Millie Bobby Brown On Indian Comedy Movies: సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్'స్ట్రేంజర్ థింగ్స్'లో 'ఇలెవెన్' అనే పవర్ ఫుల్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ మిల్లీ బాబీ బ్రౌన్ తాజాగా భారతీయ సినిమాపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్ ప్రధాన పాత్ర పోషించిన మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీ 'ఎనోలా హోమ్స్ 3' (Enola Holmes 3) త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మిల్లీ బాబీ బ్రౌన్ బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
హిందీ సినిమాల్లో నటించడమే కాకుండా, ఇక్కడి పాటలకు మాస్ స్టెప్పులు వేయడానికి కూడా తాను రెడీ అని ప్రకటించి ఇండియన్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తింది. ప్రస్తుతం హాలీవుడ్ నటీనటులు భారతీయ మార్కెట్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' వంటి చిత్రాలతో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు గ్లోబల్ లెవెల్‌కు వెళ్లిన నేపథ్యంలో, అంతర్జాతీయ స్టార్లకు మన కల్చర్, సినిమాలపై క్రేజ్ పెరుగుతోంది.
డ్యాన్స్ అంటే ప్రాణం.. ఇండియా నా బకెట్ లిస్ట్‌లో ఉంది!
ఈ క్రమంలోనే వెరైటీ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మిల్లీ బాబీ బ్రౌన్ ఇండియన్ చిత్రాల రంగప్రవేశం గురించి మాట్లాడింది. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు మిల్లీ ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చింది.
"కచ్చితంగా నటిస్తాను. నేను దేనికీ లేదు అని చెప్పను. నా బకెట్ లిస్ట్‌లో ఇండియా ఉంది. అక్కడికి వెళ్లాలని నాకు చాలా ఆశగా ఉంది. హిందీలో ఎలాంటి రోల్స్ చేయడానికైనా నేను సిద్ధమే. నాకు కామెడీ రోల్స్ చేయడమంటే ఇష్టం, ఎందుకంటే నేను చాలా ఫన్నీగా ఉంటాను" అని మిల్లీ బాబీ బ్రౌన్ వెల్లడించింది.
{{/usCountry}}"కచ్చితంగా నటిస్తాను. నేను దేనికీ లేదు అని చెప్పను. నా బకెట్ లిస్ట్‌లో ఇండియా ఉంది. అక్కడికి వెళ్లాలని నాకు చాలా ఆశగా ఉంది. హిందీలో ఎలాంటి రోల్స్ చేయడానికైనా నేను సిద్ధమే. నాకు కామెడీ రోల్స్ చేయడమంటే ఇష్టం, ఎందుకంటే నేను చాలా ఫన్నీగా ఉంటాను" అని మిల్లీ బాబీ బ్రౌన్ వెల్లడించింది.
{{/usCountry}}హిందీ సినిమాల్లో ఉండే కలర్‌ఫుల్ డ్యాన్స్ నెంబర్లలో స్టెప్పులు వేస్తారా అని అడగగా.. తనకి డ్యాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమని, అవకాశం వస్తే అస్సలు వదులుకోనని నవ్వుతూ సమాధానమిచ్చింది.
'ఎనోలా హోమ్స్ 3' యాక్షన్ సీన్స్.. గన్ పట్టుకోవడంపై
జూలై 1న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అవనున్న ఎనోలా హోమ్స్ 3వ భాగంలో యాక్షన్ సన్నివేశాల గురించి కూడా మిల్లీ మాట్లాడింది. ఈ ఫ్రాంచైజీలో మొదటి రెండు భాగాల్లో శారీరక శ్రమతో కూడిన భారీ ఫైట్స్ చేసినట్లు చెప్పిన మిల్లీ, ఈసారి మాత్రం కథలో కొన్ని ఆసక్తికర మార్పులు ఉన్నాయని తెలిపింది.
"మొదటి రెండు పార్టుల్లో ఎనోలా తన సొంత శారీరక బలాన్ని నమ్ముకుని ఫైట్స్ చేసింది. అందుకే వెపన్స్ వాడటానికి నేను మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఈ మూడో భాగంలో ఎనోలా తన రక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలు, టూల్స్ వాడుతుంది. ఈ కొత్త తరహా యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది" అని మిల్లీ పేర్కొంది.
ప్రొడ్యూసర్‌గానూ మారిన యంగ్ డిటెక్టివ్
విక్టోరియన్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కిన ఎనోలా హోమ్స్ ఓటీటీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ప్రసిద్ధ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ (హెన్రీ కావిల్) చెల్లెలిగా మిల్లీ బాబీ బ్రౌన్ చేసే ఇన్వెస్టిగేషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
నాన్సీ స్ప్రింగర్ రాసిన పాపులర్ నవలల ఆధారంగా హ్యారీ బ్రాడ్‌బీర్ ఈ చిత్రాలను డైరెక్ట్ చేశారు. 2020లో మొదటి భాగం, 2022లో రెండో భాగం విడుదల కాగా, ఇప్పుడు మూడో భాగం జూలై 1న నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది.
గాడ్జిల్లా చిత్రాలతో
చిన్న వయసులోనే మిల్లీ ఈ చిత్రానికి నటిగానే కాకుండా కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. గాడ్జిల్లా చిత్రాలతోనూ మెప్పించిన ఈ హాలీవుడ్ స్టార్‌ను త్వరలోనే బాలీవుడ్ తెరపై చూసే అవకాశం దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.