు? సుమిత్ర కూతురివా, సుమిత్రకు నీకు ఏంటీ బంధం? నువ్వో అనాథవి. మా పగలు, ప్రేమతో నీకు ఏ బంధం లేదు. మీ ఇద్దరిని సుమిత్రే రాయబారానికి పంపిందని అర్థమవుతోందని మాలిని అంటుంది. సూరజ్ తో పర్సనల్ గా మాట్లాడేందుకు కార్తీక్, దీప వెయిట్ చేస్తుంటారు.
నిజం చెప్పేస్తానన్న దాసు
మరోవైపు మాలినికి నువ్వే నా కూతురని చెప్పేస్తానని దాసు అంటాడు. సుమిత్ర వదిన కూతురుగా ఉన్నావ్ కాబట్టే నీకు ఈ శిక్ష. నా కూతురని తెలిస్తే సూరజ్ పెళ్లి చేసుకుంటాడని జ్యోత్స్నతో దాసు అంటాడు. మండపంలో ఎందుకు చెప్పలేదు? నేను సుమిత్ర కూతురిని కాకపోయి ఉంటే నన్ను ప్రేమించేవాడు కాదు. సూరజ్ లో పశ్చాత్తాపం లేదని జ్యో చెప్తుంది.
సూరజ్ మోసం మాత్రమే చేశాడు, అన్యాయం కాదు. వాళ్ల అమ్మ ఏం చెప్తే అదే చేశాడు. ప్రేమ పేరుతో హద్దు దాటలేదు. నా ఒంటి మీద చేయి కూడా వేయలేదు. వాడు జెంటిల్మెన్ నాన్న అని జ్యోత్స్న చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.