...
...
Next Story

రికార్డులు సరెండర్- తమ్ముడు ఓజీ సినిమాను దాటేసిన అన్నయ్య మన శంకర వరప్రసాద్ గారు- చిరంజీవి మూవీ కలెక్షన్ల సునామీ

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం తమ్ముడు పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది.

Published on: Jan 28, 2026, 10:11:12 IST
Advertisement

సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ మన శంకర వరప్రసాద్ గారు దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. 15 రోజులైనా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ కొనసాగిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను అన్నయ్య చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు దాటేసింది.

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు

మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేశ్
మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేశ్

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించింది.

రికార్డులు సరెండర్

చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఈ చిత్రం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లు రాబట్టిందని సోషల్ మీడియాలో ప్రకటించింది.‘బాస్ వచ్చినప్పుడు రికార్డులు లొంగిపోతాయి' అని నిర్మాణ సంస్థ పేర్కొంది.

‘‘మెగాస్టార్ చిరంజీవి తన రికార్డుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో మరో చరిత్రాత్మక మైలురాయిని నెలకొల్పారు. మన శంకర వరప్రసాద్ గారు 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్. అనిల్ రావిపూడి ఎంటర్‌టైనర్' అని పోస్టు పెట్టారు.

ఓజీని దాటేసి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు తెరకెక్కింది. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్ తదితరులు నటించారు. జనవరి 12న రిలీజైన మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. రీసెంట్ గా సండే, రిపబ్లిక్ డే హాలీడేస్ రావడంతో మరోసారి కలెక్షన్లు పుంజుకున్నాయి.

ఈ సినిమాలో ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిరంజీవి నటించారు. కేంద్రమంత్రి సెక్యూరిటీని చూసుకుంటారు. అయితే తన భార్యతో విడిపోయి, పిల్లలకూ దూరంగా ఉంటాడు. మరి మళ్లీ అతను తన భార్యాపిల్లలను కలిశాడా? ఇందులో విక్టరీ వెంకటేశ్ పాత్ర ఏంటీ? అన్నది మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks