సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం - ఛార్జ్‌షీట్ రిటర్న్...!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు మరోసారి రిటర్న్ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే రెండు సార్లు చార్జ్‌షీట్‌ను తిరస్కరించిన కోర్టు… తాజాగా సమర్పించిన చార్జ్‌షీట్‌లో కూడా పలు లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్ షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పిపంపిది. ఇప్పటికే రెండు సార్లు ఛార్జ్ షీట్‌ను రిటర్న్ చేయగా… తాజాగా కూడా పలు లోపాలను గుర్తించింది.

సాంకేతిక లోపాలు…!
ఈ కేసులో హీరో అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. ధాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు , సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించగా.. మరోసారి రిటర్న్ చేసింది. ఎవిడెన్స్ మెటీరియల్ (హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు) జతపరచకపోవడాన్ని ఎత్తి చూపుతూ… తిప్పి పంపింది.
ఈ కేసులో మొత్తం 23 మందిని చిక్కడపల్లి పోలీసులు నిందితులుగా చేర్చారు. కొద్దిరోజుల కిందటే ఛార్జీషీట్ ను దాఖలు చేసినప్పటికీ… కోర్టు స్వీకరించలేదు. ఛార్జీషీట్ లో పేర్కొన్న వివరాలను అనుగుణంగా… సాంకేతిక ఆధారాలను సమర్పించనట్లు గుర్తించింది. అయితే కోర్టు ఎత్తి చూపిన వివరాలను పరిశీలించిన చిక్కడపల్లి పోలీసులు… మరోసారి సవరించి సమర్పించినట్లు తెలిసింది.
2024లో చోటు చేసుకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూశారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు… డిసెంబర్ చివరి వారంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చారు. ఏ1గా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ కేసులో14 మందిని అరెస్ట్ చేయగా... 9 మందికి ముందస్తు బెయిల్ లభించింది.
ఈ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి, ఓ మహిళ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు అల్లు అర్జున్, అతని మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు బౌన్సర్లపైనా ఛార్జ్ షీట్ దాఖలు చేఆరు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..?
2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ వేశారు. ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అక్కడికే వచ్చాడు. చాలా మంది జనాలు ఉండటంతో వద్దని చెప్పినా అల్లు అర్జున్ కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి చేతులు ఊపుతూ ర్యాలీగా వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు.
అల్లు అర్జున్ ను దగ్గర నుంచి చూడాలని అభిమానులు కోరుకున్నారు. దీంతో ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొంతమంది కిందపడ్డారు. తొక్కిసలాట జరిగింది. ఇందులో హైదరాబాద్ కే చెందిన రేవతి అనే 35 ఏళ్ల మహిళ కన్ను మూశారు. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్… ఓ రోజు అంతా అక్కడే ఉండాల్సి వచ్చింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

