...
...
Next Story

Niharika Konidela: మా సంస్థలో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి-ఫ్యామిలీతో ఎందుకంటున్నారు: నిహారిక కొణిదెల

Niharika Konidela Speech In Raakaasa Pre Release Event: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా సినిమా రాకాస. సంగీత్ శోభన్ హీరోగా చేసిన ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న నిర్వహించిన రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల స్పీచ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Published on: Mar 31, 2026, 15:11:27 IST
Advertisement

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాకాస. సంగీత్ శోభన్ సోలో హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న రాకాస విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మార్చి 31న సోమవారం రాకాస ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మ్యాడ్ హౌస్ అనే సిరీస్ చేశాం

మా సంస్థలో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి-ఫ్యామిలీతో ఎందుకంటున్నారు: నిహారిక కొణిదెల
మా సంస్థలో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి-ఫ్యామిలీతో ఎందుకంటున్నారు: నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "జీ స్టూడియోతో, దివ్య గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి డైలాగ్స్ మొదటగా విన్నాను. ఆ తరువాత మానస గారిని చూశాను. ఆమె తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా ఆలోచిస్తుంటుంది. 24 గంటలు సినిమా గురించి, కథ గురించే ఆలోచిస్తుంటుంది. మానస ఇంకా ఇంకా చాలా ఎత్తుకు వెళ్తుంది. మానస గారు, మహేష్ గారు, యదు వంశీ గారి వంటి వారిని ఇంట్రడ్యూస్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది" అని అన్నారు.

11, 15 మంది కొత్తవాళ్లతో ఎందుకున్నారు

"‘కమిటీ కుర్రోళ్లు’ చేస్తున్నప్పుడు 11, 15 మంది కొత్త వాళ్లతో చేయడం ఎందుకు అన్నారు?.. ‘రాకాస’ టైంలో ఇలాంటివి ఎందుకు ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అని అన్నారు.. ‘బరి’ చేస్తుంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎందుకు? అని అంటున్నారు.. ఇలా అనే వాళ్లు అంటూనే ఉంటారు.. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉంటాను. నేను నా ప్రతీ సినిమాతో కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాను" అని నిహారిక కొణిదెల తెలిపారు.

రెండు సమానమే

"విజయ్ మాస్టర్ గారిని సెట్‌లో చూస్తే మా నాన్న గారిని చూసినట్టే అనిపిస్తుంది. అన్వర్ అలీ గారు కేవలం ఎడిటర్‌గా కాకుండా అన్ని బాధ్యతల్ని చూసుకుంటారు. నాన్న గారి వల్ల నాకెంతో మంది పరిచయమయ్యారు. అందులో గెటప్ శ్రీను ఒకరు. ఆయన నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నయన్‌లో ఓ ప్రత్యేకత ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి" అని నిహారిక కొణిదెల చెప్పుకొచ్చారు.

ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలి

"సంగీత్ షైనింగ్ స్టార్. ‘రాకాస’ చిత్ర విజయంలో సంగీత్‌కి సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో వంద శాతం కష్టపడి ఓ మంచి సినిమాని చేశాం. మా పింక్ ఎలిఫెంట్‌ సంస్థలో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది" అని నిహారిక కొణిదెల తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks