టైటిల్: మదం

నటీనటులు: ఇనయా సుల్తానా, హర్ష గంగవరపు, అనురూప్, లతా రెడ్డి, అనురూప్ కొటారి, హేమ పాప్, మిర్యాల రవి, జంగం వెంకటేష్ తదితరులు
కథ: రమేష్ బాబు కోయ, వంశీకృష్ణ మల్లా
దర్శకత్వం: వంశీకృష్ణ మల్లా
సంగీతం: దేవ్‌జాండ్
సినిమాటోగ్రఫీ: రవి వల్లెపు
నిర్మాతలు: సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ
విడుదల తేది: 1 జనవరి 2026
చాలా కాలం తర్వాత బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా నటించిన సినిమా మదం. రా అండ్ రస్టిక్‌గా లైంగిక కోరికలు, ప్రతికారం, యాక్షన్, డ్రామా అంశాల చుట్టూ సాగే కథగా మదంను రూపొందించారు. బోల్డ్ రొమాంటిక్ రా అండ్ రస్టిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు.
ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన మదం ట్రైలర్ పచ్చిగా, బోల్డ్‌గా టాక్ తెచ్చుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్లలో మదం విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మదం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
1980వ దశకంలో ఒక నిరుపేద కుటుంబం చుట్టూ కథ తిరుగుతుంది. ఒక అవినీతి పోలీస్ అధికారి, అతని భార్య తమ స్వార్థం కోసం ఆ పేద కుటుంబాన్ని ఎలా సర్వనాశనం చేశారనేది ఈ సినిమా కథాంశం. ఈ క్రమంలో మధ్యలోకి ఇనయా సుల్తానా (బిగ్ బాస్ ఫేమ్) పాత్ర ప్రవేశిస్తుంది.
ఆమె తన లైంగిక వాంఛలతో, వింత ప్రవర్తన వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా విధ్వంసకర సంఘటనలు జరుగుతాయి. ముగ్గురు వ్యక్తులతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటీ? దానివల్ల పేద కుటుంబం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది?, న్యాయ పోరాటం చేసిన హీరోకు ఏమైంది? పోలీస్ ఆఫీసర్ కథ ఏంటీ? హీరోకు న్యాయం దక్కిందా? లేదా? తెలియాలంటే మదం చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఆమె తన లైంగిక వాంఛలతో, వింత ప్రవర్తన వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా విధ్వంసకర సంఘటనలు జరుగుతాయి. ముగ్గురు వ్యక్తులతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటీ? దానివల్ల పేద కుటుంబం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది?, న్యాయ పోరాటం చేసిన హీరోకు ఏమైంది? పోలీస్ ఆఫీసర్ కథ ఏంటీ? హీరోకు న్యాయం దక్కిందా? లేదా? తెలియాలంటే మదం చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}మదం సినిమా టైటిల్‌కి తగినట్లే పాత్రల తీరు ఉంటుంది. లైంగిక వాంఛల గురించి మాత్రమే కాకుండా అంతకంటే లోతుగా పాత్రల్లోని మానసికకతను చెప్పేలా ఉంటాయి. ఇందులో బోల్డ్ సీన్లు ఉన్నప్పటికీ అవి కేవలం ప్రేక్షకుల కోసం పెట్టినట్లు అనిపించవు. ఎంచుకున్న కథకు అనుగుణంగా సాగుతాయి.
ఒక మహిళ తన శరీరాన్ని, కోపాన్ని ఆయుధాలుగా మలుచుకుని ఇతరులను ఎలా భయపెడుతుందో ఇందులో చూడొచ్చు. ఆ యూనిక్ పాయింట్‌తో మదంను తెరకెక్కించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా జడ్జ్ చేయలేనంతగా గొప్పగా మలిచారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.
ఆ ముగింపు ప్రేక్షకులను ఒక్క క్షణం షాక్‌కు గురి చేస్తుంది. మిగతా సీన్స్, ప్రొసిడింగ్స్ అన్ని పచ్చిగా, బోల్డ్‌గా సాగుతాయి. రా అండ్ రస్టిక్‌గా సీన్స్, పాత్రల తీరు, డైలాగ్స్ ఉంటాయి. చాలా మందితో అఫైర్స్, అందుకు కారణాలు, వాటి ప్రభావం వంటి విషయాలు బాగానే చూపించారు.
నటీనటుల పనితీరు
మదం సినిమా అంతా ఇనయా సుల్తానా చుట్టూ సాగుతుంది. అంతేకాకుండా ఇనయా సైతం తన భుజస్కంధాలపైన సినిమాను నడిపించింది. ముఖ్యంగా బోల్డ్, అగ్రెసివ్ మహిళగా ఇనయా సుల్తానా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె తన పాత్రలో ఉన్న గందరగోళం, భయం కలిగించే తీరు తెలుగు తెరపై అద్భుతంగా ఉంది.
హర్ష, అనురూప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. లత రెడ్డి, హేమ పాప్ ఇతర నటీనటులు కథకు బలాన్ని చేకూర్చేలా మెప్పించారు. ఇక సాంకేతికపరంగా చూస్తే.. డైరెక్టర్ వంశీ కృష్ణ సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ప్రతి సీన్ రియల్ లైఫ్‌లో కనిపించినట్లుగా అనిపిస్తుంది. రవికుమార్ ఫోటోగ్రఫీ 80ల నాటి వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించింది.
టెక్నికల్ అంశాలు
స్టూడియో సెట్టింగులు కాకుండా నిజమైన లొకేషన్లలో షూట్ చేయడం సినిమాకు చాలా రస్టిక్, రియలిస్టిక్ ఫ్లేవర్ ఫీల్ కలిగింది. అది సినిమాకు ప్లస్ అయింది. ‘ఈగల్’ ఫేమ్ దేవ్‌జాండ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆ బీజీఎమ్ సన్నివేశాల ఎఫెక్ట్స్‌ను మరింత పెంచింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే
మదం ఒక పచ్చి నిజం లాంటి సినిమా. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, హార్డ్ హిట్టింగ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది తప్పక నచ్చుతుంది. అద్భుతమైన రియలిస్టిక్ నటన, గుండె బరువెక్కిపోయే క్లైమాక్స్‌తో సాగే మదం మూవీపై ఫ్యామిలీతో కాకుండా సింగిల్‌గా లుక్కేయడం బెటర్.