OTT Crime: ఓటీటీలోకి 76 కోట్ల క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 7.5 రేటింగ్- బెగ్గర్ మాఫియా అంతు చూసే పవర్‌ఫుల్ లేడీ ఆఫీసర్!

Rani Mukerji Mardaani 3 OTT Release Date: లేడీ సింగం శివాని శివాజీ రాయ్ మళ్లీ వస్తోంది. థియేటర్లలో దుమ్మురేపిన రాణి ముఖర్జీ మర్దానీ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్, బెగ్గర్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మర్దానీ 3 ఓటీటీ రిలీజ్ ఎక్కడనేది లుక్కేద్దాం.

Mar 11, 2026, 12:29:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన పవర్ ఫుల్ పోలీస్ పాత్ర 'శివాని శివాజీ రాయ్'గా మరోసారి బాక్సాఫీస్ వద్ద మెప్పించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో మూడవ భాగం 'మర్దానీ 3' (Mardaani 3) జనవరి 30న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది.

ఓటీటీలోకి 76 కోట్ల క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 7.5 రేటింగ్- బెగ్గర్ మాఫియా అంతు చూసే పవర్‌ఫుల్ లేడీ ఆఫీసర్!
ఓటీటీలోకి 76 కోట్ల క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 7.5 రేటింగ్- బెగ్గర్ మాఫియా అంతు చూసే పవర్‌ఫుల్ లేడీ ఆఫీసర్!

సాహసోపేతమైన ఐపీఎస్ ఆఫీసర్

ఇప్పుడు మర్దానీ 3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కిడ్నాప్‌కు గురైన చిన్న పిల్లలను రక్షించేందుకు ఓ సాహసోపేతమైన ఐపీఎస్ ఆఫీసర్ చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. చైల్డ్ ట్రాఫికింగ్, బెగ్గర్ మాఫియా చుట్టూ సాగుతుంది. బెగ్గర్ మాఫియాను రన్ చేసే అమ్మను అంతు చూసే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథగా ఈ మూవీని రూపొందించారు.

93 మంది చిన్న పిల్లలు

మర్దానీ 3 చిత్రంలో రాణి ముఖర్జీతో పాటు జాంకీ బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషూ సేన్‌గుప్తా కీలక పాత్రల్లో నటించారు. మూడు నెలల్లోనే దాదాపు 93 మంది చిన్న పిల్లలు అదృశ్యం కావడం, దాని వెనుక ఉన్న భయంకరమైన బెగ్గర్ మాఫియా నెట్‌వర్క్‌ను శివాని శివాజీ రాయ్ ఎలా ఛేదించిందనేది ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా చూపించారు.

మర్దానీ 3 బడ్జెట్ అండ్ కలెక్షన్స్

'మర్దానీ' సిరీస్‌లో ఈ మూడవ భాగం అయిన మర్దానీ 3 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మర్దానీ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 76.85 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఇండియాలో ఇండియాలో ఈ సినిమా దాదాపు రూ. 47.55 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.

గత సినిమాల రికార్డ్స్

అదే గతంలో వచ్చిన మర్దానీ 1 (రూ. 35.86 కోట్లు), మర్దాని 2 (రూ. 47.51 కోట్లు) ఇండియన్ నెట్ కలెక్షన్స్ రికార్డులను మర్దానీ 3 అధిగమించింది. అంతేకాకుండా మర్దానీ 3 సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.5 రేటింగ్ ఉంది.

ప్రతి మహిళ గొంతుక ఇది

కాగా, మర్దానీ 3 సాధించిన విజయంపై రాణి ముఖర్జీ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "మర్దానీ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. అణచివేతకు వ్యతిరేకంగా గళం ఎత్తే ప్రతి మహిళ గొంతుక ఇది" రాణి ముఖర్జీ అన్నారు.

సమాజం వైఫల్యమే

"సమాజంలో ఇలాంటి నేరాలు జరుగుతున్నప్పుడు మనం కళ్లు మూసుకోకూడదు. ఒక్క చిన్నారిపై దాడి జరిగినా అది మన సమాజం వైఫల్యమే. శివాని శివాజీ రాయ్ ప్రయాణానికి ప్రేక్షకులు అందిస్తున్న మద్దతు నాకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది" అని రాణి ముఖర్జీ పేర్కొన్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మర్దానీ 3

అభిరాజ్ మినావాల దర్శకత్వం వహించిన మర్దానీ 3 ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే సంప్రదాయాన్ని మర్దానీ 3 అనుసరిస్తుంది. మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మర్దానీ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటివరకు కేవలం హిందీ భాషలోనే మర్దానీ 3 ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More