...
...
Next Story

పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరో దత్తపుత్రిక- సుముద్రపు ఒడ్డున రొమాంటిక్‌గా లవ్ ప్రపోజల్- పెళ్లి డేట్ చెప్పిన సినీ జంట

Mithun Chakraborty Daughter Dishani Wedding: బాలీవుడ్‌లో డిస్కో డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి దత్తపుత్రిక దిషాని చక్రవర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ మైల్స్ మంట్జారిస్‌తో కలిసి దిషాని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Published on: Jun 16, 2026, 06:37:59 IST
Advertisement

Mithun Chakraborty Daughter Dishani Wedding: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో త్వరలోనే పెళ్లి వేడుకలు జరగనున్నాయి. మిథున్ చక్రవర్తి దత్తపుత్రిక దిషాని చక్రవర్తి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. తన ప్రియుడు మైల్స్ మంట్జారిస్‌తో కలిసి దిషాని సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.

రొమాంటిక్ ప్రపోజల్

పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరో దత్తపుత్రిక- సుముద్రపు ఒడ్డున రొమాంటిక్‌గా లవ్ ప్రపోజల్- పెళ్లి డేట్ చెప్పిన సినీ జంట
పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరో దత్తపుత్రిక- సుముద్రపు ఒడ్డున రొమాంటిక్‌గా లవ్ ప్రపోజల్- పెళ్లి డేట్ చెప్పిన సినీ జంట

సముద్రపు ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన కొండపై మైల్స్ ఎంతో రోమాంటిక్‌గా దిషానికి ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడుగుతున్న ఫోటోలను ఈ మైల్స్-దిషాని జంట ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఈ వేడుక కోసం మైల్స్ ఆ ప్రపోజల్ స్పాట్‌ను బ్లాక్ అండ్ వైట్ కార్పెట్, కొవ్వొత్తులు, రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించాడు. దిషాని చేతికి ఉంగరం తొడిగి, నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాము ఇద్దరం ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 6, 2026 న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ఈ జంట వెల్లడించింది. "06.12.2026... నా జీవితంలో అత్యంత సులువైన శాశ్వత బంధం" అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు.

అన్నయ్యల ఆశీస్సులు.. బాలీవుడ్ శుభాకాంక్షలు

దిషాని చక్రవర్తి నిశ్చితార్థపు ఫోటోలపై ఆమె అన్నయ్యలు, నటులు మిమో చక్రవర్తి (మహా అక్షయ్), నమాషి చక్రవర్తి స్పందించారు. హార్ట్ ఎమోజీలతో పాటు "మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. లవ్ యూ బోత్" అని నమాషి కామెంట్ పెట్టాడు. వీరితో పాటు సీనియర్ నటి భాగ్యశ్రీ కుమారుడు, బాలీవుడ్ యువ హీరో అభిమన్యు దాసాని కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇంతకీ మిథున్ అల్లుడు ఏం చేస్తాడు?

మిథున్ చక్రవర్తి మొదట 1979లో నటి హెలెనా లూక్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వీరి బంధం నాలుగు నెలలకే ముగిసిపోయింది. ఆ తర్వాత అదే ఏడాది ఆయన యోగితా బాలీని పెళ్లాడారు. వీరికి మిమో, ఉష్మే, నమాషి అనే ముగ్గురు కుమారులు జన్మించారు. ఆ తర్వాత మిథున్ దంపతులు దిషానిని దత్తత తీసుకున్నారు.

సొంత పిల్లల కంటే ఎక్కువగా దిషానిని మిథున్ చక్రవర్తి ప్రేమగా పెంచారు. దిషాని చక్రవర్తి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని 'న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ'తో పాటు ప్రఖ్యాత 'లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్'లో సినిమా కోర్సులు పూర్తి చేసింది.

కేవలం నటనపైనే కాకుండా స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌పై దిషాని చక్రవర్తికి మంచి పట్టు ఉంది. ఇప్పటికే 'గిఫ్ట్', 'హోలీ స్మోక్', 'అండర్‌పాస్', 'ది గెస్ట్' (2022) వంటి పలు షార్ట్ ఫిలిమ్స్‌కు ఆమె రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి మెప్పు పొందింది.

ఐదు దశాబ్దాల మిథున్ సినీ ప్రస్థానం

నటుడిగా మిథున్ చక్రవర్తి ప్రస్థానం భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో ఆయన 350కి పైగా చిత్రాల్లో నటించారు. 1976లో ప్రఖ్యాత దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయా' సినిమాతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు.

మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును మిథున్ చక్రవర్తి అందుకోవడం విశేషం. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించారు.

తెలుగులో గోపాల గోపాల సినిమాలో

సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' రియాలిటీ షోకు గ్రాండ్ మాస్టర్‌గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు మిథున్. తెలుగులో వెంకటేష్, పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలోనూ మిథున్ చక్రవర్తి నటించారు.

ఇటీవల 'ది బెంగాల్ ఫైల్స్', 'ప్రోజాపతి 2' చిత్రాల్లో కనిపించిన మిథున్ చక్రవర్తి.. త్వరలోనే సన్నీ డియోల్ లీడ్ రోల్ పోషిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'బట్వారా 1947' (గతంలో లాహోర్ 1947) సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks