...
...
Next Story

Chiranjeevi Lenin: అఖిల్ నా మరో కొడుకు.. ఆ ఎదుగుదల సంతోషంగా ఉంది.. చిరంజీవి ట్వీట్.. వైరల్ గా మెగా-అక్కినేని బాండింగ్!

Chiranjeevi Lenin: అక్కినేని అఖిల్ నటించిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ ‘లెనిన్’ (Lenin) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షాకింగ్ అండ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Published on: Jul 13, 2026, 12:08:49 IST
Advertisement

Chiranjeevi Lenin: బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రానికి ఇండస్ట్రీ నుంచి ఊహించని రేంజ్‌లో సపోర్ట్ లభిస్తోంది. మొన్నటికి మొన్న కల్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ బెస్ట్ యాక్టర్ అంటూ నాగార్జునపై ఒట్టేసి సంచలనం సృష్టించగా.. ఇప్పుడు సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి అఖిల్‌ను ఓన్ చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అఖిల్ నా మరో కొడుకు

అఖిల్ నా మరో కొడుకు.. ఆ ఎదుగుదల సంతోషంగా ఉంది.. చిరంజీవి ట్వీట్.. వైరల్ గా మెగా-అక్కినేని బాండింగ్! (x)
అఖిల్ నా మరో కొడుకు.. ఆ ఎదుగుదల సంతోషంగా ఉంది.. చిరంజీవి ట్వీట్.. వైరల్ గా మెగా-అక్కినేని బాండింగ్! (x)

చిరంజీవి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో.. "‘లెనిన్’ సినిమా గురించి చాలా అద్భుతమైన విషయాలు వింటున్నా. అఖిల్ అక్కినేని అద్భుత నటనపై వస్తున్న ఏకగ్రీవ ప్రశంసలు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. అఖిల్ నాకు మరో సొంత కొడుకు లాంటివాడు. ప్రతి సినిమాతో అతను నటుడిగా ఎదుగుతున్న తీరును చూడటం ఆనందంగా ఉంది.

నా డియర్ ఫ్రెండ్ నాగార్జునకు, మొత్తం కాస్ట్ అండ్ క్రూకు కంగ్రాచ్యులేషన్స్. త్వరలోని లెనిన్ చూస్తా. ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా’’ అని తన ట్వీట్ లో చిరంజీవి పేర్కొన్నారు.

ఎమోషనల్ బాండింగ్

రామ్ చరణ్, అఖిల్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ‘ఏజెంట్’ ఫ్లాప్ తర్వాత అఖిల్ కెరీర్‌కు ఒక పటిష్టమైన ల్యాండింగ్ అవసరమైంది. ఈ సమయంలో లెనిన్ అదరగొడుతోంది. ఇప్పుడు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఈ రేంజ్‌లో ప్రమోట్ చేయడం వల్ల మాస్ ఏరియాల్లో (నైజాం, సీడెడ్) మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ‘లెనిన్’ చిత్రానికి భారీగా యాడ్ కానుంది.

ఇది సినిమా వసూళ్లను కనీసం 20% నుండి 25% వరకు పెంచే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

‘లెనిన్’ రెస్పాన్స్ ఎలా ఉంది?

మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ విభిన్నమైన యాక్షన్ డ్రామాలో అఖిల్ మేకోవర్ అండ్ డైలాగ్ డెలివరీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రొటీన్ మాస్ ఎలిమెంట్స్ కాకుండా.. కంటెంట్ బేస్డ్ స్క్రీన్‌ప్లేతో రావడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది.

వీటికి తోడు తమన్ ఇచ్చిన ఇంటెన్స్ బిజీఎం థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ బ్లెస్సింగ్స్ కూడా తోడవడంతో అఖిల్ ఖాతాలో సాలిడ్ కంబ్యాక్ హిట్ పడినట్లేనని ఫిలిం నగర్ టాక్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks