...
...
Next Story

Naa Wife Missing OTT Review: నా వైఫ్ మిస్సింగ్ రివ్యూ-ఓటీటీలోకి వచ్చిన కొత్తబంగారు లోకం జంట క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Naa Wife Missing Review And Rating In Telugu: 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నా వైఫ్ మిస్సింగ్. అక్టోబర్ 22న ఆహాలో నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ రివ్యూలో చూద్దాం.

Published on: Oct 23, 2026, 14:12:34 IST
Advertisement

Naa Wife Missing OTT Review And Rating In Telugu:

నా వైఫ్ మిస్సింగ్ రివ్యూ-ఓటీటీలోకి వచ్చిన కొత్తబంగారు లోకం జంట క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
నా వైఫ్ మిస్సింగ్ రివ్యూ-ఓటీటీలోకి వచ్చిన కొత్తబంగారు లోకం జంట క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

టైటిల్‌: నా వైఫ్ మిస్సింగ్

నటీనటులు: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, జబర్దస్త్ సత్యశ్రీ, ప్రవీణ్, మోహిత్ తదితరులు

దర్శకత్వం: స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ

సంగీతం: సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్. సతీష్ కుమార్

ఎడిటింగ్: సాయిబాబు తలారి

నిర్మాత: శివ కంఠంనేని

నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా

ఓటీటీ రిలీజ్ డేట్: 22 అక్టోబర్ 2026

తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమా, అందులో జంటగా నటించిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. సుమారు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ జంట ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో కలిసి నటించారు.

మరోసారి జంటగా వరుణ్, శ్వేతా

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మరోసారి తెరపై జంటగా నటించిన ఓటీటీ మూవీ నా వైఫ్ మిస్సింగ్. స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. పదేళ్ల విరామం తర్వాత శ్వేతా బసు ప్రసాద్ తెలుగులోకి తిరిగి రావడం, పైగా థ్రిల్లర్ కథాంశంతో రావడంతో ఈ సినిమాపై ఓ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందో నేటి నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

అయితే పెళ్లయ్యాక అబాన్ (మోహిత్ పెద్దాడ) అనే వ్యక్తిని ప్రేమించానని, అతనితో వెళ్లిపోతానని కూడా స్వప్న చెబుతుంది. స్వప్న నిర్ణయానికి కూడా బాలు సైలెంట్‌గా ఒప్పుకుని ఒక ప్లాన్ వేస్తాడు. తీరా చూస్తే, స్వప్న హఠాత్తుగా మాయమవుతుంది. భార్య కనిపించడం లేదంటూ బాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు.

విచారణ ప్రారంభించిన పోలీసులు బాలుపైనే అనుమానంతో అరెస్ట్ చేస్తారు. మరోవైపు అబాన్ వచ్చి స్వప్న తన దగ్గరకు రాలేదని చెప్పి బాలుకు బెయిల్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు స్వప్న ఎక్కడికి వెళ్లిపోయింది? భార్య ఏది చేసినా బాలు ఎందుకు మౌనంగా భరించాడు? స్వప్న, అబాన్‌ల లవ్ స్టోరీ ఏంటీ? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే నా వైఫ్ మిస్సింగ్ చూడాల్సిందే.

సాఫీగా సాగే కథనం.. ట్విస్టుల మేళవింపు

భార్య మిస్సింగ్ డ్రామా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేటి సమాజంలో కొందరు మహిళలు పెళ్లయ్యాక కూడా పాత ప్రేమలను కొనసాగించడం వల్ల ఎదురయ్యే క్లిష్టమైన పరిణామాలను దర్శకురాలు ఈ కథలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వర్తమానానికి, గతానికి మధ్య కథనాన్ని నడిపించారు.

ప్రథమార్ధంలో బాలు-స్వప్న పెళ్లి, అబాన్ ఎంట్రీ, కుటుంబ సభ్యుల చుట్టూ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ సమయానికి స్వప్న ఇటు భర్త దగ్గరా, అటు ప్రియుడి దగ్గరా లేకపోవడంతో ద్వితీయార్ధంపై ఉత్కంఠ పెరుగుతుంది. ఆ తర్వాత సినిమా కథనం చాలా నిదానంగా సాగుతుంది.

సీన్లు మెల్లగా ముందుకు కదిలిన ఫీలింగ్ కలుగుతుంది. కొంత మేర మలయాళ థ్రిల్లర్ చిత్రాల శైలిని ఇది గుర్తుకుతెచ్చిన ఒకింత ఉత్కంఠత మిస్ అవుతుంది. క్లైమాక్స్‌లో స్వప్న ఆచూకీకి సంబంధించిన ట్విస్ట్ సస్పెన్స్‌ను బాగా నిలబెడుతుంది. కాకపోతే నేరానికి పాల్పడింది ఎవరనేది ముందే చాలావరకు ఊహించవచ్చు. ఒక సాధారణ ప్రేమకథగా మొదలై హఠాత్తుగా థ్రిల్లర్‌గా మారే తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే?

కనిపించకుండాపోయిన భార్య కోసం వెతికే భర్త పాత్రలో వరుణ్ సందేశ్ పరిణతి చెందిన నటన కనబరిచాడు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో బాగా మెప్పించాడు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన శ్వేతా బసు ప్రసాద్ తన పాత్ర పరిధి మేరకు చక్కగా ఆకట్టుకుంది. పోలీస్ అధికారులుగా జబర్దస్త్ సత్యశ్రీ, ప్రవీణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రియుడి పాత్రలో మోహిత్ పెద్దాడ పర్వాలేదనిపించాడు.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచడానికి తోడ్పడింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా కుదిరాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.

రొటీన్ క్రైమ్ థ్రిల్లర్‌లా కాకుండా

మొత్తానికి 'నా వైఫ్ మిస్సింగ్' రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కాకుండా వైవాహిక బంధాలు, సమస్యల చుట్టూ తిరిగే చిత్రం. స్లో నేరేషన్ ఉన్నప్పటికీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ లవర్స్‌ ఓసారి చూడాల్సిన సినిమాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న నా వైఫ్ మిస్సింగ్ నిలుస్తుంది.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks