వెండితెరపై కొందరు నటుల మధ్య ఉండే అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్ల మధ్య ఉండే పరస్పర గౌరవం సినిమా స్థాయిని పెంచుతుంది. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్, విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
రజనీకాంత్ కాలా మూవీ

2018లో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కాలా’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి నానా పటేకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
అవినీతిపరుడైన పోలీస్‌గా
కాలా సినిమాలో పంకజ్ త్రిపాఠి ఒక అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా చాలా చిన్న పాత్రలో కనిపిస్తారు. పంకజ్ లాంటి నటుడు అలాంటి 'బ్లింక్ అండ్ మిస్' రోల్‌లో కనిపించడం చూసి నానా పటేకర్ ఆశ్చర్యపోయారట.
ఇక్కడ ఏం చేస్తున్నావ్
"నేను రజనీకాంత్ అన్న (అన్నయ్య)తో కలిసి ‘కాలా’ సినిమా చేస్తున్నాను. అందులో పంకజ్ త్రిపాఠీ ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అతన్ని చూడగానే నాకు షాక్ అనిపించి.. ‘పంకజ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?’ అని అడిగాను" అని నానా పటేకర్ చెప్పారు.
దానికి పంకజ్ త్రిపాఠి సమాధానమిస్తూ.. "ఒక చిన్న పాత్ర ఉంది సర్" అని చెప్పారట. "నువ్వు ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నావు?" అని నానా ప్రశ్నిస్తే.. "మీరున్నారు, రజనీ అన్నా ఉన్నారు.. మీ అందరితో కలిసి పని చేసే అవకాశం వస్తుందని ఒప్పుకున్నాను సర్" అని పంకజ్ త్రిపాఠి వినయంగా సమాధానమిచ్చారు.
"నువ్వు ఇప్పటికే పెద్ద నటుడివి పంకజ్!"
కానీ, నానా పటేకర్ మాత్రం పంకజ్ ప్రతిభను మెచ్చుకుంటూ ఘాటుగానే స్పందించారు. "నువ్వు ఇప్పటికే చాలా గొప్ప నటుడివి. మాతో కలిసి పని చేయడం వల్ల నువ్వేం పెద్ద నటుడివి అయిపోవు, ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నావు. ఇంకోసారి ఇలాంటి చిన్న చిన్న పాత్రలు చేస్తే మాత్రం నిన్ను కొడతాను జాగ్రత్త!" అని ప్రేమతో కూడిన హెచ్చరిక జారీ చేసినట్లు నానా పటేకర్ వివరించారు.
'కాలా' నుంచి నేటి వరకు..
{{/usCountry}}కానీ, నానా పటేకర్ మాత్రం పంకజ్ ప్రతిభను మెచ్చుకుంటూ ఘాటుగానే స్పందించారు. "నువ్వు ఇప్పటికే చాలా గొప్ప నటుడివి. మాతో కలిసి పని చేయడం వల్ల నువ్వేం పెద్ద నటుడివి అయిపోవు, ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నావు. ఇంకోసారి ఇలాంటి చిన్న చిన్న పాత్రలు చేస్తే మాత్రం నిన్ను కొడతాను జాగ్రత్త!" అని ప్రేమతో కూడిన హెచ్చరిక జారీ చేసినట్లు నానా పటేకర్ వివరించారు.
'కాలా' నుంచి నేటి వరకు..
{{/usCountry}}పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ చిత్రంలో రజనీకాంత్ కరికాలన్‌గా అలరిస్తే, నానా పటేకర్ పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించారు. ప్రస్తుతం నానా పటేకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
రొమాంటిక్ థ్రిల్లర్‌లో
ఇటీవల విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ 'ఓ రోమియో'లో షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రిలతో కలిసి నటించారు. అలాగే అనిల్ కపూర్ 'సుబేదార్'లోనూ అతిథి పాత్రలో మెరిశారు నానా పటేకర్.
నానా పటేకర్ నటనకు ప్రశంసలు
ప్రస్తుతం ప్రకాష్ ఝా తెరకెక్కించిన 'సంకల్ప్' అనే సోషియో-పొలిటికల్ డ్రామా సిరీస్‌లో నానా పటేకర్ నటనకు విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, ప్రతిభ ఉన్న నటులకు సరైన పాత్రలు దక్కాలనే నానా పటేకర్ ఆవేదనలో ఒక సీనియర్ నటుడి పరిణతి కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.