నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో.. డాక్టర్ దగ్గరకు వెళ్లి శాలిని కొన్ని ఇన్సిడెంట్లు మర్చిపోవడం కోసం ట్యాబ్లెట్స్ వాడిందా? నిజం చెప్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? అని క్రాంతి అడుగుతాడు.
నిజాలు చెప్పిన డాక్టర్

శాలిని అడిగిందని ఆ ట్యాబ్లెట్స్ తెప్పించా. మీ నాన్న గతం మర్చిపోవాలని ఎవరికీ తెలియకుండా ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఆయన కోలుకుంటే చంద్రకళ నిర్దోషి అని చెప్తారని, అప్పుడు చంద్ర ఇంట్లోనే ఉండి తన పగ నెరవేర్చుకోకుండా అడ్డుపడుతుందని అలా చేసింది. మీ నాన్నలో కదలిక వచ్చినప్పుడు ఆయనను తల మీద కొట్టింది శాలినినే. ఆయనకు ట్రీట్మెంట్ అందకుండా చూసిందని డాక్టర్ చెప్పడంతో క్రాంతి షాక్ అవుతాడు.
క్రాంతి బాధ
రఘురాం కోలుకుంటే శాలిని తప్పులు బయటపడతాయని మెడిసిన్ మార్చిందని డాక్టర్ చెప్తాడు. శాలిని ఇన్ని తప్పులు చేసిందా? తన తప్పులకు చంద్ర వదినను నిందించానా? అని క్రాంతి బాధపడతాడు. మరోవైపు విరాట్, చంద్ర ఇంటికి వస్తారు. కానీ ఇంకా క్రాంతి ఇంటికి రాకపోవడంతో విరాట్, చంద్ర కంగారు పడతారు. జరిగినవి అన్ని తలుచుకుని క్రాంతి నడుచుకుంటూ వెళ్తాడు.
శాలిని టెన్షన్
అప్పుడే డాక్టర్ శాలినికి ఫోన్ చేసి క్రాంతికి నిజం చెప్పేశానని చెప్తాడు. దీంతో శాలినికి చెమటలు పడతాయి. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు నన్ను కాపాడేది చంద్ర, బావ మాత్రమే అని వెళ్లి విరాట్ కాళ్ల మీద పడుతుంది శాలిని. నాది రియలైజేషన్. నా వల్ల మీరు ఎన్ని నిందలు మోశారో తెలుసు. క్రాంతి దగ్గర మంచితనం నటిస్తూ వచ్చా. ఇప్పుడు క్రాంతికి నిజం తెలిసిందని శాలిని డ్రామా ఆడుతుంది.
విరాట్ కంగారు
క్రాంతికి నిజం తెలిసేలా చేసిందే మేము అని విరాట్ చెప్పడంతో శాలిని షాక్ అవుతుంది. అయ్యో క్రాంతికి అబార్షన్ విషయమే కాదు ఇంకా చాలా విషయాలు తెలిశాయి. పగ తీర్చుకోవడం కోసం ప్రయత్నించడం, చంద్ర అడ్డు తొలగించుకోవాలనుకోవడం, మామయ్యను తల మీద కొట్టడం ఇలా అన్ని విషయాలు క్రాంతికి తెలిశాయని శాలిని చెప్తుంది.
సూసైడ్ అటెంప్ట్
క్రాంతికి ఏమైందో అని చంద్ర, విరాట్ టెన్షన్ పడతారు. క్రాంతిని వెతికేందుకు వీళ్లు వెళ్తారు. అప్పుడే శ్రుతి వచ్చి చంద్రతో వెటకారంగా మాట్లాడుతుంది. అర్జెంట్ పని ఉందని క్రాంతి కోసం వెతికేందుకు చంద్ర, విరాట్ వెళ్తారు. చంద్ర వీడియో కాల్ ను క్రాంతి లిఫ్ట్ చేస్తాడు. నా కోసం రావొద్దు వదిన, నేను బతికి ఉండటమే వేస్ట్. నన్ను మర్చిపోండి అని కాల్ కట్ చేస్తాడు క్రాంతి.
{{/usCountry}}క్రాంతికి ఏమైందో అని చంద్ర, విరాట్ టెన్షన్ పడతారు. క్రాంతిని వెతికేందుకు వీళ్లు వెళ్తారు. అప్పుడే శ్రుతి వచ్చి చంద్రతో వెటకారంగా మాట్లాడుతుంది. అర్జెంట్ పని ఉందని క్రాంతి కోసం వెతికేందుకు చంద్ర, విరాట్ వెళ్తారు. చంద్ర వీడియో కాల్ ను క్రాంతి లిఫ్ట్ చేస్తాడు. నా కోసం రావొద్దు వదిన, నేను బతికి ఉండటమే వేస్ట్. నన్ను మర్చిపోండి అని కాల్ కట్ చేస్తాడు క్రాంతి.
{{/usCountry}}అక్కడే ఉన్న బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోదామని క్రాంతి అనుకుంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.