...
...
Next Story

Nisar Wayanad: జ్వరంతో సింగర్ నిసార్ వయనాడ్ కన్నుమూత- షోకి కొన్ని గంటల ముందే దుర్ఘటన- జూనియర్ ఉదిత్ నారాయణ్‌గా పేరు!

Nisar Wayanad Death Before Show In Dubai: మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖ గాయకుడు, 'జూనియర్ ఉదిత్ నారాయణ్'గా గుర్తింపు పొందిన నిసార్ వయనాడ్ (44) దుబాయ్‌లో అకస్మాత్తుగా కన్నుమూశారు. తీవ్ర జ్వరం, యాసిడోసిస్ వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రదర్శన ఇవ్వడానికి కొన్ని గంటల ముందే ఆయన మరణించారు.

Published on: Sep 7, 2026, 22:14:36 IST
Advertisement

Nisar Wayanad Death Before Show In Dubai: సంగీత ప్రియులను తన స్వరంతో అలరించేందుకు వేదికపైకి ఎక్కాల్సిన కొన్ని గంటల ముందే ఆ గొంతు మూగబోయింది. మలయాళ నేపథ్య గాయకుడు, గల్ఫ్ దేశాల్లో ఎన్నో మ్యూజిక్ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిసార్ వయనాడ్ (44) శనివారం (సెప్టెంబర్ 5) సాయంత్రం దుబాయ్‌లో కన్నుమూశారు.

గల్ఫ్ వర్గాల్లో తీవ్ర విషాదం

జ్వరంతో సింగర్ నిసార్ వయనాడ్ కన్నుమూత- షోకి కొన్ని గంటల ముందే దుర్ఘటన- జూనియర్ ఉదిత్ నారాయణ్‌గా పేరు!
జ్వరంతో సింగర్ నిసార్ వయనాడ్ కన్నుమూత- షోకి కొన్ని గంటల ముందే దుర్ఘటన- జూనియర్ ఉదిత్ నారాయణ్‌గా పేరు!

ఉపాధి కోసం, వ్యాపారాల కోసం విదేశాల్లో ఉండే వేలాది మంది భారతీయులకు తన పాటలతో సాంత్వన అందించిన ఒక మంచి కళాకారుడిని కోల్పోవడంతో గల్ఫ్ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది.

తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిక

శనివారం మధ్యాహ్నం నిసార్ వయనాడ్ తీవ్రమైన జ్వరంతో బాధపడటంతో సహచరులు ఆయనను వెంటనే దుబాయ్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. శరీరంలో కెమికల్ ఇన్‌బ్యాలన్స్ దెబ్బతిని 'యాసిడోసిస్' (Acidosis) తలెత్తడమే ఆయన మరణానికి ప్రధాన కారణమని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.

సంగీత కార్యక్రమానికి గంటల ముందే దుర్ఘటన

నిజానికి, శనివారం రాత్రి అజ్మాన్‌లో జరగాల్సిన ఒక భారీ సంగీత కార్యక్రమంలో నిసార్ వయనాడ్ ప్రధాన ఆకర్షణగా పాల్గొనాల్సి ఉంది. ఈ షో ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ దుర్ఘటన జరగడంతో నిర్వాహకులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

'ఉదిత్ నారాయణ్' స్వరం.. సొంత పేరు 'నిస్సార్ ఆరోత్'

కేరళలోని వయనాడ్ జిల్లాకు చెందిన నిస్సార్ ఆరోత్ ఇబ్రహీం, తన ప్రాంతం మీద ఉన్న అభిమానంతో 'నిసార్ వయనాడ్'గా వేదికలపై పేరు మార్చుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ గొంతును అచ్చుగుద్దినట్లు అనుకరిస్తూ పాడుతుండటంతో ఆయనను అందరూ అభిమానంగా 'జూనియర్ ఉదిత్ నారాయణ్' అని పిలుచుకునేవారు.

బాలీవుడ్ హిట్ పాటలతో పాటు

నిసార్‌కు బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ అంటే విపరీతమైన అభిమానం. దాదాపు ఇరవై ఏళ్ల పాటు వేచి చూసిన తర్వాత, తన ఆరాధ్య గాయకుడిని నేరుగా కలసి ఆలింగనం చేసుకున్న క్షణాలను గతంలో ఆయన సోషల్ మీడియాలో ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు.

20 ఏల్ల కల నెరవేరింది

"20 ఏళ్ల నా కల ఈరోజు నెరవేరింది" అంటూ ఆ జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు. స్టేజ్ షోలతో పాటుగా నిసార్ కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ఒక పాట పాడారు. మలయాళ చిత్రం 'ప్రొఫెసర్ డింకన్'తోనూ ఆయనకు అనుబంధం ఉంది.

నిసార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు

నిసార్ వయనాడ్ ఆకస్మిక మరణం పట్ల మలయాళ సినీ ప్రముఖులు, ప్రముఖ గాయకుడు అఫ్సల్ తదితరులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. నిసార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe