Mirnalini Ravi Wedding With Spiritual Speaker Mahavishnu: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి జోరుగా సాగుతోంది. ఇటీవలే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ఒక్కటవగా, టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా నిశ్చితార్థాలతో వార్తల్లో నిలిచారు. దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి పెద్ద కుమారుడు సైతం త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు.
ఎలాంటి హడావిడి లేకుండా

సరిగ్గా ఇదే వేళ 'గద్దలకొండ గణేశ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాళిని రవి తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి హడావుడి లేకుండా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
లంగ్కావి ద్వీపంలో వైభవంగా వేడుక
మలేసియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు, పరమ్‌పోరుల్ వ్యవస్థాపకుడు మహావిష్ణుతో మృణాళిని రవి ఆదివారం (నవంబర్ 15) ఏడడుగులు వేశారు. మలేసియా సమీపంలోని సుందరమైన లంగ్కావి ద్వీపం (Langkawi Island) ఈ వేడుకకు వేదికైంది.
ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను మృణాళిని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న నూతన వధూవరుల ఫోటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంప్రదాయబద్ధంగా, ప్రకృతి ఒడిలో జరిగిన వీరి వివాహ దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
స్నేహంతో మొదలై.. పెళ్లి పీటల దాకా
మృణాళిని రవి, మహావిష్ణుల పరిచయం తొలుత మంచి స్నేహంతో మొదలైంది. కాలక్రమేణా వీరి మధ్య అభిప్రాయాలు కలవడంతో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించిన ఈ జంట, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వారి ఆశీర్వాదంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అట్టహాసాలకు దూరంగా కేవలం ఆత్మీయుల మధ్య పెళ్లి చేసుకోవాలని వీరు ముందే నిర్ణయించుకున్నారు.
{{/usCountry}}మృణాళిని రవి, మహావిష్ణుల పరిచయం తొలుత మంచి స్నేహంతో మొదలైంది. కాలక్రమేణా వీరి మధ్య అభిప్రాయాలు కలవడంతో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు తమ ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించిన ఈ జంట, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వారి ఆశీర్వాదంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అట్టహాసాలకు దూరంగా కేవలం ఆత్మీయుల మధ్య పెళ్లి చేసుకోవాలని వీరు ముందే నిర్ణయించుకున్నారు.
{{/usCountry}}తమిళం నుంచి టాలీవుడ్ దాకా సినీ ప్రస్థానం
సోషల్ మీడియా వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాళిని రవి.. 2019లో వచ్చిన విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్'తో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత సుశీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'ఛాంపియన్' సినిమాతో హీరోయిన్‌గా మారారు.
విశాల్, ఆర్య కలసి నటించిన 'ఎనిమీ'తో పాటు 'ఎంజీఆర్ మగన్', 'జాంగో', విక్రమ్ నటించిన 'కోబ్రా' వంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా మంచి మార్కులు కొట్టేశారు.
మృణాళిని రవి తెలుగు సినిమాలు
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'గద్దలకొండ గణేశ్' సినిమాతో మృణాళిని తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే కుర్రకారులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ఆ తర్వాత 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు', 'మామ మశ్చీంద్ర' వంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించారు.
చివరగా 2024లో విడుదలైన 'రోమియో' అనే తమిళ చిత్రంలో మృణాళిని రవి వెండితెరపై కనిపించారు. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మృణాళిని, పెళ్లి తర్వాత కూడా సినిమాలలో కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.