DC Release Trailer Out In Telugu: 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ' (DC) రిలీజ్ ట్రైలర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది.
తెలుగులో కూడా డీసీ రిలీజ్ ట్రైలర్

తమిళంతోపాటుగా తెలుగులోనూ డీసీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2 నిమిషాల 32 సెకన్ల నిడివి ఉన్న ఈ డీసీ రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితమైన సీన్లు, రక్తపాతం, బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'దేవదాస్' వేట.. ముక్కోణపు పోరాటం
డీసీ ట్రైలర్ పరిశీలిస్తే, లోకేష్ కనగరాజ్ ఇందులో 'దేవదాస్' అనే సీరియస్ పాత్రలో కనిపిస్తున్నారు. తన గతాన్ని, పోలీసులను దాటుకుని పారిపోతున్న దేవదాస్ జీవితం ఒక పోలీస్ అధికారి హత్యతో ఊహించని మలుపు తిరుగుతుంది.
పోలీసుల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా
ఆ హత్యతో పాటు దొంగిలించిన ఆయుధాల ముఠా కేస్ కూడా దేవదాస్‌ను చుట్టుముడుతుంది. క్రిమినల్స్, తీవ్రవాదులు, పోలీసుల మధ్య చిక్కుకున్న ఒక వ్యక్తి పోరాటాన్ని లోకేష్ తన అభినయంతో చాలా భావోద్వేగంగా పండించారు.
ప్రేమ, త్యాగం.. గ్యాంగ్‌స్టర్ కథనంలో కొత్త కోణం
ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో దేవదాస్‌కు విధివశాత్తు 'చంద్ర' (వామికా గబ్బి) పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య చిగురించిన బంధం, మోసం, త్యాగం, ప్రాణభయం మధ్య ఎలా సాగిందనేది ఆసక్తికరంగా చూపించారు. దేవదాస్ జీవితంలో కాసేపు ప్రశాంతత నింపే 'పార్వతి' పాత్రలో మరో హీరోయిన్ సంజన కృష్ణమూర్తి కనిపిస్తారు.
పోలీసులే నేరానికి పాల్పడితే
"వ్యవస్థలో నేరం జరిగితే పోలీసులు వచ్చి విచారిస్తారు. అదే పోలీసులే నేరానికి పాల్పడితే వారిని ఎవరు ప్రశ్నిస్తారు?" అని ట్రైలర్లో వచ్చే సంభాషణ కథలోని అసలు నిజాన్ని బయటపెడుతోంది.
అరుణ్ మాథేశ్వరన్ విజన్.. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్
{{/usCountry}}"వ్యవస్థలో నేరం జరిగితే పోలీసులు వచ్చి విచారిస్తారు. అదే పోలీసులే నేరానికి పాల్పడితే వారిని ఎవరు ప్రశ్నిస్తారు?" అని ట్రైలర్లో వచ్చే సంభాషణ కథలోని అసలు నిజాన్ని బయటపెడుతోంది.
అరుణ్ మాథేశ్వరన్ విజన్.. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్
{{/usCountry}}'రాకీ', 'సానీ కాయిదం', 'కెప్టెన్ మిల్లర్' వంటి రఫ్ అండ్ రా చిత్రాలను అందించిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం మరో ప్లస్ పాయింట్. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 15 పాటల ఆల్బమ్‌ను స్వరపరిచారు.
ఆగస్ట్ 7న డీసీ రిలీజ్
హై-వోల్టేజ్ సీన్లకు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ముకేశ్ జి సినిమాటోగ్రఫీ, జి.కె. ప్రసన్న ఎడిటింగ్ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2026 ఆగస్టు 7న విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇద్దరు భామలతో లోకేష్ కనగరాజ్
ఉత్తరాది మార్కెట్‌లో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ పంపిణీ చేస్తోంది. డైరెక్టర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ హీరోగా మారడం, అది కూడా ఇద్దరు భామలతో నటించడం, యాక్షన్ విధ్వంసం, రక్తపాతంతో నిండినటువంటి సీన్లతో డీసీ సినిమా సాగడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.