బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఫిట్‌నెస్ ఫ్రీక్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసులోనూ తన గ్లామర్, డ్యాన్స్ మూవ్స్‌తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంటారు. ఇటీవల ఆమె హనీ సింగ్‌తో కలిసి చేసిన ఆల్బమ్, అలాగే ‘థామా’ చిత్రంలో రష్మిక మందన్నాతో చేసిన స్పెషల్ సాంగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.

అయితే, ఈ వయసులో ఇలాంటి ‘ఐటమ్ సాంగ్స్’ అవసరమా అంటూ సోషల్ మీడియాలో మలైకా అరోరాపై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మలైకా ఈ విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది మలైక అరోరా.
అందులో తప్పేముంది?
"నేను ఈ ఇమేజ్‌ను ఎందుకు వదులుకోవాలి? దీని గురించి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది?" అని మలైకా సూటిగా ప్రశ్నించారు. "చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, ట్రోల్ చేస్తారు. కానీ, ఇందులో అంత పెద్ద తప్పు ఏముందో నాకు అర్థం కావడం లేదు. డ్యాన్స్ అనేది ఒక కళాత్మక వ్యక్తీకరణ. 50 ఏళ్ల వయసులో కూడా నేను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే నేను గర్వపడుతున్నాను. అంటే నేను ఏదో ఒక విషయంలో సరైన బాటలోనే ఉన్నానని నా నమ్మకం" అని మలైకా అరోరా వివరించారు.
మహిళలకు ఇదొక స్ఫూర్తి ఈ స్టేజ్‌లో డ్యాన్స్ నంబర్లు చేయడం తనకు ఎంతో శక్తినిస్తుందని (Empowering), ఇది మహిళ సాధికారత అని మలైకా పేర్కొన్నారు. "ఇది నాకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. నన్ను చూసి బయట ఉన్న మహిళలు కూడా స్ఫూర్తి పొందితే, వారు కూడా ఏదైనా సాధించగలమని భావిస్తే.. నా పని పూర్తయినట్లే. వయసుతో సంబంధం లేకుండా మనకు నచ్చినట్లు ఉండటమే అసలైన విజయం" అని మలైకా ధీమాగా చెప్పారు.
రష్మికను వెనక్కి నెట్టేసిన మలైకా!
ఇకపోతే మలైకా అరోరా కెరీర్లో ‘ఛయ్య ఛయ్య’, ‘మున్నీ బద్నామ్’, ‘అనార్కలీ డిస్కో చలీ’ వంటి ఎన్నో ఐకానిక్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. 2025లో వచ్చిన ‘థామ’ చిత్రంలో రష్మిక మందన్నతో కలిసి ‘పాయిజన్ బేబీ’ అనే పాటలో మలైకా మెరిశారు. ఆ పాటలో మలైకా గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
{{/usCountry}}ఇకపోతే మలైకా అరోరా కెరీర్లో ‘ఛయ్య ఛయ్య’, ‘మున్నీ బద్నామ్’, ‘అనార్కలీ డిస్కో చలీ’ వంటి ఎన్నో ఐకానిక్ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. 2025లో వచ్చిన ‘థామ’ చిత్రంలో రష్మిక మందన్నతో కలిసి ‘పాయిజన్ బేబీ’ అనే పాటలో మలైకా మెరిశారు. ఆ పాటలో మలైకా గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
{{/usCountry}}రష్మిక కంటే మలైకానే హైలైట్ అయ్యారంటూ అప్పట్లో కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ‘చిల్‌గమ్’ అనే మ్యూజిక్ వీడియోలో మలైకా అరోరా చేసిన బోల్డ్ స్టెప్స్ విమర్శలకు దారితీసినా.. ఆమె మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
బుక్ రాస్తున్న మలైకా
కాగా, మలైకా కేవలం డ్యాన్స్‌కే పరిమితం కాకుండా ‘ఇట్స్ ఈజీ టు బి హెల్తీ’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఇటీవల ముగిసిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ సీజన్ 11కు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, షాన్‌లతో కలిసి మలైకా జడ్జిగా వ్యవహరించారు. ఈ షో ఈ ఏడాది జనవరి 4న ఘనంగా ముగిసింది.