Mugguru Kothulu First Look Released: టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ కథాంశాలకు, యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అదే బాటలో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించేందుకు ఒక ఆసక్తికరమైన తెలుగు చిత్రం రూపుదిద్దుకుంటోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఆ సినిమా పేరు ‘ముగ్గురు కోతులు’.
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్ రిలీజ్

తాజాగా ముగ్గురు కోతులు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం (ఆగస్ట్ 21) ఘనంగా ఆవిష్కరించారు. ఈ ముగ్గురు కోతులు చిత్రంలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కథానాయకులుగా నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా అలరించనున్నారు. ఈ సినిమాను శోభారాణి గరిమెల్ల నిర్మిస్తుండగా, కార్తీక్ గరిమెల్ల దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పోస్టర్‌తోనే పెరిగిన క్యూరియాసిటీ!
ముగ్గురు కోతులు సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్‌ను కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేశారు. ఇందులో ముగ్గురు హీరోలు వేర్వేరు హాస్యభరిత హావభావాలు (ఎక్స్‌ప్రెషన్స్) చిందిస్తూ కనిపించడం విశేషం. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే గాంధీజీ మూడు కోతుల సూత్రాన్ని నేటి యూత్ ఎలా తమకు నచ్చినట్లు మలచుకున్నారనే కాన్సెప్ట్‌తో ఈ కథ సాగనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
పెంచేసిన అంచనాలు
ముగ్గురు కోతులు సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచిన చిత్రబృందం, త్వరలోనే పాటలు, టీజర్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని పేర్కొంది.
నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు
ముగ్గురు కోతులు చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఎస్. సుహాస్ స్వరాలు సమకూరుస్తుండగా, రాజ్ నోముల ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}ముగ్గురు కోతులు చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఎస్. సుహాస్ స్వరాలు సమకూరుస్తుండగా, రాజ్ నోముల ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}నటీనటులు: తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు
సమర్పణ: జీఎస్ఆర్ క్రియేషన్స్, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్
నిర్మాత: శోభారాణి గరిమెల్ల
దర్శకత్వం: కార్తీక్ గరిమెల్ల
సంగీతం: ఎస్. సుహాస్
సినిమాటోగ్రఫీ: రాజ్ నోముల
ఎడిటింగ్: జమీర్ షేక్
పీఆర్వో: సాయి సతీష్
ముగ్గురు హీరోల సినిమా
సమకాలీన కామెడీ, యూత్ మెచ్చే ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ ముగ్గురు కోతులు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేర సందడి చేస్తుందో చూడాలి. ఇలా ముగ్గురు హీరోలతో తాజాగా థియేటర్లలోకి అమీర్ లోగ్ వచ్చి పర్వాలేదనిపిస్తోంది. మరి ఈ ముగ్గురు హీరోల ముగ్గురు కోతులు సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ముగ్గురు కోతులు' సినిమా దర్శకుడు ఎవరు?
ఈ చిత్రానికి కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు.
2. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?
తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కథానాయకులుగా నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు.
3. 'ముగ్గురు కోతులు' సినిమా ఏ జోనర్‌లో రాబోతోంది?
ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా, యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది.