కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఆలోచనలతో సినిమాలు నిర్మించే నిర్మాతగా పేరొందిన అనిల్ సుంకర మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన మూవీ మేకింగ్ రియాలిటీ షో 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' ఇప్పటికే సినీ వర్గాల్లోనే కాకుండా క్రియేటివ్ కమ్యూనిటీల్లోనూ మంచి స్పందన తెచ్చుకుంది.
ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్ మూవీ

టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ.. నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు ఏటీవీ ఒరిజినల్స్ (ATV Originals) బ్యానర్‌పై కొత్త నటీనటులతో రూపొందే ఫీచర్ ఫిల్మ్ 'ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్' (AIRFORCE – Bezawada Batch)ను ప్రకటించారు.
విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని జరిగిన సంఘటనలు ఆధారంగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలను దాటి ముందుకు సాగుతూ.. ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరికి ఎలా సక్సెస్ అయ్యారు అనే అంశాన్ని ఈ కథ మూలంగా తీసుకున్నారు.
ట్రెండ్‌కు తగినట్లు పరిచయం
ఈ చిత్ర ప్రయాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతూ.. తాజాగా తొలి కాస్ట్ మెంబర్‌ను వినూత్న రీతిలో ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆన్‌బోర్డ్ చేశారు. అందుకు సంబందించి విజయవాడలోని ఓ ప్రముఖ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో సరదాగా, మట్టివాసనతో కూడిన సందేశంతో బ్యానర్ ఇప్పడు అందరిని ఆకట్టుకుంది.
'అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు' అంటూ రూపొందించిన ఈ బ్యానర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ 'ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్' సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్తోంది.
వెటకారమే ప్రధాన బలంగా
మంచి స్నేహబంధం, బెజవాడ ప్రత్యేకమైన వెటకారం ఈ చిత్రానికి ప్రధాన బలం కాబోతుందని బ్యానర్లోని మాటలు చూస్తేనే తెలుస్తోంది. ఈ వినూత్న ఆన్‌బోర్డింగ్‌తో ఇది కేవలం సినిమా ప్రారంభం మాత్రమే కాదని.. కొత్త టాలెంట్, కలలను సాధించుకునే ప్రాజెక్ట్ అని మేకర్స్ స్పష్టం చేశారు. త్వరలోనే మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలతో పాటు మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.
{{/usCountry}}మంచి స్నేహబంధం, బెజవాడ ప్రత్యేకమైన వెటకారం ఈ చిత్రానికి ప్రధాన బలం కాబోతుందని బ్యానర్లోని మాటలు చూస్తేనే తెలుస్తోంది. ఈ వినూత్న ఆన్‌బోర్డింగ్‌తో ఇది కేవలం సినిమా ప్రారంభం మాత్రమే కాదని.. కొత్త టాలెంట్, కలలను సాధించుకునే ప్రాజెక్ట్ అని మేకర్స్ స్పష్టం చేశారు. త్వరలోనే మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలతో పాటు మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.
{{/usCountry}}ఇదిలా ఉంటే, అనిల్ సుంకర ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.
న్యూ టాలెంట్‌కు గోల్డెన్ ఛాన్స్
సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం థియేటర్లలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా సినిమాలో కామెడీ అందరిని నవ్విస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా సక్సెస్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర టాలెంట్ ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్ ప్రకటించారు.