Malayalam OTT: మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం 'ఖలీఫా' (Khalifa) ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేవలం ఒకటి లేదా రెండు కాకుండా, ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
ఖలీఫా థియేటర్ రెస్పాన్స్

'పులిమురుగన్', 'పోకిరి రాజా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు వైశాఖ్ ఈ ఖలీఫా సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి రెడీ అయింది.
ఆరు ఓటీటీల్లో
ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖలీఫా ఒకే సారి ఆరు ఓటీటీల్లోకి రానుంది. అక్టోబర్ 9 నుంచి ఆరు ప్లాట్‌ఫామ్‌లలో గ్రాండ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ మూవీ ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (Aha), మనోరమ మ్యాక్స్ (ManoramaMAX), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) లలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
వీటితో పాటు విదేశాల్లోని ఆడియన్స్ కోసం స్టార్జ్ ప్లే (STARZPLAY), సింప్లీ సౌత్ (Simply South) లలో ఖలీఫా మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ వ్యూహాత్మక విడుదల వల్ల సినిమాకు వివిధ ప్రాంతాలలో భారీ రీచ్ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
స్పెషల్ క్యామియోలు
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రాలలో 'ఖలీఫా' ఒకటి. ఈ సినిమాలో మాళవిక శర్మ, శమ్మి తిలకన్, ఇంద్రన్స్, సురేష్ ఒబెరాయ్, రెంజీ పానికర్, మోహిని వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. వీరికి తోడుగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, యంగ్ హీరో టోవినో థామస్ క్యామియోలో మెరిశారు.
{{/usCountry}}భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళ చిత్రాలలో 'ఖలీఫా' ఒకటి. ఈ సినిమాలో మాళవిక శర్మ, శమ్మి తిలకన్, ఇంద్రన్స్, సురేష్ ఒబెరాయ్, రెంజీ పానికర్, మోహిని వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. వీరికి తోడుగా మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, యంగ్ హీరో టోవినో థామస్ క్యామియోలో మెరిశారు.
{{/usCountry}}ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, జిను వి. అబ్రహం కథను అందిస్తూ 'జిను అబ్రహం ఇన్నోవేషన్స్' బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. థియేటర్లలో ఈ యాక్షన్ డ్రామాను మిస్ అయిన వారు అక్టోబర్ 9 నుంచి తమకు నచ్చిన ఓటీటీ యాప్‌లలో హ్యాపీగా చూసేయొచ్చు.
మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి మూవీలో కుంభ అనే విలన్ రోల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ బాబు హీరో.