...
...
Next Story

Nayanthara: వైట్ బికినీలో నయనతార.. బ్లర్ ఫొటోను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్న నెటిజన్లు.. బిల్లా రోజులను గుర్తు చేసిందంటూ!

Nayanthara: ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతార వైట్ బికినీ ఫోటో తెగ వైరల్ గా మారింది. ఆమె ఫ్యాన్స్, సినీ లవర్స్ ఈ ఫొటోను తెగ వైరల్ చేసేస్తున్నారు. నయనతార తన ఇన్ స్టాగ్రామ్ లో బ్లర్ ఫొటోను పోస్టు చేసింది. అయితే నెటిజన్లు ఏఐ వాడి నయనతార బికినీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Published on: Oct 6, 2026, 11:21:14 IST
Advertisement

Nayanthara: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ‘లేడీ సూపర్‌స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన తన గ్లామరస్ బీచ్ ఫోటోలతో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. 41 ఏళ్ల వయసులోనూ ఆమె మెయింటైన్ చేస్తున్న అద్భుతమైన ఫిట్‌నెస్, స్ట్రక్చర్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

వైట్ బికినీలో నయనతార

వైట్ బికినీలో నయనతార.. బ్లర్ ఫొటోను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్న నెటిజన్లు.. బిల్లా రోజులను గుర్తు చేసిందంటూ! (x)
వైట్ బికినీలో నయనతార.. బ్లర్ ఫొటోను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్న నెటిజన్లు.. బిల్లా రోజులను గుర్తు చేసిందంటూ! (x)

మాల్దీవుల వెకేషన్‌లో వైట్ బికినీ టాప్, ఫ్లోరల్ సరాంగ్ ధరించి మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్‌తో సముద్రపు ఒడ్డున దిగిన ఈ ఫోటోలను నయనతార తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అయితే అందులోని ఫొటోను ఏఐ వాడి బ్లర్ నెస్ తొలగించి నెటిజన్లు పోస్టు చేస్తుననారు.

నయనతార ఎనర్జీని చూసిన ఫ్యాన్స్ 2007లో ఆమె నటించిన 'బిల్లా' సినిమాలోని ఐకానిక్ 'శాశ' బికినీ సీన్‌ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలను ట్రెండ్ చేస్తున్నారు. నయనతార బికినీ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.

బిజీ హీరోయిన్

నయనతార సినిమాల విషయానికి వస్తే ఆమె సౌత్ సినిమాలోనే అత్యంత బిజీయెస్ట్ స్టార్‌గా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది నయనతార. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది.

టాక్సిక్ లో గంగగా

దీంతో పాటు తమిళంలో యంగ్ హీరో కవిన్ సరసన నయనతార నటించిన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'హాయ్' (Hi) చిత్రం రీసెంట్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్‌గా నిలిచిన 'ముక్కుత్తి అమ్మన్' (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ముక్కుత్తి అమ్మన్ 2' షూటింగ్‌లో కూడా ఆమె బిజీగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వంలో ఫాంటసీ కామెడీగా వస్తున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks