...
...
Next Story

Madhuri Dixit:ఆయన చాలా డేంజరస్, ఫ్రెష్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా కష్టం- మాధురీ దీక్షిత్ కామెంట్స్-ఓటీటీలోకి క్రైమ్ కామెడీ

Madhuri Dixit On Comedy Over Maa Behen OTT Streaming: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ఓటీటీ క్రైమ్ కామెడీ మూవీ మా బెహన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా బెహన్ ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా ఆయన చాలా డేంజరస్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మాధురీ దీక్షిత్.

Published on: Jun 2, 2026, 10:46:48 IST
Advertisement

Madhuri Dixit On Maa Behen Director Over OTT Release: బాలీవుడ్ ధక్ ధక్ గర్ల్ మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) పేరు వినగానే అద్భుతమైన నటన, అమోఘమైన డ్యాన్స్ హావభావాలు గుర్తుకొస్తాయి. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె చేయని ప్రయోగాలు లేవు. అయితే, గత కొంతకాలంగా సీరియస్, ఎమోషనల్ పాత్రలకే పరిమితమైన మాధురీ.. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ నవ్వించేందుకు సిద్ధమయ్యారు.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్

ఆయన చాలా డేంజరస్, ఫ్రెష్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా కష్టం- మాధురీ దీక్షిత్ కామెంట్స్- ఓటీటీలోకి క్రైమ్ కామెడీ!
ఆయన చాలా డేంజరస్, ఫ్రెష్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా కష్టం- మాధురీ దీక్షిత్ కామెంట్స్- ఓటీటీలోకి క్రైమ్ కామెడీ!

సురేష్ త్రివేణి దర్శకత్వంలో మాధురీ దీక్షిత్ నటించిన సరికొత్త ఓటీటీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'మా బెహన్' (Maa Behen) స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో మా బెహన్ ఓటీటీ రిలీజ్ కానుంది. జూన్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మా బెహన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

ఈ సందర్భంగా మా బెహన్ ఓటీటీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ సీనియర్ గ్లామరస్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సినిమా ముచ్చట్లను పంచుకున్నారు. కెరీర్‌లో ఈ దశలో కూడా వైవిధ్యమైన కథలు రావడంపై మాధురి స్పందిస్తూ.. "ఇలాంటి అవకాశాలు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కథ వినగానే వెనుకాడకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను" అని చెప్పారు.

కథ చెప్పిన విధానం బాగా నచ్చింది

దర్శకుడు సురేష్ త్రివేణి కథ చెప్పిన విధానం తనకు బాగా నచ్చిందని మాధురి గుర్తుచేసుకున్నారు. "దర్శకుడిగా ఆయన చాలా డేంజరస్. సీన్లు వివరించేటప్పుడు ఆయనే స్వయంగా నటించి చూపిస్తారు. అది చూశాక మనం అంతకంటే బాగా చేయాలనే కసి పెరుగుతుంది. ఆయన నరేషన్ నచ్చి, కథను మరోసారి చెప్పమని అడిగాను. కథ వింటున్నప్పుడే సినిమా మొత్తం నా కళ్లముందు కదలాడింది. మధ్యలో కొన్ని సీరియస్ సినిమాలు చేయడం వల్ల ఈ కామెడీ స్క్రిప్ట్ నాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇచ్చింద" అని మాధురీ దీక్షిత్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

కామెడీ చేయడం అంత సులువు కాదు!

90వ దశకంలో వచ్చిన 'తేజాబ్', 'రాజా', 'దిల్' వంటి సూపర్ హిట్ మసాలా చిత్రాల్లో మాధురి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమాల్లో యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్నీ కలగలిసి ఉండేవని, కానీ పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రంలో నటించి చాలా కాలం అయిందని 59 ఏళ్ల మాధురి తెలిపారు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ తనకు బాగా నచ్చిందని చెప్పారు.

ఎప్పుడూ చూడని సరికొత్త అవతారంలో..

ముంబైలో జరిగిన ఈ సినిమా మా బెహన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సహ నటుడు రవి కిషన్ కూడా మాధురి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మాధురీ దీక్షిత్‌ను ఇప్పటివరకు ఇలాంటి సరికొత్త పాత్రలో ఎవరూ చూసి ఉండరు" అని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రేజీ మూవీలో మాధురీ దీక్షిత్‌తో పాటు టాలెంటెడ్ బ్యూటీ తృప్తి డిమ్రి, ధర్నా దుర్గా, రవి కిషన్ కీలక పాత్రలు పోషించారు. ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే ఈ ఫన్ రైడ్ ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe