...
...
Next Story

పూర్తిగా మారిపోయిన మహేష్ బాబు-క్లీన్ షేవ్‌తో కొత్త లుక్‌-శ్రీరాముడి గెట‌ప్ కోస‌మేనా? ఫొటో వైర‌ల్‌

మహేష్ బాబు కొత్త లుక్ చూశారా? క్రిస్మస్ సందర్భంగా ఫ్యామిలీతో పాటు ఆయన దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింగ్ తెగ వైరల్ గా మారింది. ఇందులో ఆయన క్లీన్ షేవ్ తో ఉండటమే కారణం. వారణాసి సినిమాలోని శ్రీరాముడి గెటప్ కోసమే మహేష్ ఇలా రెడీ అయ్యారని ఫ్యాన్స్ అంటున్నారు.

Published on: Dec 25, 2025, 13:43:59 IST
Advertisement

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది. అంటే వివిధ కాలాల్లో, వివిధ ఖండాల్లో జరిగే కథగా వారణాసిని రెడీ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో హీరో అయిన మహేష్ బాబు కొత్త లుక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

మహేష్ బాబు న్యూ లుక్

భార్య, పిల్లలతో మహేష్ బాబు (x/MBofficialTeam)
భార్య, పిల్లలతో మహేష్ బాబు (x/MBofficialTeam)

వారణాసి కోసం మహేష్ బాబు ఇన్ని రోజులు జులపాల జుట్టు, గడ్డంతో కనిపించారు. మూడు రోజుల కింద ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో ఆయన ఈ లుక్ తో ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడేమో సడెన్ గా గడ్డం తీసేసి, పూర్తి క్లీన్ షేవ్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేష్. క్రిస్మస్ సందర్భంగా తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి మహేష్ దిగిన ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేష్ క్లీన్ షేవ్ తో కనిపించారు.

శ్రీరాముడి గెటప్

వారణాసి సినిమా షూటింగ్ కు ముందు ఓ సారి మహేష్ బాబును శ్రీరాముడి గెటప్ లో చూసి తనకు గూస్ బంప్స్ వచ్చాయని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. అప్పుడే వారణాసి సినిమాకు రామాయణంతో లింక్ ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఈ మూవీలో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇలా క్లీన్ షేవ్ తో ఈ సూపర్ స్టార్ కనిపించడంతో శ్రీరాముడి గెటప్ కోసమే ఇలా మేకోవర్ చేసుకున్నారనే కామెంట్లు వస్తున్నాయి.

ఫస్ట్ టైమ్

వారణాసి సినిమాను రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇదో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రెడీ అవుతోంది. ఈ మూవీ టైటిల్, టీజర్, ఫస్ట్ లుక్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. గ్లోబ్ ట్రాటర్ సాంగ్ కూడా ఊపేస్తోంది. వారణాసి సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe