Lust Stories 3 Trailer: ప్రేమ, బంధాలు, కోరికలు, ఎమోషనల్ డ్రామాను బోల్డ్‌గా ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ 'లస్ట్ స్టోరీస్' నుంచి మూడో పార్ట్ వచ్చేస్తోంది. ప్రముఖ దర్శక నిర్మాతలు విక్రమాదిత్య మోట్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్‌లు సంయుక్తంగా తెరకెక్కించిన 'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (సెప్టెంబర్ 9) రిలీజ్ చేసింది.
లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్

లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ లో విభిన్న సామాజిక నేపథ్యాలు కలిగిన నలుగురు వ్యక్తుల జీవితాలలో కోరికలు, పెళ్లి జీవితం, కామెడీని చూపించారు. లస్ట్ స్టోరీస్ ఫ్రాంఛైజీ లెగసీని కొనసాగిస్తూ ఈ మూడో సీజన్ కూడా నాలుగు కథల ఆంథాలజీ బోల్డ్ మూవీగా తెరకెక్కింది. ఇందులో రియల్ లైఫ్ కపుల్ అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ కలిసి రొమాన్స్ చేయడం గమనార్హం.
ఆకట్టుకున్న ట్రైలర్ డైలాగులు
లస్ట్ స్టోరీస్ ట్రైలర్ మానవ సంబంధాలలోని భిన్నమైన కోణాలను పరిచయం చేసింది. మహిళల మనోభావాలు, సెక్స్ పట్ల సమాజంలో ఉన్న దృక్పథాన్ని వివరిస్తూ ఒక పాత్ర చెప్పే సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. మహిళలు స్విచ్ వేస్తే వెంటనే వెలిగే బల్బులు కాదని, వారు నిదానంగా కరిగే ప్రమిదల వంటి వారని చెప్పే పోలిక ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మరొక సన్నివేశంలో అదితి రావు హైదరీ విద్యార్థులతో మాట్లాడుతూ.. అశ్లీలత అనేది ఉపయోగించే భాషలో ఉండదని, రాసే రచయిత ఉద్దేశం. సృష్టిలోని సౌందర్యంపై ఆధారపడి ఉంటుందని చెప్పే డైలాగ్ కాన్సెప్ట్ తీవ్రతను చాటిచెప్పింది. కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టేల మధ్య నడిచే సరదా కొరియన్ సంభాషణలు డార్క్ కామెడీని పండించాయి.
ఈ స్టార్లు
బాలీవుడ్ వర్సటైల్ నటీనటులు కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే, అదితి రావు హైదరీ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీలు ఈ ఆంథాలజీలోని నాలుగు కథలలో కీలక పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన లస్ట్ స్టోరీస్ మొదటి రెండు భాగాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ వ్యూయర్ షిప్ సాధించాయి.
లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ
{{/usCountry}}బాలీవుడ్ వర్సటైల్ నటీనటులు కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే, అదితి రావు హైదరీ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీలు ఈ ఆంథాలజీలోని నాలుగు కథలలో కీలక పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన లస్ట్ స్టోరీస్ మొదటి రెండు భాగాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ వ్యూయర్ షిప్ సాధించాయి.
లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ
{{/usCountry}}ఈ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ ఆంథాలజీ మూవీ లస్ట్ స్టోరీస్ 3 ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానుంది. బోల్డ్ కంటెంట్‌తో పాటు ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ కలయికగా రూపుదిద్దుకున్న 'లస్ట్ స్టోరీస్ 3' డిజిటల్ ప్రియులకు అద్భుతమైన వీక్షణ అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. హిందీతో పాటు ప్రధాన దక్షిణ భారతీ భాషల్లో కూడా ఈ ఆంథాలజీ డిజిటల్ ప్రీమియర్ కానుంది.