మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు సామాన్యులనే కాకుండా సెలబ్రిటీల కుటుంబాలను కూడా ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ మలైకా అరోరా, అమృతా అరోరా తల్లి జాయిస్ పాలికార్ప్ ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న (Missile Interception) భయానక దృశ్యాలను తాను కళ్లారా చూశానని ఆమె పేర్కొన్నారు.
బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇంతలో యుద్ధం

తన పుట్టినరోజు వేడుకల కోసం దుబాయ్‌లో మలైకా సోదరి అమృతా అరోరా దగ్గరికి జాయిస్ పాలికార్ప్ వెళ్లారు. అక్కడే తన పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. "నేను మార్చి 3న ముంబై తిరిగి రావాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా విమానాలన్నీ రద్దయ్యాయని మెసేజ్ వచ్చింది" అని ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ జాయిస్ పాలికార్ప్ వెల్లడించారు.
సైన్యంపై నమ్మకం.. కుమార్తెలతో నిత్యం టచ్‌లో..
అక్కడి పరిస్థితుల గురించి వివరిస్తూ.. "ఆకాశంలో క్షిపణులు ఒకదాన్నొకటి ఢీకొని పేలిపోతుంటే చూడటానికి చాలా భయంగా అనిపించింది. కానీ, ఇక్కడి సైన్యం చేస్తున్న పని అద్భుతం. నేను సురక్షితంగా ఉన్నానని నా కుమార్తెలకు తెలుసు. వారు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని విమానాలు మళ్లీ మొదలయ్యాయని తెలిసింది, త్వరలోనే ముంబై చేరుకుంటానని ఆశిస్తున్నాను" అని జాయిస్ పాలికార్ప్ ధీమా వ్యక్తం చేశారు.
అమ్మే మా వెన్నెముక: మలైకా
జాయిస్ పాలికార్ప్ పుట్టినరోజు సందర్భంగా మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "అమ్మే మా వెన్నెముక, మా సర్వస్వం" అంటూ తన సోదరి అమృతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు మలైకా అరోరా.
2024లో మరణం
ఇకపోతే మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా 2024లో మరణించిన సంగతి తెలిసిందే. భావోద్వేగపు సన్నివేశాల్లో కూడా తన తల్లిని ఒక ధైర్యవంతురాలైన మహిళగా ఎప్పుడూ అభివర్ణిస్తుంటారు.
యుద్ధం కారణంగా
{{/usCountry}}ఇకపోతే మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా 2024లో మరణించిన సంగతి తెలిసిందే. భావోద్వేగపు సన్నివేశాల్లో కూడా తన తల్లిని ఒక ధైర్యవంతురాలైన మహిళగా ఎప్పుడూ అభివర్ణిస్తుంటారు.
యుద్ధం కారణంగా
{{/usCountry}}యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. విమాన రాకపోకలు పాక్షికంగా పునరుద్ధరణ కావడంతో జాయిస్ వంటి ఎందరో భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు.
చిక్కుకున్న సెలబ్రిటీలు
ఇదిలా ఉంటే, దుబాయిలో చాలా మంది సెలబ్రిటీలు ఇదివరకే చిక్కుకున్నారని తెలిసిందే. వారిలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు, హీరోయిన్ సోనాల్ చౌహన్, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, బాలీవుడ్ బ్యూటీలు ఈషా గుప్తా, నర్గీస్ ఫక్రీ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఉన్నారు.
ఇండియాకు ఈషా గుప్తా
ఇటీవలే ఈషా గుప్తా ఇండియాకు చేరుకున్నట్లు కూడా తెలిపింది. త్వరలో ఇతర సెలబ్రిటీలు కూడా సొంతింటికి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.