Mandaadi Box Office Collection Day 5: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం ఉన్న కథలను, వైవిధ్యమైన పాత్రలను ఆదరించడంలో ముందుంటారు. 'కలర్ ఫోటో', 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు' వంటి చిత్రాలతో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘మండాడి’.
సముద్రం నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా

సముద్రం నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మండాడి సినిమాను ఎల్రెడ్ కుమార్ నిర్మించగా, మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలైన మండాడి చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
బాక్సాఫీస్ వద్ద మండాడి వసూళ్ల వర్షం
మండాడి సినిమా విడుదలైనప్పటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ ఇప్పటివరకు అంటే 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ అధికారికంగా పోస్టర్ ద్వారా ధృవీకరించింది.
మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాయని
సూరి, సుహాస్ కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మండాడి నిలిచింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
థ్రిల్ కలిగించే యాక్షన్ సీక్వెన్స్‌లు
మండాడి సినిమాలో సముద్రం మీద చిత్రీకరించిన బోట్ రేసింగ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన స్టంట్ సీన్లు విజువల్‌గా మెప్పించాయి.
కథలో వచ్చే ప్రతి ట్విస్ట్
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపధ్య సంగీతం, ఎస్.ఆర్. కథిర్ కెమెరా పనితనం ప్రతీ సన్నివేశాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. కథలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
రజినీకాంత్, వెట్రిమారన్ ప్రశంసలు
{{/usCountry}}జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపధ్య సంగీతం, ఎస్.ఆర్. కథిర్ కెమెరా పనితనం ప్రతీ సన్నివేశాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. కథలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
రజినీకాంత్, వెట్రిమారన్ ప్రశంసలు
{{/usCountry}}మండాడి చిత్రానికి స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్, వెట్రిమారన్ వంటి దిగ్గజాలు సినిమా చూసి చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు.
మండాడి నటీనటులు
సూరి, సుహాస్ పోటీపడి నటించారని, సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని కొనియాడారు. కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ‘మండాడి’ విజయం మరోసారి నిరూపించింది.