...
...
Next Story

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 17 సినిమాలు.. 2 తెలుగులో ఇంట్రెస్టింగ్.. హారర్, క్రైమ్, ఫాంటసీ జోనర్లలో!

Netflix OTT Releases This Week: ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే న్యూస్ ఇచ్చింది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 17 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. తెలుగు హారర్, రొమాంటిక్ డ్రామాల నుంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూద్దాం.

Published on: Nov 16, 2026, 21:38:36 IST
Advertisement

Netflix OTT Release Movies This Week: వీకెండ్ వచ్చిందంటే చాలు మెజారిటీ యువత, ఫ్యామిలీ ఆడియెన్స్ ఓటీటీ తెరలకు అతుక్కుపోతున్నారు. థియేటర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా సరికొత్త కంటెంట్‌తో వినోదాన్ని పంచుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 17 సినిమాలు.. 2 తెలుగులో ఇంట్రెస్టింగ్.. హారర్, క్రైమ్, ఫాంటసీ జోనర్లలో!
నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 17 సినిమాలు.. 2 తెలుగులో ఇంట్రెస్టింగ్.. హారర్, క్రైమ్, ఫాంటసీ జోనర్లలో!

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ వారం ప్రేక్షకుల కోసం భారీ లైనప్ ప్రకటించింది. నవంబర్ 18 నుంచి నవంబర్ 21 మధ్య ఏకంగా 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. రొమాన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ ఇలా అన్ని జోనర్ల ప్రేక్షకులను అలరించేలా ఈ జాబితా సిద్ధమైంది.

నవంబర్ 18న మొదలయ్యే వినోదాల విందు

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ సందడి నవంబర్ 18 నుంచే షురూ అవుతోంది. ఈ తొలిరోజు నవంబర్ 18న ఏకంగా ఏడు విభిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 1970ల నాటి అర్జెంటీనా అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే 'గార్డన్' (Garden) బయోగ్రాఫికల్ ఓటీటీ సిరీస్ ఆసక్తి రేకెత్తించనుంది. క్రైమ్ డ్రామా ఇష్టపడే వారి కోసం పోలాండ్‌లో నలుగురు చిన్నారుల హత్య చుట్టూ తిరిగే 'ది లా ఆఫ్ బీస్ట్స్' (The Law of Beasts) సిరీస్ వస్తోంది.

మరోవైపు కెన్యా అనే యువతి, బ్లైండ్ డేట్ చుట్టూ అల్లుకున్న రొమాంటిక్ కామెడీ చిత్రం 'సంథింగ్ న్యూ' (Something New), తండ్రిపై పగ తీర్చుకోవాలనుకునే కొడుకు కథతో రూపొందిన ఫిలిపినో యాక్షన్ కామెడీ 'హెచ్‌బీ2మీ' కూడా ఇదే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

నవంబర్ 19న హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ప్రియుల కోసం 'ఎ సిండ్రెల్లా స్టోరీ' (A Cinderella Story) అందుబాటులోకి వస్తోంది. సవతి తల్లి, అక్కల వేధింపులు ఎదుర్కొనే సామ్ మోంట్‌గోమెరీ అనే అమ్మాయి జీవితంలోకి అనుకోని మలుపులు ఎలా వచ్చాయనేది ఈ సినిమా కథాంశం.

మానవ సంబంధాల్లోని ఎత్తుపల్లాలను ఆవిష్కరించే 8 ఎపిసోడ్ల ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'ది ఆల్ట్రూయిస్ట్స్' (The Altruists) కూడా ఇదే సమయంలో స్ట్రీమింగ్ జాబితాలో చేరుతోంది. వీటితోపాటు తెలుగు హారర్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 418 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేయనుంది.

భారత ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేక చిత్రాలు

నవంబర్ 20న మన దేశీయ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మూడు ఆసక్తికర ప్రాజెక్టులు విడుదలవుతున్నాయి. ప్రముఖ యూట్యూబర్, కమెడియన్ భువన్ బామ్ విభిన్న పాత్రల్లో నవ్వులు పూయించిన సూపర్ హిట్ సిరీస్ 'ఢింఢోరా సీజన్ 2' (Dhindora Season 2) నవంబర్ 20 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 2021లో వచ్చిన తొలి సీజన్‌కు తెలుగు రాష్ట్రాల్లోని యువతలోనూ విపరీతమైన ఆదరణ దక్కింది.

యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం 'హైకూ' (Haiku) కూడా నవంబర్ 20నే నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది. కవితల ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచే యువకుడి కథగా ఇది సాగుతుంది. కుజ దోషం (మాంగ్లిక్) ఉన్న సిద్ధార్థ్, ఇరా అనే జంట పెళ్లి తర్వాత ఎదుర్కొనే ఊహించని పరిణామాలతో సాగే 'మాంగ్లిక్' (Manglik) కూడా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

కొరియన్ థ్రిల్లర్ నుంచి హాలీవుడ్ హారర్ వరకు..

తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో కొరియన్ సిరీస్‌లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవంబర్ 20న 'ది బ్లూ రోడ్ స్టోరీ' (The Blue Road Story) అనే కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ విడుదలవుతోంది. కొరియన్ భాషలో రాసిన సందేశంతో దొరికిన ఒక మృతదేహం చుట్టూ ఇద్దరు డిటెక్టివ్‌లు చేసే పరిశోధన, దానికి జపాన్‌తో ఉన్న లింక్ ఏంటనేది ఈ సిరీస్‌లో ఉత్కంఠ రేపుతుంది.

ఇదే రోజున చిన్నారుల కోసం లిలిత్, మార్గోట్ అనే అక్కాచెల్లెళ్ల యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ చిత్రం 'స్టెప్స్' (Steps), కేథరీన్ సెంటర్ రాసిన 'ది బాడీగార్డ్' నవల ఆధారంగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ 'గార్డింగ్ స్టార్స్' (Guarding Stars) స్ట్రీమింగ్ అవుతున్నాయి.

బస్సు ప్రమాదంలో చనిపోయిన తన కొడుకుది ఆత్మహత్య కాదని నిరూపించడానికి 75 ఏళ్ల తల్లి చేసే పోరాటంతో సాగే పోర్చుగీస్ ఎమోషనల్ చిత్రం 'ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సన్' (On Behalf of My Son) కూడా నవంబర్ 20నే విడుదలవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్‌కి బెస్ట్

ఇక నవంబర్ 21న ఒక అమెరికన్ హారర్ కామెడీ సినిమా వస్తోంది. ఒక కుటుంబం సరదాగా పెంచుకునే మొసలి పిల్ల పెద్దదయ్యాక మనుషులను తినడం మొదలుపెడితే ఏం జరిగిందనే భయానక, వినోదాత్మక కథాంశంతో ఈ లేక్ ప్లేసిడ్ 3 సాగుతుంది. మొత్తానికి ఈ వారం నెట్‌ఫ్లిక్స్ తెరపై వినోదాల విందు ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks