...
...
Next Story

ధురంధర్ విలన్ పాత్రను రెజెక్ట్ చేయడంపై హీరో నాగార్జున క్లారిటీ- అసలు నిజం బయటపెట్టిన కింగ్- సినిమాపై రివ్యూ

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్రపై వస్తున్న వార్తలకు నాగార్జున చెక్ పెట్టారు. ధురంధర్‌లో విలన్ పాత్ర ముందుగా తనకు రావడం గురించి నాగార్జున ఏమన్నారో తెలుసుకుందాం.

Published on: Feb 15, 2026, 06:39:32 IST
Advertisement

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ చిత్రం ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ‘రెహ్మాన్ డకైత్’గా అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆయన స్వాగ్, డ్యాన్స్, ఎక్స్‌‌ప్రెషన్స్‌కు మంత్రముగ్ధులయ్యారు.

ముందుగా నాగార్జునకు

ధురంధర్ విలన్ పాత్రను రెజెక్ట్ చేయడంపై హీరో నాగార్జున క్లారిటీ- అసలు నిజం బయటపెట్టిన కింగ్- సినిమాపై రివ్యూ
ధురంధర్ విలన్ పాత్రను రెజెక్ట్ చేయడంపై హీరో నాగార్జున క్లారిటీ- అసలు నిజం బయటపెట్టిన కింగ్- సినిమాపై రివ్యూ

అయితే, ఈ పవర్ ఫుల్ పాత్రను ముందుగా టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఆఫర్ చేశారని, కానీ ఆయన ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయంపై నాగార్జున స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

ఆ పాత్ర నాకు ఆఫర్ చేయలేదు: నాగార్జున

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వార్తలను కొట్టిపారేశారు. "కచ్చితంగా లేదు. రెహ్మాన్ డకైత్ పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. కానీ, అటువంటి అద్భుతమైన పాత్రను చేసి ఉంటే బాగుండేదని నాకూ అనిపించింది" అని నాగార్జున పేర్కొన్నారు.

నేను కూడా ఎదురుచూస్తున్నా

అక్షయ్ ఖన్నా నటనను ప్రశంసిస్తూ.. "అక్షయ్ ఆ పాత్రలో అదరగొట్టారు. ధురంధర్ నిజంగా ఒక అద్భుతమైన సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వం మరీ ముఖ్యంగా అద్భుతం. ఆయన గతంలో తీసిన ‘ఉరి’ సినిమా కూడా నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలోని నటీనటులందరూ గొప్పగా నటించారు. ఇప్పుడు దీని సీక్వెల్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని నాగార్జున రివ్యూ ఇచ్చారు.

100వ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ

"‘ధురంధర్’ వంటి సినిమాలు చూశాక ప్రేక్షకులకు కథాంశంలో అంతర్జాతీయ ప్రమాణాలు కావాలని అర్థమవుతోంది. అందుకే నా తదుపరి సినిమాను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాము" అని నాగార్జున వివరించారు. ఇక నాగార్జున నటించిన తదుపరి చిత్రం వచ్చే ఏడాది జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అక్షయ్ ఖన్నా దూకుడు

మరోవైపు అక్షయ్ ఖన్నా త్వరలో ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’లో రెహ్మాన్ డెకాయిట్‌గా మళ్లీ కనువిందు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ధురంధర్ 2 సినిమా మార్చి 19న విడుదల కానుంది.

రణ్‌వీర్ సింగ్ కంటే

దీని తర్వాత అక్షయ్ ఖన్నా చేతిలో మహాకాళి, ఇక్కా వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇకపోతే రణ్‌వీర్ సింగ్ (హంజా) కంటే అక్షయ్ ఖన్నా ఆరానే ఈ సినిమాలో ఎక్కువగా హైలైట్ అయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడటం గమనార్హం.

నాగార్జున
 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe