Kriti Sanon Sold 4 Apartments Reasons Here: సినీ తారలు కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ భారీగా లాభాలు అర్జిస్తుంటారు. మన టాలీవుడ్‌లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాలలో హీరో హీరోయిన్లు ఇళ్లు కొని ఎలా లాభాలు సాధిస్తారో, బాలీవుడ్‌లోనూ అదే క్రయ విక్రయ ట్రెండ్ నడుస్తోంది.
ఒకేసారి నాలుగు ఇళ్లను

అయితే, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన తల్లి గీతా సనన్, సోదరి నుపుర్ సనన్‌లతో కలిసి ముంబైలో ఉన్న నాలుగు లగ్జరీ అపార్ట్‌మెంట్లను ఒకేసారి విక్రయించి వార్తల్లో నిలిచారు. ముంబైలోని అత్యంత డిమాండ్ ఉన్న అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ఇళ్లను భారీ ధరకు అమ్మేశారు కృతి సనన్.
కొనుగోలుదారు ఎవరంటే?
ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'స్క్వేర్ యార్డ్స్' సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. కృతి సనన్ కుటుంబం నుంచి ఈ నాలుగు ఫ్లాట్లను ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా కొనుగోలు చేశారు. మొత్తం నాలుగు వేర్వేరు లావాదేవీల ద్వారా ఈ విక్రయ ప్రక్రియ పూర్తయింది.
ఈ ఏడాది ఏప్రిల్ 24, 2026న ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారికంగా ముగిసింది. ముంబైలోని ప్రముఖ 'రహేజా క్లాసిక్' బిల్డింగ్‌లో ఈ ఫ్లాట్లు ఉన్నాయి. కృతి సనన్ ఇటీవలే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ. 78 కోట్ల విలువైన సీ-ఫేసింగ్ లగ్జరీ పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బహుశా అందుకే పాత ప్రాపర్టీలను కృతి సనన్ విక్రయించి ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
పెట్టుబడికి రెట్టింపు లాభం
సనన్ కుటుంబం ఈ నాలుగు అపార్ట్‌మెంట్లను 2013 నుంచి 2017 మధ్య కాలంలో విడతల వారీగా కొనుగోలు చేసింది. అప్పట్లో వీటన్నింటికీ కలిపి వీరు పెట్టిన పెట్టుబడి సుమారు రూ. 4.31 కోట్లు మాత్రమే. తాజాగా ముఖేష్ ఛాబ్రాకు ఈ ఇళ్లను మొత్తం రూ. 8.9 కోట్లకు విక్రయించారు.
{{/usCountry}}సనన్ కుటుంబం ఈ నాలుగు అపార్ట్‌మెంట్లను 2013 నుంచి 2017 మధ్య కాలంలో విడతల వారీగా కొనుగోలు చేసింది. అప్పట్లో వీటన్నింటికీ కలిపి వీరు పెట్టిన పెట్టుబడి సుమారు రూ. 4.31 కోట్లు మాత్రమే. తాజాగా ముఖేష్ ఛాబ్రాకు ఈ ఇళ్లను మొత్తం రూ. 8.9 కోట్లకు విక్రయించారు.
{{/usCountry}}అంటే, దాదాపు 9 నుంచి 13 ఏళ్ల వ్యవధిలో కృతి సనన్ కుటుంబానికి ఏకంగా రూ. 4.6 కోట్ల నికర లాభం లభించింది. శాతాల పరంగా చూస్తే ఇది దాదాపు 107 శాతం క్యాపిటల్ గెయిన్ కావడం అనుకోవచ్చు.
అపార్ట్‌మెంట్ల పూర్తి వివరాలు, స్టాంప్ డ్యూటీ
ఈ నాలుగు ఇళ్లలో రెండు పెద్ద అపార్ట్‌మెంట్లు కాగా, మిగిలిన రెండు కాస్త చిన్నవి. రహేజా క్లాసిక్‌లో ఉన్న రెండు పెద్ద ఫ్లాట్లు ఒక్కొక్కటి రూ. 3.23 కోట్లకు అమ్ముడయ్యాయి. వీటిలో ప్రతి ఫ్లాట్ బిల్ట్-అప్ ఏరియా 654.23 చదరపు అడుగులు ఉంటుంది. వీటికి ఒక్కో కారు పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.
ఈ రెండు పెద్ద ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్క దానికి రూ. 19.41 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ రెండు ఫ్లాట్లను జూలై 2013లో కృతి తల్లి గీతా సనన్ రూ. 1.40 కోట్లకు కొనుగోలు చేశారు.
మిగిలిన రెండు చిన్నవి
అదే బిల్డింగ్‌లో ఉన్న మిగిలిన రెండు చిన్న అపార్ట్‌మెంట్లు ఒక్కొక్కటి రూ. 1.21 కోట్లకు అమ్ముడయ్యాయి. వీటి బిల్ట్-అప్ ఏరియా 246.06 చదరపు అడుగులు. ఈ చిన్న ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో దానికి రూ. 7.29 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయ్యాయి. ఈ రెండు ఫ్లాట్లను జూన్ 2017లో కృతి సనన్, ఆమె సోదరి నుపుర్ సనన్ కలిసి రూ. 2.90 కోట్లకు కొన్నారు.
అంధేరీ వెస్ట్‌కు ఎందుకంత క్రేజ్?
"ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అంధేరీ వెస్ట్‌కు ఎప్పుడూ తిరుగులేని డిమాండ్ ఉంటుంది" అని స్క్వేర్ యార్డ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. మన హైదరాబాద్‌లోని ఫిలింనగర్ లాగే ముంబైలో అంధేరీ వెస్ట్ ప్రాంతం సినీ ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, లింక్ రోడ్, మెట్రో నెట్‌వర్క్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి రవాణా సౌకర్యాలు ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంటాయి. దీనికి తోడు ఫిల్మ్ సిటీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), సీప్జ్ (SEEPZ) వంటి ప్రధాన ఉపాధి, వినోద కేంద్రాలు పక్కనే ఉండటంతో ఇక్కడ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పలుకుతోంది.