ఆ హిందీ దిగ్గజ డైరెక్టర్ సినిమాలంటే ఇష్టం, అలాంటివే తెలుగులో తీయాలని ఈ మూవీ చేశాం.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా అనగనగా ఒక రాజు. డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన అనగనగా ఒక రాజు థాంక్యూ మీట్‌లో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jan 19, 2026, 10:20:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ కామెడీ సినిమా అనగనగా ఒక రాజు. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

ఆ హిందీ దిగ్గజ డైరెక్టర్ సినిమాలంటే ఇష్టం, అలాంటివే తెలుగులో తీయాలని ఈ మూవీ చేశాం.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్
ఆ హిందీ దిగ్గజ డైరెక్టర్ సినిమాలంటే ఇష్టం, అలాంటివే తెలుగులో తీయాలని ఈ మూవీ చేశాం.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్

నవీన్ పోలిశెట్టి కామెంట్స్

ఈ నేపథ్యంలో ఇటీవల అనగనగా ఒక రాజు థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. "అందరీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు పేరుపేరునా కృతఙ్ఞతలు" అని అన్నారు.

ఒకట్రెండు సినిమాలు అలా

"సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి చిత్రాలను అందించారు. అలాంటి సంస్థ నుంచి ఇటీవల ఒకట్రెండు సినిమాలు ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో 'అనగనగా ఒక రాజు' రూపంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ ను అందించడం.. మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నాగవంశీ గారి ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను" అని నవీన్ పోలిశెట్టి తెలిపాడు.

"మా గురువు గారు త్రివిక్రమ్ గారు, చినబాబు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది" అని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నాడు.

మొదటి సన్నివేశం నుంచి

"ఫస్ట్ హాఫ్‌లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్‌లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్‌కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాము" అని నవీన్ పోలిశెట్టి వెల్లడించాడు.

"నాకు రాజ్‌కుమార్ హిరానీ (బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు) గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్‌ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది" అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు.

ఎవరెవరు పాల్గొన్నారంటే

ఇదిలా ఉంటే, అనగనగా ఒక రాజు థ్యాంక్యూ మీట్ కార్యక్రమంలో ఛాయాగ్రాకుడు యువరాజు, కళా దర్శకుడు గాంధీ, నటుడు చంద్ర, హీరో హీరోయిన్లు, రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More