నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 23 ఎపిసోడ్ లో మెడ పైనుంచి పువ్వుతో కొడతాడు విరాట్. సూపర్ గా ఉన్నావంటాడు. అమ్మానాన్న, క్రాంతి రావడం చూసి చంద్రపై సీరియస్ అవుతాడు విరాట్. మంచి మనసుతో చేస్తేనే వ్రతం ఫలిస్తుంది. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నాకు తెలుసు. శ్రుతి పెళ్లి చేయించింది కదా. ఇప్పుడు హడావుడి చేస్తోందని విరాట్ అంటాడు.
వ్రతం ఆపాలని

విరాట్ పై రఘురాం ఫైర్ అవుతాడు. నోర్మూయ్.. మొన్నటి వరకు చంద్రకళతో బాగానే ఉన్నావు కదా. నువ్వే సపోర్ట్ గా మాట్లాడేవాడివి. అసలు ఏమైంది నీకు? అని అడుగుతాడు రఘురాం. మూసుకున్న కళ్లు తెరుచుకున్నాయి నాన్న. ఆమె చెప్పినట్లు ఆడి నా ఇష్టమైన వాళ్ల మనుసులు కష్టపెట్టానని విరాట్ అంటాడు. ఈ వ్రతం ఆపేయడమే మంచిదని కామాక్షి అంటుంది. వ్రతం జరగాల్సిందేనని శ్యామల చెప్తుంది.
చంద్ర చేతికి రెండు లక్షలు
చంద్ర కూడా డ్రామా చేస్తూ ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. మరోవైపు వ్రతం జరుగుతుందో లేదోనని రాజ్, సరోజా కంగారు పడతారు. ఇంటికి వెళ్లాక అప్పుల వాళ్లకు డబ్బులు ఇవ్వాలని సరోజా అంటుంది. శ్రుతి ఇచ్చిన రూ.2 లక్షలతో ఖర్చులు, వడ్డీ కట్టేద్దామని రాజ్ అంటాడు. అప్పుడే చంద్ర వచ్చి ఇది నా డబ్బు అని తీసుకెళ్తుంది. రూ.2 లక్షల ఇలా చేజారిపోయాయని సరోజా, రాజ్ బాధపడతారు.
శాలిని డౌట్
ప్రతి దానికి చంద్రకళపై అరుస్తున్నారంటే బావ కావాలనే డ్రామా చేస్తున్నట్లు అనిపిస్తుంది. సడెన్ గా చంద్రపై బావకు అంత కోపం పెరగడం ఇంపాజిబుల్ క్రాంతి. గదిలోకి వెళ్లాక బాగానే ఉంటారని శాలిని అంటుంది. రాత్రి గది దగ్గరకు వెళ్లానని, వాళ్లు గొడవ పడుతున్నారని క్రాంతి చెప్తాడు. వదిన తప్పులు అన్నయ్య రియలైజ్ అవుతున్నాడు. నా నమ్మకం నిజమవుతుంది. మందు వ్రతానికి రెడీ అవమని చెప్పి క్రాంతి వెళ్లిపోతాడు. నాకు మాత్రం నమ్మబుద్ధి కావడం లేదని శాలిని అనుకుంటుంది.
శ్రుతి ప్లాన్
శ్రుతి ఫోన్లో మాట్లాడుతూ వెళ్లడం చూసి రఘురాం ఫాలో అవుతాడు. రక్తంలా కనిపించే నీళ్లతో ఉన్న కొబ్బరికాయను ఓ వ్యక్తి నుంచి తీసుకుంటుంది శ్రుతి. ఇదంతా చూసిన రఘురాం చంద్రను తీసుకొచ్చి చూపిస్తాడు. శ్రుతి వ్రతం ఆపాలని ట్రై చేస్తుంది మామయ్య. శ్రుతి వ్రతంలో కూర్చున్న తర్వాత ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేయాలని చంద్ర అంటుంది.
{{/usCountry}}శ్రుతి ఫోన్లో మాట్లాడుతూ వెళ్లడం చూసి రఘురాం ఫాలో అవుతాడు. రక్తంలా కనిపించే నీళ్లతో ఉన్న కొబ్బరికాయను ఓ వ్యక్తి నుంచి తీసుకుంటుంది శ్రుతి. ఇదంతా చూసిన రఘురాం చంద్రను తీసుకొచ్చి చూపిస్తాడు. శ్రుతి వ్రతం ఆపాలని ట్రై చేస్తుంది మామయ్య. శ్రుతి వ్రతంలో కూర్చున్న తర్వాత ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేయాలని చంద్ర అంటుంది.
{{/usCountry}}కొబ్బరికాయ ఇచ్చిన వ్యక్తి దగ్గరకు చంద్ర వెళ్లి పోలీసులకు చెప్తానని వార్నింగ్ ఇస్తుంది చంద్ర. నేను చెప్పినట్లు చేయాలంటుంది. రాజ్, శ్రుతి వ్రతం కోసం కూర్చుంటారు. రాజ్ కొబ్బరికాయ కొట్టగానే రక్తం నీళ్లు వస్తాయి. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.