...
...
Next Story

Mr Work From Home Review: మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూ-రైతుల బతుకు మార్చే డిజిటల్ వ్యవసాయం- త్రిగుణ్ మూవీ ఎలా ఉందంటే?

Mr Work From Home Movie Review In Telugu And Rating: హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. ఆర్గానిక్ ఫార్మింగ్, డిజిటల్ అగ్రికల్చర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా ఉందో నేటి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: May 15, 2026, 16:56:47 IST
Advertisement

Mr Work From Home Movie Review In Telugu And Rating: తెలుగులో రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మధుదీప్ చెలికాని కథ, దర్శకత్వం వహించారు.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూ

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూ-రైతుల బతుకు మార్చే డిజిటల్ వ్యవసాయం- త్రిగుణ్ మూవీ ఎలా ఉందంటే?
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూ-రైతుల బతుకు మార్చే డిజిటల్ వ్యవసాయం- త్రిగుణ్ మూవీ ఎలా ఉందంటే?

అరవింద్ మండెం నిర్మాతగా వ్యవహరించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా ఇవాళ (మే 15) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూలో తెలుసుకుందాం.

కథా నేపథ్యం:

అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో స్థిరపడిన ఒక ప్రతిభావంతుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే, తన మూలాలను వెతుక్కుంటూ భారతదేశానికి తిరిగి వచ్చిన అరవింద్ సేంద్రియ వ్యవసాయం (Organic Farming) చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే అతనికి మహి (పాయల్ రాధాకృష్ణ) పరిచయమవుతుంది.

వ్యవసాయం అంటే కేవలం శ్రమ అని భావించే మహి, అరవింద్ నిర్ణయాన్ని మొదట్లో తక్కువ చేసి చూస్తుంది. అటు కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఇటు సమాజం చూసే చిన్నచూపును ఎదుర్కొంటూ అరవింద్ తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? డిజిటల్ అగ్రికల్చర్ ద్వారా రైతు జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాడు?, రైతులకు అధిక ఆదాయం వచ్చేందుకు అరవింద్ చూపించిన పరిష్కారం ఏంటీ? అసలు అరవింద్ ఎందుకు సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రస్తుత సమాజంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఆధునిక సాంకేతికతతో వాటిని ఎలా అధిగమించవచ్చనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. గతంలో మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమా తరహాలోనే, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా గ్రామీణ వికాసం, సేంద్రియ సాగు వంటి అంశాలపై తెరకెక్కింది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి

దర్శకుడు మధుదీప్ ఈ సినిమాలో కేవలం వ్యవసాయం గురించి మాత్రమే కాకుండా, 'డిజిటల్ అగ్రికల్చర్' అనే సరికొత్త అంశాన్ని చర్చించారు. సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలను వ్యవసాయానికి అన్వయించి, డ్రోన్ టెక్నాలజీ, సాయిల్ సెన్సార్లు వంటి ఆధునిక పరికరాలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించవచ్చో సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇది కేవలం పాతకాలపు పద్ధతులను అనుసరించడం కాదు, విజ్ఞానాన్ని వ్యవసాయంతో జోడించి 'రైతే రాజు' అనే నినాదానికి కొత్త అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.

మారుతున్న జీవన శైలి వల్ల మనలో చాలా మందికి ఎన్నో అనారోగ్యాలు చుట్టు ముడుతున్నాయి. 40 యేళ్ల లోపు షుగర్, బీపీ సహా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కానీ, మన పూర్వీకులు మాత్రం ఎన్నేళ్లు అయిన పూర్తి ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు మనం తినే తిండి అని, పాత కాలం వంటి పద్ధతులతో వ్యవసాయం ఎలా చేయాలి, వంటి అంశాలను బాగా చూపించారు.

డిజిటల్ అగ్రికల్చర్

టెక్నాలజీ సాయంతో వ్యవసాయం (డిజిటల్ అగ్రికల్చర్) చేసి రైతుల బతుకులు ఎలా మార్చుకోవచ్చే సినిమా ఇది. ఇంతకుమించి కథ గురించి ఏం చెప్పిన స్పాయిలర్ అవుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరులో వచ్చి విజువల్స్, పంట పొలాల అందాలు, వ్యవసాయానికి సంబంధించిన సీన్లలో వచ్చే విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం కథలోని మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఓకే. సినిమా నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

నటీనటుల ప్రతిభ

హీరో త్రిగుణ్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో, రైతు కష్టాలను వివరించే సమయంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తన పాత్రకు పూర్తి న్యాయం చేయడమే కాకుండా, తెరపై అందంగా కనిపించారు. అనీష్ కురువిల్లా పాత్ర ఆకట్టుకుంటుంది.

శివాజీ రాజా, వైవా హర్ష వంటి నటులు తమ పరిధి మేరకు మెప్పించి, కథలో హాస్యాన్ని, గాంభీర్యాన్ని సమపాళ్లలో కుదిర్చారు. డైరెక్టర్ మధుదీప్ చెలికాని కథ, సినిమాను తీర్చిన విధానం మెచ్చుకునేలా ఉంది.

ఫైనల్‌గా చెప్పాలంటే

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, యువతకు ఒక చక్కని సందేశం. ఆఫీసు గదులకే పరిమితం కాకుండా, ప్రకృతితో మమేకమై సాధించే విజయం ఎంతో గొప్పదని ఈ చిత్రం నిరూపించింది. సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు చూడాలనుకునే వారికి, ముఖ్యంగా రైతు నేపథ్యం ఉన్న కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని మిగుల్చుతుంది.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe