Kingdom Villain Venkitesh VP On Water Crisis: తాగునీరు అనేది ప్రతి మనిషి కనీస అవసరం. దానికోసం కూడా జనం అల్లాడిపోతుంటే చూస్తూ ఊరుకోలేం అని చాలామంది భావిస్తుంటారు. కేరళ రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం) నగరంలో ప్రస్తుతం ఇలాంటి దారుణమైన పరిస్థితే నెలకొంది.
ప్రజల తాగునీటి కష్టాలపై

విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన టాలీవుడ్ చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు, విలన్ వెంకటేష్ వీపీ (Venkitesh VP) అక్కడి ప్రజల తాగునీటి కష్టాలపై సోషల్ మీడియా ద్వారా గళమెత్తారు. తన నివాస ప్రాంతంలో చుక్క నీరు రాక జనం పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
అర్ధరాత్రి వచ్చే నీళ్లు కూడా బంద్.. మహిళల ఆవేదన
నటుడు వెంకటేష్ వీపీ తిరువనంతపురంలోని ‘ఫోర్ట్ వార్డ్’ కాలనీలో నివసిస్తున్నారు. గత ఆరు, ఏడు నెలలుగా తమ ప్రాంతంలో నీటి సరఫరా దారుణంగా తయారైందని ఆయన ఆరోపించారు. పగలు మొత్తం నీళ్లు రాకుండా, కేవలం అర్ధరాత్రి వేళల్లో మాత్రమే కొద్దిసేపు నీటిని సరఫరా చేసేవారని, గత వారం రోజులుగా ఆ అర్ధరాత్రి సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిందని స్థానికులు మండిపడుతున్నారు.
"పక్కనే ఉన్న తమిళనాడులో కూడా ఇంతటి నీటి కరువు ఉండదేమో! అసలు నీళ్లు లేకపోతే పీరియడ్స్ సమయంలో మహిళలు ఎంత నరకం అనుభవించాలో అధికారులు ఆలోచిస్తున్నారా?" అని ఆ వీడియోలో ఒక మహిళా నివాసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో నటుడు వెంకటేష్ స్వయంగా రంగంలోకి దిగి జనం గొంతుకగా మారారు.
మంత్రి సమాధానం.. ఎల్ నినో ప్రభావమే కారణం
కేరళలోని తీవ్ర విద్యుత్ కొరత, జలాశయాల్లో అడుగంటిన నీటి మట్టాలపై ఆ రాష్ట్ర మంత్రి సన్నీ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో (El Niño) ప్రభావం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు.
{{/usCountry}}కేరళలోని తీవ్ర విద్యుత్ కొరత, జలాశయాల్లో అడుగంటిన నీటి మట్టాలపై ఆ రాష్ట్ర మంత్రి సన్నీ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో (El Niño) ప్రభావం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు.
{{/usCountry}}"జూన్ 2025లో మన జలాశయాల్లో నీటి మట్టం 47 శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ నాటికి అది కేవలం 21 శాతానికి పడిపోయింది" అని మంత్రి సన్నీ జోసెఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ లాంటి నదులు, పచ్చదనంతో నిండిన రాష్ట్రంలోనే జలాశయాలు ఈ స్థాయిలో ఎండిపోవడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది.
ముఖ్యమంత్రి, మేయర్‌లకు ట్యాగ్ చేసిన నటుడు
ఈ సమస్య కేవలం తన కాలనీకే పరిమితం కాలేదని, తిరువనంతపురం నగరంలోని శ్రీవరాహం, శ్రీకంటేశ్వరం, మణకాడు, కమలేశ్వరం, వల్లక్కడవు వంటి మరో 13 వార్డులలో ప్రజలు చుక్క తాగునీటి కోసం అల్లాడుతున్నారని వెంకటేష్ తెలిపారు. సమస్య తీవ్రతను వివరిస్తూ ఆయన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నగర మేయర్, జిల్లా కలెక్టర్‌లను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. తక్షణమే స్పందించి తాగునీటి ఇబ్బందులను తీర్చాలని డిమాండ్ చేశారు.
‘మిళి తురక్కు’ సినిమాతో
2014లో ‘మిళి తురక్కు’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వెంకటేష్, ఆ తర్వాత ‘లవ్‌ఫుల్లీ యువర్స్ వేద’ (2023) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో జీవీ ప్రకాష్ కుమార్ సరసన ‘రెబెల్’ సినిమాతో కోలీవుడ్‌లో మెరిశారు.
విలన్ కాదు హీరో
ఇక 2025లో తెలుగులో భారీ తారాగణంతో వచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమాలో విలన్ పాత్ర పోషించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ మూవీలో విలన్‌గా చేసి సమాజంలో సామాన్యుల సమస్యలపై గళమెత్తి రియల్ హీరో అనిపించుకున్నారు వెంకటేష్ వీపీ.