...
...
Next Story

Amala: 8 ఏళ్లు బ్రేక్ లేకుండా 9 టు 9 షిఫ్ట్- బ్రేక్‌ఫాస్ట్ కూడా తినకుండా- టీవీ కేబుల్ కష్టాలు చెప్పిన అమల అక్కినేని

Amala Akkineni About Working 9 To 9 Shifts: సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ జరుగుతున్న వేళ సీనియర్ హీరోయిన్ అమల అక్కినేని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేబుల్ టీవీ రాకతో థియేటర్లకు ఆదరణ తగ్గినప్పుడు, తాను ఎనిమిదేళ్ల పాటు బ్రేక్ లేకుండా రోజూ 12 గంటలు పనిచేశానని అమల అక్కినేని గుర్తుచేసుకున్నారు.

Published on: Nov 21, 2026, 22:09:39 IST
Advertisement

Amala Akkineni About Working 9 To 9 Shifts: ప్రస్తుతం సినీ పరిశ్రమలో నటీనటుల పని గంటలు, 8 గంటల షిఫ్ట్ విధానంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్, నాగర్జున భార్య అమల అక్కినేని తాను కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కఠినమైన షెడ్యూల్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ

8 ఏళ్లు బ్రేక్ లేకుండా 9 టు 9 షిఫ్ట్- బ్రేక్‌ఫాస్ట్ కూడా తినకుండా- టీవీ కేబుల్ కష్టాలు చెప్పిన అమల అక్కినేని
8 ఏళ్లు బ్రేక్ లేకుండా 9 టు 9 షిఫ్ట్- బ్రేక్‌ఫాస్ట్ కూడా తినకుండా- టీవీ కేబుల్ కష్టాలు చెప్పిన అమల అక్కినేని

'శివ', 'నిర్ణయం', 'పుష్పక విమానం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అమల.. 1980వ దశకం చివరలో, 90వ దశకం ప్రారంభంలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపారు.

తమిళ సినిమా నా తల్లి లాంటిది

ఇటీవల గలాటా (Galatta) యూట్యూబ్ ఛానల్‌లో మరో హీరోయిన్ మహేశ్వరితో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో అమల తన సినీ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు. తమిళ సినిమాల్లో కథను నడిపించే బలమైన పాత్రలను ఎలా ఎంచుకోగలిగారని మహేశ్వరి ప్రశ్నించగా.. ఒక సినిమా విజయం కేవలం నటీనటుల భుజాలపైనే ఉండదని, సాంకేతిక నిపుణుల కృషి కూడా అందులో ఉంటుందని అమల బదులిచ్చారు.

"అప్పట్లో పరిస్థితులు ఎంతో బాగుండేవి. ప్రతిభావంతులైన నిపుణులు ఉన్న ఆ కాలాన్ని నేను స్వర్ణయుగంగా భావిస్తాను. నాకు తమిళ సినిమా తల్లి లాంటిది. అలాంటి గొప్ప వాతావరణంలో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నా వంతు కష్టపడ్డాను" అని అమల అక్కినేని పేర్కొన్నారు.

కేబుల్ టీవీ దెబ్బకు 8 ఏళ్లు ఆగకుండా షూటింగ్స్

"చాలా ఏళ్ల పాటు నేను ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి చెన్నైలోని టి. నగర్‌కు బయలుదేరేదాన్ని. అప్పట్లో ప్రయాణానికి గంట సమయం పట్టేది, ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతోంది. ఎనిమిదేళ్ల పాటు నాకు రోజూ 9-టు-9 కాల్ షీట్ ఉండేది. ఉదయం 8 గంటలకు లొకేషన్‌కు చేరుకుని సిద్ధమై, 9 గంటలకు మొదటి షాట్ ఇచ్చేదాన్ని. రాత్రి 9 గంటలకు ప్యాకప్ చెప్పాక ఇంటికి చేరుకుని నిద్రపోయేసరికి రాత్రి 10 దాటేది" అని అక్కినేని అమల వివరించారు.

కేబుల్ టీవీ కొత్తగా రావడంతో

ఇప్పుడు చర్చించుకుంటున్నట్లు అప్పట్లో 9-టు-5 షిఫ్టులు లేవని, అందుకే రోజుకు ఒకటి కంటే ఎక్కువ సినిమాలకు పనిచేసే సమయం దొరికేది కాదని అమల స్పష్టం చేశారు. ఆ రోజుల్లో కేబుల్ టీవీ కొత్తగా రావడంతో జనం థియేటర్లకు రావడం తగ్గించారని, ఆ పోటీని తట్టుకోవడానికి నిర్మాతలు బడ్జెట్లు తగ్గించి, తక్కువ రోజుల్లో వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసేవారని అమల గుర్తుచేసుకున్నారు.

నటనకు బ్రేక్.. సేవా రంగంలోకి అడుగు

ఇదిలా ఉంటే.. 1992లో అక్కినేని నాగార్జునతో వివాహం తర్వాత, 1994లో కుమారుడు అఖిల్ పుట్టిన తర్వాత అమల సినిమాలకు దూరమయ్యారు. అయితే నాగార్జున గానీ, మామగారు అక్కినేని నాగేశ్వరరావు గానీ తనను నటన మానేయమని ఎప్పుడూ చెప్పలేదని, జీవితంలో నటనకు మించి ఇంకేదో సాధించాలనే తపనతోనే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని అమల గతంలోనే స్పష్టం చేశారు.

1992లోనే హైదరాబాద్ కేంద్రంగా 'బ్లూ క్రాస్' సంస్థను స్థాపించి జంతు సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా డైరెక్టర్‌గా భావితరాలకు సినీ పాఠాలు నేర్పిస్తున్న అమల, ఇటీవల మళ్లీ సెలెక్టెడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

చివరిసారిగా తెలుగు, హిందీలో

చివరిసారిగా 2023లో వచ్చిన 'తుమ్ సే నా హో పాయేగా' చిత్రంలో అమల అక్కినేని మెరిశారు. తెలుగులో శర్వానంద్ ఒకే ఒక జీవితం (2022)లో నటించి మెప్పించారు. నేటి తరం నటీనటులకు అమల క్రమశిక్షణ, అంకితభావం ఎంతో స్ఫూర్తినిస్తాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks