...
...
Next Story

Vasudheva Sutham: నిధి, దైవం కాన్సెప్టుతో వసుదేవసుతం- రిలీజ్ ట్రైలర్ విడుదల చేసిన అజయ్ భూపతి- సెన్సార్ సభ్యుల ప్రశంసలు

Vasudheva Sutham Release Trailer Out: హీరోగా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వసుదేవసుతం. రేపు థియేటర్లలో విడుదల కానున్న వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. సెన్సార్ సభ్యులు సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు.

Published on: Jul 9, 2026, 15:44:45 IST
Advertisement

Vasudheva Sutham Release Trailer Out: టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు మాస్టర్ మహేంద్రన్. కర్మణ్యే వాధికారస్తే, అసలు ఏం జరిగిందంటే, నీలకంఠ, త్రికాల సినిమాలతో అలరించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా వసుదేవసుతం.

హీరోయిన్‌గా అంబికా వాణి

నిధి, దైవం కాన్సెప్టుతో వసుదేవసుతం- రిలీజ్ ట్రైలర్ విడుదల చేసిన అజయ్ భూపతి- సెన్సార్ సభ్యుల ప్రశంసలు
నిధి, దైవం కాన్సెప్టుతో వసుదేవసుతం- రిలీజ్ ట్రైలర్ విడుదల చేసిన అజయ్ భూపతి- సెన్సార్ సభ్యుల ప్రశంసలు

ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్‌కు జోడీగా హీరోయిన్ అంబికా వాణి నటించింది. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను వసుదేవసుతం సినిమాను నిర్మించారు. ఈ సినిమాను జూలై 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

అంచనాలు పెంచిన వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్

ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. ఇక రేపు (జూలై 10) మూవీ విడుదలవుతున్న తరుణంలో మరింత హైప్ పెంచేందుకు తాజాగా ఇవాళ వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్‌ను తీసుకు వచ్చారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

మాస్టర్ మహేంద్రన్ డైలాగ్స్

‘చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు’, ‘కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. అన్ని తప్పులు క్షమిస్తే.. మనం తప్పు చేసినట్టే’, ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్విడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’ అని మాస్టర్ మహేంద్రన్ చెప్పే డైలాగ్స్‌తో సాగిన వసుదేవసుతం ట్రైలర్ అద్భుతంగా ఉంది.

నిధి, భారీ సర్పం, ద్వారపాలకుడు

శివుడిని పూజించే హీరో, ఊరిలో నరసింహస్వామి ఆలయంలో బంగారు నిక్షేపాలు ఉండే నిధి దక్కించుకునే విలన్ల కథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఆ నిధికి రక్షణగా భారీ సర్పం, దుష్టులు నిధి దక్కించుకోకుండా కాపాడే ద్వార పాలకులు వంటి అంశాలతో వసుదేవసుతం ట్రైలర్ సాగింది.

మణిశర్మ బీజీఎమ్

వసుదేవసుతం సినిమా మంచి విజయం సాధించాలని దర్శకుడు అజయ్ భూపతి కోరుకున్నారు. ఆల్రెడీ సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉందని, కొత్త కథతో సరికొత్తగా తీశారని సెన్సార్ సభ్యులు అభినందించారు.

రేపే విడుదల

ఈ చిత్రానికి జిజ్జు సన్ని (పార్కింగ్ ఫేమ్) కెమెరామెన్‌గా పని చేశారు. ఇక ఈ మూవీని రేపు (జూలై 10) భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

వసుదేవసుతం నటీనటులు

ఇకపోతే వసుదేవసుతం సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణితోపాటు జాన్ విజయ్, మైమ్‌ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe