...
...
Next Story

Niharika NM Raghav Juyal: ప్యారడైజ్ విలన్‌తో తెలుగు హీరోయిన్ డేటింగ్- నిహారిక ఎన్ఎమ్ రాఘవ్ జుయల్ రింగ్ సీక్రెట్ ఏంటీ?

Niharika NM Raghav Juyal Dating Engagement Rumours: ప్రముఖ డ్యాన్సర్, ప్యారడైజ్ విలన్ రాఘవ్ జుయల్‌తో తెలుగు హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ డేటింగ్, ప్రేమాయణం సాగిస్తుందా అనే అనుమానాలు రేకెత్తాయి. అందుకు కారణం తాజాగా నిహారిక, రాఘవ్ చాలా క్లోజ్‌గా కలిసి ఉన్న ఫొటోలను ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడమే!.

Published on: Jun 30, 2026, 08:56:50 IST
Advertisement

Niharika NM Raghav Juyal Dating Engagement Rumours: బుల్లితెరపై తనదైన డ్యాన్స్ స్టెప్పులతో, అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్. ఇటీవల సినిమాల్లో విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తూ నటుడిగా తన మార్కు చూపిస్తున్నారు.

ప్యారడైజ్ విలన్‌గా

ప్యారడైజ్ విలన్‌తో తెలుగు హీరోయిన్ డేటింగ్- నిహారిక ఎన్ఎమ్ రాఘవ్ జుయల్ రింగ్ సీక్రెట్ ఏంటీ?
ప్యారడైజ్ విలన్‌తో తెలుగు హీరోయిన్ డేటింగ్- నిహారిక ఎన్ఎమ్ రాఘవ్ జుయల్ రింగ్ సీక్రెట్ ఏంటీ?

కిల్ సినిమాతో మెప్పించిన రాఘవ్ జుయల్ నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీలో విలన్‌గా చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కూడా తెగ ఆకట్టుకుంటుంది. మరోవైపు కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా నిహారిక ఎన్ఎమ్ యమ క్రేజ్ సంపాదించుకుంది.

అంతేకాకుండా తెలుగులో ప్రియదర్శి మిత్ర మండలి సినిమాతో హీరోయిన్‌గా కూడా అరంగ్రేట్రం చేసింది. అయితే, ఇప్పుడు నిహారిక ఎన్ఎమ్, రాఘవ్ జుయల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం వారు షేర్ చేసిన తాజా ఫొటోలే. ఈ ఫోటోలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద హల్‌చల్ సృష్టిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తెచ్చిన తంటా.. రింగ్ సీక్రెట్ ఏంటి?

అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాఘవ్ జుయల్ జూన్ 29, 2026న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో దిగిన రెండు ఫోటోలను పంచుకున్నారు. మొదటి ఫోటోలో నిహారికను రాఘవ్ వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుని కనిపించగా, రెండో ఫోటోలో ఇద్దరూ కెమెరాకు నవ్వుతూ పోజులిచ్చారు.

"అమ్మో.. ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. "ఈ ఊహించని షాక్‌తో నా గుండె ఆగిపోయినంత పనైంది, చాలా సంతోషంగా ఉంది" అని మరొకరు రాశారు. "మాకు కన్ఫ్యూజన్ వద్దు బాస్.. అసలు విషయం చెప్పేయండి" అంటూ రాఘవ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. "ఫైనల్‌గా మాకు వదిన దొరికేసింది గురూ" అంటూ కొందరు నెటిజన్లు అప్పుడే వేడుకలు మొదలుపెట్టేశారు.

కొత్త ప్రాజెక్ట్ ప్రమోషనా?

మరోవైపు, ఇదంతా నిజమైన ప్రేమ వ్యవహారం కాదని, రాబోయే కొత్త సినిమా లేదా మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగమేనని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ త్వరలోనే 'భాయ్ తేరా స్టార్ హై' అనే కామెడీ డ్రామా సిరీస్‌లో కలిసి నటిస్తున్నారని, అందుకోసమే ఈ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్నారని మరికొందరు క్లారిటీ ఇస్తున్నారు.

ఎవరీ నిహారిక ఎన్ఎమ్?

ఏదేమైనా రాఘవ్ జుయల్‌ను ఒక రొమాంటిక్ రోల్‌లో చూడాలని అతని లేడీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి నిహారిక ఎన్ఎమ్ పరిచయం అక్కర్లేని పేరు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ సౌత్ బ్యూటీ, అద్భుతమైన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో సెన్సేషన్ సృష్టించింది.

నిహారికకు తెలుగు, తమిళం, కన్నడతో సహా ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడటం వచ్చు. 2019లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె, 2021లో ఎంబీఏ పట్టా అందుకుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో నిహారిక చేసిన కామెడీ రీల్స్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య లక్ష నుంచి 10 లక్షలకు చేరింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షోలో

గ్లోబల్ వేదిక అయిన 'యూట్యూబ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్' కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో 'బెహెన్స్ ప్లైనింగ్'లోనూ మెరిసిన నిహారికకు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ప్రస్తుతానికైతే ఈ రూమర్లపై అటు రాఘవ్ కానీ, ఇటు నిహారిక కానీ అధికారికంగా స్పందించలేదు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe