గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ సినిమా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి సమర్పించారు.
అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన అఖండ 2 తాండవం సినిమాను 2డీ, త్రీడీ ఫార్మాట్స్‌లలో డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుకలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆ శివుడే చేయించుకున్నాడు
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. "అఖండ సినిమా చేయాలంటే చాలా బలం కావాలి. ఈ సినిమా చేసింది నేను కాదు.. ఆ శివుడే చేయించుకున్నాడు. అఖండ అనేది ఒక గుడి. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి" అని అన్నారు.
ఆది పినిశెట్టి కూడా
"శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని బిగ్ స్క్రీన్‌పై చూస్తుంటే మీరందరూ చేతులెత్తి దండం పెడతారు. ఆది పినిశెట్టి కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు. తనకు చాలా మంచి పేరు వస్తుంది. శివుడికి మ్యూజిక్ చేయడమనేది ఎంతో అదృష్టం ఉండాలి" అని తమన్ తెలిపాడు.
ఇది సిక్సర్
"ఈ డ్రీమ్‌కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ 14 రీల్స్, దూకుడు సినిమా నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అఖండ కంటే అఖండ 2 మూడింతలు ఎక్కువ ఉంటుంది. బాలయ్య గారితో బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు పని చేయడం.. ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు. ఇప్పుడు గోపి సినిమా కూడా ప్రారంభమైంది. ఇది సిక్సర్" అని తమన్ పేర్కొన్నారు.
ఆ కంప్లైంట్ చేయకూడదు
{{/usCountry}}"ఈ డ్రీమ్‌కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ 14 రీల్స్, దూకుడు సినిమా నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అఖండ కంటే అఖండ 2 మూడింతలు ఎక్కువ ఉంటుంది. బాలయ్య గారితో బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలకు పని చేయడం.. ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు. ఇప్పుడు గోపి సినిమా కూడా ప్రారంభమైంది. ఇది సిక్సర్" అని తమన్ పేర్కొన్నారు.
ఆ కంప్లైంట్ చేయకూడదు
{{/usCountry}}"డిసెంబర్ 5న ఎవరు కూడా బాక్సులు పగిలిపోయి, స్పీకర్లు పేలిపోయాయని కంప్లైంట్ చేయకూడదు. ముందే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి. బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు. డిసెంబర్ 5 బాలయ్య గారితో మరో బ్లాక్ బస్టర్ హిట్. అందరం సక్సెస్ మీట్‌లో కలుద్దాం" అని ఎస్ఎస్ తమన్ తన స్పీచ్ ముగించారు.
అదృష్టంగా భావిస్తున్నా
హర్షాలి మల్హోత్రా మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ సినిమా నాకు ఒక రోలర్ కోస్టర్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. నాకు ఈ క్యారెక్టర్‌లో బిలీవ్ చేసిన డైరెక్టర్ బోయపాటి గారికి ధన్యవాదాలు. బాలయ్య గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. మా నిర్మాతలకు ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అని తెలిపింది.