...
...
Next Story

OTT Series: స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ సాహసం.. ఓటీటీ సిరీస్ షూటింగ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న 58 ఏళ్ల బ్యూటీ!

Nicole Kidman Hospitalised By OTT Series Shooting: తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని రెజ్లింగ్ సీన్‌లో నటించిన 58 ఏళ్ల స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ ఆ తర్వాత నేరుగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వృత్తి పట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యంతో ప్రశంసలు కురిపిస్తోంది.

Published on: Apr 26, 2026, 14:30:57 IST
Advertisement

Nicole Kidman Hospitalised By Filming OTT Series: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆమె నటించిన 'మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్' (Margo's Got Money Troubles) ఓటీటీ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ సాహసం.. ఓటీటీ సిరీస్ షూటింగ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న 58 ఏళ్ల బ్యూటీ!
స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్మాన్ సాహసం.. ఓటీటీ సిరీస్ షూటింగ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న 58 ఏళ్ల బ్యూటీ!

తీవ్రమైన ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, షూటింగ్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో నికోల్ కిడ్మాన్ ఏకంగా రెజ్లింగ్ రింగులోకి దిగారు. సీన్ పూర్తయిన వెంటనే పరిస్థితి విషమించడంతో ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.

జ్వరంతోనే రెజ్లింగ్ రింగులోకి..

ఈ విషయాన్ని నికోల్ సహ నటుడు నిక్ ఆఫర్‌మన్ స్వయంగా వెల్లడించారు. ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ సంస్థ రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో నికోల్ కిడ్మాన్ 'లేస్' అనే రెజ్లర్ పాత్ర పోషిస్తున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరించాల్సిన రోజున ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది.

"ఉదయం 8 గంటల సమయంలో నికోల్‌కు ఒంట్లో అస్సలు బాలేదని మాకు తెలిసింది. ఆ రోజు లొకేషన్ దొరకడం చాలా కష్టం. షూటింగ్ క్యాన్సిల్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ, 11 గంటల కల్లా నికోల్ సెట్స్‌లోకి అడుగుపెట్టారు" అని నిక్ ఆఫర్‌మన్ గుర్తుచేసుకున్నారు.

ముఖం పాలిపోయి

షూటింగ్ సమయంలో నికోల్ కిడ్మాన్ ముఖం పాలిపోయి, వణికిపోతున్నా కూడా కెమెరా ముందు మాత్రం అసలైన ప్రొఫెషనల్‌లా రెజ్లింగ్ చేశారని ఆయన కొనియాడారు. ఒక్క షాట్ కూడా మిస్ కాకుండా, చిత్ర యూనిట్‌కు నష్టం కలగకుండా ఆమె తన వంతు సహకారాన్ని అందించారు.

నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు..

"నికోల్ కిడ్మాన్ ఎందుకు అంత పెద్ద స్టార్ అయ్యారో ఆ రోజు నాకు అర్థమైంది. తన విలువ ఒక్క నిమిషం కూడా వృథా కాకూడదని ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఇది నిజంగా అద్భుతం" అని నికోల్ కిడ్మాన్‌పై నిక్ ప్రశంసల వర్షం కురిపించారు.

గాయాలంటే భయం.. కానీ రంగంలోకి దిగితే అంతే!

గతంలో ఒక ఇంటర్వ్యూలో నికోల్ కిడ్మాన్ మాట్లాడుతూ తనకు గాయాలంటే చాలా భయమని చెప్పారు. "రింగులోకి వెళ్లే ముందు వరకు నాకు చాలా భయంగా ఉంటుంది. కానీ, ఒక్కసారి కెమెరా ఆన్ అయితే చాలు.. నా శరీరం గురించి, రక్షణ గురించి అన్నీ మర్చిపోతాను. పిచ్చిగా ఆ పాత్రలో లీనమైపోతాను" అని నికోల్ కిడ్మాన్ పేర్కొన్నారు.

'మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్' విశేషాలు

ఇప్పుడు 58 ఏళ్ల వయసులో కూడా నికోల్ కిడ్మాన్ చూపుతున్న ఈ జోష్ యువ నటీనటులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రుఫీ థోర్ప్ రాసిన నవల ఆధారంగా డేవిడ్ ఇ. కెల్లీ ఈ ఓటీటీ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో ఎల్ ఫాన్నింగ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.

గర్భవతి అయిన ఒక యువతి తన ఆర్థిక ఇబ్బందుల కోసం 'ఓన్లీ ఫ్యాన్స్' (OnlyFans) వంటి ప్లాట్‌ఫామ్‌లను ఎలా ఆశ్రయించింది అనే కథాంశంతో ఈ డ్రామా సాగుతుంది. నికోల్ కిడ్మాన్‌తో పాటు మిచెల్ ఫైఫర్ వంటి దిగ్గజ తారలు ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe