...
...
Next Story

Naga Chaitanya: నాకే భయం వేసింది.. అఖిల్ అప్పుడే హీరో అయిపోయాడు.. కింగ్ ఫైర్ ఏంటో మాకు తెలుసు: నాగ చైతన్య

Naga Chaitanya: లెనిన్ మూవీ తో సక్సెస్ అందుకున్న తమ్ముడు అఖిల్ పై అక్కినేని నాగ చైతన్య ప్రశంసలు కురిపించేవాడు. ఈ కథ విన్నప్పుడు తనకే భయమేసిందని అన్నాడు. అఖిల్ హీరో అయిపోయాడని, కింగ్ ఫైర్ ఏంటో మాకే తెలుసని చై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

Published on: Jul 21, 2026, 06:21:04 IST
Advertisement

Naga Chaitanya: టాలీవుడ్ అక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. తాజాగా జరిగిన 'లెనిన్' (Lenin) చిత్ర బ్లాక్‌బస్టర్ వైభవం ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన యువ సామ్రాట్ నాగచైతన్య.. తన తమ్ముడు అఖిల్ అక్కినేని గురించి చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.

తమ్ముడి కష్టం, డెడికేషన్‌పై చైతూ ప్రశంసలు!

నాకే భయం వేసింది.. అఖిల్ అప్పుడే హీరో అయిపోయాడు.. కింగ్ ఫైర్ ఏంటో మాకు తెలుసు: నాగ చైతన్య (x/AnnapurnaStdios)
నాకే భయం వేసింది.. అఖిల్ అప్పుడే హీరో అయిపోయాడు.. కింగ్ ఫైర్ ఏంటో మాకు తెలుసు: నాగ చైతన్య (x/AnnapurnaStdios)

ఈ వేడుకలో మాట్లాడిన నాగచైతన్య.. 'లెనిన్' చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూనే అఖిల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

‘‘ఈ కథ ఒప్పుకున్నప్పుడే అఖిల్ హీరో అయ్యాడు. ఈ కథ విన్నాక నాకే భయం వేసింది. ఒక ఎక్స్ పీరియన్స్ వచ్చాక, ఓ 25 సినిమాలు చేశాక ఇలాంటి కథలు చేయాలి. లెనిన్ లో ఉన్న క్యారెక్టర్ కు, తన రియల్ లైఫ్ కు ఎలాంటి కనెక్షన్ లేదు. కానీ అఖిల్ చేశాడు. ఆ స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడే అఖిల్ నాకు హీరో అయిపోయాడు’’ అని నాగ చైతన్య పేర్కొన్నాడు.

కింగ్ ఫైర్

‘‘అఖిల్ ను చూసి చాలా గర్వపడుతున్నా. కింగ్ (నాగార్జున) ఫైర్ ఎవరికీ తెలియదు. అది నాకు, అఖిల్ కే తెలుసు. నాన్న ఎలా ఉంటారో ఇంట్లో మాకు తెలుసు. ఆయన ఒక టార్గెట్ పెట్టుకుంటే ఎలా పని చేస్తారో మాకు తెలుసు.

లెనిన్ కథ విన్నాక నాన్నతో ఇది పెద్ద కథ, ఇప్పుడు ఇది కరెక్ట్ హా అని చెప్పా. ఇది చేసి చూపిస్తానని నాన్న చెప్పారు. నాకు అదే స్ఫూర్తి’’ అని నాగ చైతన్య తన తండ్రి నాగార్జున గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఆ రెండు సీన్లు

కెరీర్ ఆరంభం నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ కు లెనిన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ రూరల్ రివేంజ్ డ్రామా రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe