OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- హారర్ టు కామెడీ!

Friday OTT Release Movies Today: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే తెలుగులో 5 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.

Published on: Aug 21, 2026, 05:31:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో అమెజాన్ ప్రైమ్ నుంచి ఈటీవీ విన్, జీ5 వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- హారర్ టు కామెడీ!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- హారర్ టు కామెడీ!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

క్లీనప్ కంపెనీ (హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 21 (ఎమ్ఎక్స్ ప్లేయర్)

డార్క్ (తమిళ హారర్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 21

సూపర్ వింగ్స్ సీజన్ 21 (కొరియన్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 21

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ చిత్రం)- ఆగస్టు 21

ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- ఆగస్టు 21

జీ5 ఓటీటీ

జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 21

ది ‍గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో: ఏలియన్స్ కా ఆగ్‌మ్యాన్ (హిందీ ఫ్యామిలీ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 21

జియో హాట్‌స్టార్ ఓటీటీ

వెల్‌కమ్ టు ది జంగిల్ (హిందీ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- ఆగస్టు 21

కొనన్ ఓ బ్రియన్ మస్ట్ గో (ఇంగ్లీష్ కామెడీ ట్రావెల్ టాక్ షో)- ఆగస్టు 21

సోనీ లివ్ ఓటీటీ

చెన్నై లవ్ స్టోరీ (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 21

ఉన్మాదం (మలయాళ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 21 (రూమర్ డేట్)

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

స్నేక్స్ 5 మాన్‌స్టర్ సిటీ (తెలుగు డబ్బింగ్ చైనీస్ హారర్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మాన్‌స్టర్ మూవీ)- ఆగస్టు 21

మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 21

స్టిల్‌వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేటెడ్ కిడ్స్ ఫ్యామిలీ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్)- ఆగస్టు 21

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

అట్లాస్ కింగ్ (ఇంగ్లీష్ క్రైమ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఆగస్టు 21

ది డైనాస్టీ: యూకన్ హస్కీస్ (ఇంగ్లీష్ వుమెన్స్ బాస్కెట్‌బాల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 21

స్వీటీ నాటీ క్రేజీ (తమిళ బోల్డ్ అడల్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఆహా తమిళ్ ఓటీటీ- ఆగస్టు 21

ఎగ్ షెల్స్ (తెలుగు రొమాంటిక్ రిలేషన్‌షిప్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్టు 21

మదర్ మేరీ (ఇంగ్లీష్ సైకలాజికల్ సైకోసెక్సువల్ మ్యూజిక్ పాప్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 21

ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు

ఇలా ఇవాళ (ఆగస్టు 21) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, దళపతి విజయ్ జన నాయగన్, త్రిగుణ్ స్వీటీ నాటీ క్రేజీ, అక్షయ్ కుమార్ వెల్‌కమ్ టు ది జంగిల్, జాకీ ష్రాఫ్ ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో, శాన్వీ మేఘన ప్యార్ ప్రేమ కళ్యాణం సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్‌గా 14, తెలుగులో 5

వీటితోపాటు క్లీనప్ కంపెనీ, డార్క్, ఉన్మాదం, స్నేక్స్ 5 మాన్‌స్టర్ సిటీ, అట్లాస్ కింగ్, ఎగ్ షెల్స్, మదర్ మేరీ, ఫేసింగ్ ఎల్ చాపో‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 5 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More