...
...
Next Story

ఈ ఓటీటీలోకే మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు-చిరంజీవి సంక్రాంతి మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? బ్లాక్ బస్టర్ టాక్

మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి 2026కు విక్టరీ అందుకున్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది.

Published on: Jan 12, 2026, 21:53:38 IST
Advertisement

తన సుదీర్ఘ కెరీర్ లో సంక్రాంతికి చాలానే హిట్లు అందుకున్నారు మెగాస్టారు చిరంజీవి. ఇప్పుడు 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఇవాళ (జనవరి 12) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో సాగిపోతుంది. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది.

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ ఎప్పుడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది. సాధారణంగా అయితే తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల మధ్యలో ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రావొచ్చు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ

మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి హిట్ కొట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వింటేజీ లుక్ లో చిరంజీవి అదిరిపోయారని ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అంతే కాకుండా ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద చిరంజీవి, వెంకటేశ్ ను కలిసి చూడటంతో చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks