మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్. పొదువల్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 2022లో ఒక యువతి పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కొచ్చి పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో చిదంబరం ఎస్‌కు తాజాగా న్యాయస్థానం నుంచి ఊరట లభించింది.
కోర్టు కీలక నిర్ణయం

చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు, శనివారం (మార్చి 7) ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా జడ్జి శ్రీ కె.కె. బాలకృష్ణన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అక్రమంగా ప్రవేశించి
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2022లో చిదంబరం ఆమె అపార్ట్‌మెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ క్రమంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేశారు.
పుకార్లపై దర్శకుడి స్పందన
ఈ కేసు వ్యవహారం బయటకు రాకముందే చిదంబరం పొదువల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కు మార్చడం చర్చనీయాంశమైంది. మరోవైపు, చిదంబరం నటుడు దిలీప్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.
చెత్త పోస్ట్ చేసేముందు
దీనిపై చిదంబరం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించారు. "ఏదైనా చెత్త పోస్ట్ చేసే ముందు వాస్తవాలు సరిచూసుకోండి. అలాగే, నేను కేవలం సర్వైవల్ థ్రిల్లర్ నిపుణుడిని మాత్రమే కాదు" అని చిదంబరం ఎస్ పొదువల్ పేర్కొన్నారు.
కెరీర్ ప్రస్థానం..
పయ్యన్నూరుకు చెందిన చిదంబరం ఎస్ పొదువల్ మలయాళ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2021లో 'జన్.ఇ.మన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2024లో వచ్చిన 'మంజుమ్మెల్ బాయ్స్' ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.
241 కోట్ల డైరెక్టర్
{{/usCountry}}పయ్యన్నూరుకు చెందిన చిదంబరం ఎస్ పొదువల్ మలయాళ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2021లో 'జన్.ఇ.మన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 2024లో వచ్చిన 'మంజుమ్మెల్ బాయ్స్' ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది.
241 కోట్ల డైరెక్టర్
{{/usCountry}}గుణ కేవ్స్ నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 241 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం చిదంబరం ఎస్ పొదువల్ 'బాలన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.