దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో క్రేజీ అప్‌కమింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అయితే, వాటిలో అస్సలు మిస్ అవ్వకూడని ఆరు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. బోల్డ్ నుంచి థ్రిల్లర్ వరకు మిస్ అవ్వకూడని ఆ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ది యాక్సిడెంట్ 2 ఓటీటీ

థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన సిరీస్ ది యాక్సిడెంట్. ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పడు సీజన్ 2 వస్తోంది. ఓ కుటుంబం చుట్టూ సాగే ఈ సిరీస్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 10 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ది ఫేక్‌న్యాపింగ్ ఓటీటీ
సౌది అరేబియన్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ది ఫేక్‌న్యాపింగ్. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రీ, కొడుకు దాని నుంచి తప్పించుకునేందుకు అద్భుతమైన ప్లాన్ వేస్తారు. కొడుకు తన సొంత తండ్రిని కిడ్నాప్ చేసినట్లు నటిస్తాడు. మరి వారి ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేదే స్టోరీ. ఈ సినిమా డిసెంబర్ 11న ఓటీటీ రిలీజ్ కానుంది.
మ్యాన్ వర్సెస్ బేబీ ఓటీటీ
బ్రిటీష్ కామెడీ వెబ్ సిరీస్‌గా రూపొందింది మ్యాన్ వర్సెస్ బేబీ. ఈ సిరీస్‌లో హీరో హౌస్ కీపింగ్ అనుభవం ఎలా ఉంటుంది, పిల్లలతో ఎలా ఇబ్బందులు పడ్డాడు? వంటి అంశాలతో సాగే మ్యాన్ వర్సెస్ బేబీ డిసెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
ది టౌన్ ఓటీటీ
ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితులకు డబ్బు చాలా అవసరం పడుతుంది. ఈ క్రమంలో వారికి దొంగలించిన నాలుగు డబ్బు సంచులు దొరుకుతాయి. ఆ తర్వాత వారి స్నేహం, సంబంధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనే కథతో తెరకెక్కిందే ది టౌన్. మనీ హీస్ట్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన ది టౌన్ డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ 2 ఓటీటీ
{{/usCountry}}ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితులకు డబ్బు చాలా అవసరం పడుతుంది. ఈ క్రమంలో వారికి దొంగలించిన నాలుగు డబ్బు సంచులు దొరుకుతాయి. ఆ తర్వాత వారి స్నేహం, సంబంధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనే కథతో తెరకెక్కిందే ది టౌన్. మనీ హీస్ట్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన ది టౌన్ డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ 2 ఓటీటీ
{{/usCountry}}యాక్షన్, సస్పెన్స్, శృంగారం వంటి అంశాలతో తెరకెక్కిన తైవానీస్ సిరీస్ హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్. బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ మూడు కోణాలతో రూపొందింది. ఈ సిరీస్ రెండో సీజన్ డిసెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుంది.
సిటీ ఆఫ్ షాడోస్ ఓటీటీ
మిస్టరీ సినిమాలు చూడాలనుకుంటే ఈ సినిమా వారి కోసమే. బార్సిలోనాలోని ఓ ప్రసిద్ధ భవనంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహం దొరుకుతుంది. ఆ హంతకుడుని పట్టుకునేందుకు చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.