Free Shows: కికు చిరంజీవి మైండ్ బ్లాక్ ఆఫర్- ఫస్ట్ డే మార్నింగ్ షోలు ఫ్రీ- హానెస్ట్ రివ్యూ ఇవ్వమంటున్న నిర్మాత దీప్తి!
Kiku Chiranjeevi Morning Shows Free: తెలుగులో సర్వైవల్ థ్రిల్లర్‌గా వస్తోన్న మూవీ కికు చిరంజీవి. తాజాగా ఈ సినిమా బృందం ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఆఫర్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద పోటీ తట్టుకుని నిలబడేందుకు, మొదటి రోజు మార్నింగ్ షోలను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు నిర్మాత దీప్తి నడిమింటి ప్రకటించారు.
Kiku Chiranjeevi Morning Shows Free: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారాంతం సినిమాల హడావుడి బాగా పెరిగింది. ఒకవైపు మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' చిత్రం మంచి వసూళ్లతో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మరోవైపు భారీ అంచనాలతో వచ్చిన యశ్ 'టాక్సిక్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద హోరెత్తిస్తోంది.

తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా
ఇలా రెండు బిగ్గెస్ట్ సినిమాల గట్టి పోటీ మధ్య ఆగస్టు 28న (శుక్రవారం) తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా ఒకటి వస్తోంది. అదే 'కికు చిరంజీవి'. ఈ వైవిధ్యమైన థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 28న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో విడుదల కానుంది.
వినూత్నంగా ప్రమోషనల్ స్టంట్
అయితే, బాక్సాఫీస్ పోటీ ఎంత గట్టిగా ఉన్నప్పటికీ.. తమ సినిమాలోని కంటెంట్‌పై ఉన్న ధీమాతో కికు చిరంజీవి చిత్ర యూనిట్ ఒక వినూత్న ప్రమోషనల్ స్టంట్‌కు తెరలేపింది.
మార్నింగ్ షోలు ఫ్రీ.. నిర్మాత సాహసోపేత నిర్ణయం!
"ఆగస్టు 28న మొదటి రోజు మార్నింగ్ షోలను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమా చూసి తమ నిజాయితీగల అభిప్రాయాన్ని (రివ్యూ) పంచుకోవాలి" అని కికు చిరంజీవి సినిమా నిర్మాత దీప్తి నడిమింటి కోరారు.
మంచి ఓపెనింగ్స్ రావడమే కష్టం
అయితే, చిన్న సినిమాలకు థియేటర్లలో ఓపెనింగ్స్ రావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో, ప్రేక్షకులను రప్పించేందుకు ఫ్రీ షోల ఆఫర్ ప్రకటించడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
గుండె కుడివైపు ఉంటే ఏమవుతుంది? థ్రిల్లింగ్ కాన్సెప్ట్!
సర్వైవల్ డ్రామా థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ కికు చిరంజీవి సినిమాలో కికు యానమల, కశిష్ ఖాన్ హీరో హీరోయిన్లుగా జంటగా నటించారు. సుభా సాయి వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాధారణంగా మనుషులకు గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ, ఈ కథలోని హీరోకు గుండె కుడివైపు ఉంటుంది.
రౌడీల నుంచి ప్రాణాలు కాపాడుకున్నాడా?
దీనిని వైద్య పరిభాషలో 'డెక్స్‌ట్రోకార్డియా' (Dextrocardia) అంటారు. ఇటువంటి అరుదైన శారీరక స్థితి ఉన్న ఒక సాధారణ యువకుడు, తనను వేటాడేందుకు వెంటపడే పలు రౌడీ గ్యాంగ్‌ల నుంచి ఎలా తన ప్రాణాలు కాపాడుకున్నాడనే పాయింట్‌తో ఈ కికు చిరంజీవి సినిమా నడుస్తుంది.
కికు చిరంజీవి నటీనటులు, శేఖర్ చంద్ర సంగీతం
కాగా, కికు చిరంజీవి చిత్రంలో హీరో హీరోయిన్లతోపాటు ఈశ్వరీ రావు, తనికళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ వంటి సీనియర్ నటులు బలమైన పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌కు ప్రధాన బలంగా నిలవనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


