సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్ షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పిపంపిది. ఇప్పటికే రెండు సార్లు ఛార్జ్ షీట్‌ను రిటర్న్ చేయగా… తాజాగా కూడా పలు లోపాలను గుర్తించింది.
సాంకేతిక లోపాలు…!

ఈ కేసులో హీరో అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. ధాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు , సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించగా.. మరోసారి రిటర్న్ చేసింది. ఎవిడెన్స్ మెటీరియల్ (హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు) జతపరచకపోవడాన్ని ఎత్తి చూపుతూ… తిప్పి పంపింది.
ఈ కేసులో మొత్తం 23 మందిని చిక్కడపల్లి పోలీసులు నిందితులుగా చేర్చారు. కొద్దిరోజుల కిందటే ఛార్జీషీట్ ను దాఖలు చేసినప్పటికీ… కోర్టు స్వీకరించలేదు. ఛార్జీషీట్ లో పేర్కొన్న వివరాలను అనుగుణంగా… సాంకేతిక ఆధారాలను సమర్పించనట్లు గుర్తించింది. అయితే కోర్టు ఎత్తి చూపిన వివరాలను పరిశీలించిన చిక్కడపల్లి పోలీసులు… మరోసారి సవరించి సమర్పించినట్లు తెలిసింది.
2024లో చోటు చేసుకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూశారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు… డిసెంబర్ చివరి వారంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చారు. ఏ1గా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ కేసులో14 మందిని అరెస్ట్ చేయగా... 9 మందికి ముందస్తు బెయిల్ లభించింది.
ఈ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి, ఓ మహిళ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు అల్లు అర్జున్, అతని మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు బౌన్సర్లపైనా ఛార్జ్ షీట్ దాఖలు చేఆరు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..?
2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ వేశారు. ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అక్కడికే వచ్చాడు. చాలా మంది జనాలు ఉండటంతో వద్దని చెప్పినా అల్లు అర్జున్ కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి చేతులు ఊపుతూ ర్యాలీగా వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు.
{{/usCountry}}2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ వేశారు. ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అక్కడికే వచ్చాడు. చాలా మంది జనాలు ఉండటంతో వద్దని చెప్పినా అల్లు అర్జున్ కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి చేతులు ఊపుతూ ర్యాలీగా వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు.
{{/usCountry}}అల్లు అర్జున్ ను దగ్గర నుంచి చూడాలని అభిమానులు కోరుకున్నారు. దీంతో ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొంతమంది కిందపడ్డారు. తొక్కిసలాట జరిగింది. ఇందులో హైదరాబాద్ కే చెందిన రేవతి అనే 35 ఏళ్ల మహిళ కన్ను మూశారు. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్… ఓ రోజు అంతా అక్కడే ఉండాల్సి వచ్చింది.