OTT Telugu Series Memu CopLam Trailer Released: ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్టుతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో వస్తోన్న కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మేము కాప్‌లం. ఈ ఓటీటీ సిరీస్‌లో మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రలు పోషించారు.
వికటకవి డైరెక్టర్

వికటకవి ఓటీటీ సిరీస్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మేము కాప్‌లంకు దర్శకత్వం వహించారు. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బీవీఎస్ రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్‌కి శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. ఇదివరకే టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి పోస్టర్ రిలీజ్ వరకు సిరీస్‌పై క్యూరియాసిటీ కల్పించారు.
కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు
తాజాగా ఇవాళ (మే 14) మేము కాప్‌లం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వించేలా మేము కాప్‌లం ట్రైలర్ సాగింది. కామెడీ, డ్రామాతోపాటు చేతబడి వంటి థ్రిల్లర్ వరకు అంశాలతో ఇంట్రెస్ట్ కల్పించేలా సిరీస్‌ను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
నవ్వు తెప్పించే సీన్స్
సలార్ రాజు అనే పందెం కోడి కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ వేట కొనసాగించడం, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, ఇబ్బందుల సముహారమే మేము కాప్‌లం ఓటీటీ సిరీస్. వారసుడొచ్చాడని నాగబాబుతో ఇంటి పనోడు చెబుతాడు. వారసుడొచ్చింది సంక్రాంతి పందెలాకు కోడి పుంజు అని తర్వాత తెలుస్తుంది.
బాహుబలి రాజు వారసుడు సలార్ రాజు
బాహుబలి రాజు వారసుడు సలార్ రాజు అని ఆ పుంజుపిల్లకు నాగబాబు పేరు పెడతాడు. సంక్రాంతి పందెలు ప్రారంభం అయ్యే సమయంలో సలార్ రాజును ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కోడిని పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను పంపిస్తారు. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియ, మనుషులతో మాట్లాడే తీరు, వారి విచారణ విధానం నవ్వు తెప్పించేలా ఉంది.
థ్రిల్లర్ జోనర్‌లోకి
ఆ సలార్ రాజును కిడ్నాప్ చేసే అవకాశం ఇద్దరికే ఉందని అనుమానించడం, వారితో కానిస్టేబుల్స్ మాట్లాడటం వంటి సీన్స్ పర్వాలేదు. అప్పటివరకు కామెడీతో అలరించిన ట్రైలర్ ఒక్కసారిగా థ్రిల్లర్ జోనర్‌లోకి మారిపోతుంది. ఊరిలో అంతా రక్తం కక్కుకను చావడం, ఒకరి పొలంలో చేతబడి చేయడం వంటి విషయాలు మిస్టీరియస్‌గా అనిపిస్తాయి.
ఇంట్రెస్టింగ్ విషయాలు
{{/usCountry}}ఆ సలార్ రాజును కిడ్నాప్ చేసే అవకాశం ఇద్దరికే ఉందని అనుమానించడం, వారితో కానిస్టేబుల్స్ మాట్లాడటం వంటి సీన్స్ పర్వాలేదు. అప్పటివరకు కామెడీతో అలరించిన ట్రైలర్ ఒక్కసారిగా థ్రిల్లర్ జోనర్‌లోకి మారిపోతుంది. ఊరిలో అంతా రక్తం కక్కుకను చావడం, ఒకరి పొలంలో చేతబడి చేయడం వంటి విషయాలు మిస్టీరియస్‌గా అనిపిస్తాయి.
ఇంట్రెస్టింగ్ విషయాలు
{{/usCountry}}తమ పరిజ్ఞానంతో ఊరిలోని మిస్టరీ ఏంటీ?, సలార్ రాజును ఎవరు?, ఎందుకు? కిడ్నాప్ చేశారు. అసలు సలార్ రాజుకు ఏమైంది? అనే విషయాలను కానిస్టేబుల్స్ తెలుసుకున్నారా లేదా అనేదే మేము కాప్‌లం కథ. కాగా ఈ ఓటీటీ సిరీస్‌లో న్యూస్ యాంకర్‌గా బుల్లితెర బ్యూటీ, బిగ్ బాస్ భామ రీతూ చౌదరి కూడా యాక్ట్ చేస్తోంది.
మేము కాప్‌లం ఓటీటీ స్ట్రీమింగ్
ఇలా కామెడీ, థ్రిల్లర్ అంశాలతో సాగే మేము కాప్‌లం ఓటీటీలోకి వచ్చేయనుంది. జీ5 ప్లాట్‌ఫామ్‌లో మేము కాప్‌లం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మే 22న తెలుగులో జీ5లో మేము కాప్‌లం ఓటీటీ రిలీజ్ అవనుంది.