మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.
దర్శకుడిగా పరిచయం

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతర మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన మాస్ జాతర అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ భాను భోగవరపు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
మాస్ జాతర ఎలా ఉండబోతుంది? ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా?
-ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి.
-'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్‌లో ప్రేక్షకులు కొన్ని సర్‌ప్రైజ్‌లు చూడబోతున్నారు.
ఏదైనా ప్రేరణతో ఈ రైల్వే పోలీస్ కథను రాసుకున్నారా?
-ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.
రవితేజ గారి 75వ చిత్రానికి దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది?
{{/usCountry}}-ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.
రవితేజ గారి 75వ చిత్రానికి దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది?
{{/usCountry}}-ఇది రవితేజ గారి 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజ గారికి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు.
నవీన్ చంద్ర గారి పాత్ర గురించి?
-నవీన్ చంద్ర గారు శివుడు అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం మొదట వేరే ఇద్దరు ముగ్గురు నటుల పేర్లు కూడా పరిశీలించాము. కానీ, సంతృప్తి లేదు. అలాంటి సమయంలో నవీన్ చంద్ర గారిని కలిసి కథ వినిపించాను. ఆయనకు కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు.
-నవీన్ గారు గొప్ప నటుడు. అందులో సందేహం లేదు. అయితే ఈ పాత్రలో ఎలా ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మేకోవర్ చేసి, ఫోటోషూట్ చేయడం జరిగింది. ఆ లుక్ నిర్మాత నాగవంశీ గారితో సహా అందరికీ నచ్చింది. శివుడు పాత్రకు నవీన్ చంద్ర గారు పూర్తి న్యాయం చేశారు. సినిమా విడుదలైన తర్వాత శివుడు పాత్ర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.