మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' (MSVPG) చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఇది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 2వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా చిరు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ అవతరించే దిశగా దూసుకుపోతోంది.
మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్లు

మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లు వసూలు చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి శనివారం (జనవరి 17) ప్రకటించారు. ఈ వార్తను పంచుకుంటూ, ఆయన ట్విట్టర్ లో.. ‘‘ప్రేక్షకులు తమ తీర్పు చెప్పారు. బాక్సాఫీస్ వద్ద బాస్ బ్యాటింగ్ కొనసాగుతోంది. మనశంకరవరప్రసాద్ గారు. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్’’ అని రాశారు. సక్నిల్క్ ప్రకారం ఈ చిత్రం ఐదు రోజుల్లో కేవలం ఇండియాలోనే రూ.120.33 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఏమో రూ.226 కోట్ల గ్రాస్ అందుకుంది.
చిరు సెకండ్ మూవీ
రూ.226 కోట్ల వసూళ్లు.. 'మన శంకర వర ప్రదా గారు' ను చిరంజీవి 2వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిపాయి. ఇది 2023లో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం వసూళ్లను (రూ.219 కోట్లు) అధిగమించింది. చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.246.6 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. త్వరలోనే సైరా నరసింహారెడ్డిని కూడా మన శంకర వర ప్రసాద్ గారు దాటేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. 'మన శంకర వర ప్రసాద్ గారు' చిరంజీవికి రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిన 3వ చిత్రంగా నిలిచింది.
{{/usCountry}}రూ.226 కోట్ల వసూళ్లు.. 'మన శంకర వర ప్రదా గారు' ను చిరంజీవి 2వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిపాయి. ఇది 2023లో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం వసూళ్లను (రూ.219 కోట్లు) అధిగమించింది. చిరంజీవి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.246.6 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. త్వరలోనే సైరా నరసింహారెడ్డిని కూడా మన శంకర వర ప్రసాద్ గారు దాటేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. 'మన శంకర వర ప్రసాద్ గారు' చిరంజీవికి రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిన 3వ చిత్రంగా నిలిచింది.
{{/usCountry}}| Chiranjeevi's top 5 grossers | Collection |
|---|---|
| Sye Raa Narasimha Reddy | ₹246.6 crore |
| Mana Shankara Vara Prasad Garu | ₹225 crore & counting |
| Waltair Veerayya | ₹219 crore |
| Khaidi No 150 | ₹164 crore |
| Godfather | ₹107 crore |
మన శంకర వర ప్రసాద్ గారు గురించి
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి వరుసగా 9వ హిట్. 'ఎఫ్2: ఫన్ & ఫ్రస్ట్రేషన్', 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అతని చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి.
సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించగా, వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించారు. విడాకులైన ఆరు సంవత్సరాల తర్వాత భార్యను తిరిగి గెలుచుకోవడానికి ప్రయత్నించే సెక్యూరిటీ అధికారి కథను ఇది చెబుతుంది.