నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతి ఫొటో చూపిస్తూ విరాట్, చంద్రకళ వెతుకుంటారు. ఇంతలో ఓ బిల్డింగ్‌పైకి క్రాంతి వెళ్లడం విరాట్ చూస్తాడు. క్రాంతి సూసైడ్ చేసుకోవాలని చూస్తుంటే వెనక్కి పట్టి క్రాంతిని లాగుతాడు విరాట్. లాగి చెంపపై ఒక్కటి కొడతాడు విరాట్.
శాలినికి అవకాశం ఇచ్చింది నేనే

అన్ని రకాలుగా ఫూల్ అయ్యాను, కొడుకుగా ఫెయిల్ అయ్యాను అని బాధపడుతాడు క్రాంతి. శాలినికి అవకాశం ఇచ్చింది నేనే కదా అని పశ్చాత్తాపపడతాడు. నువ్వు ఇలా ఆలోచిస్తావనే ఇన్నాళ్లు నీకు శాలినీ గురించి చెప్పలేదు. మెల్లిగా మెల్లిగా తెలిసేలా చేద్దామనుకున్నాం. కానీ, ఒకేసారి ఎక్కువగా తెలిసిందని విరాట్ అంటాడు.
సరే ఇంటికి వెళ్దామని చంద్రకళ అంటే.. ఏ మొహం పెట్టుకుని రావాలని క్రాంతి అంటాడు. అయితే అంతా కలిసి కట్టకట్టుకుని దూకేద్దాం. నిన్ను వదిలేసి వెళ్తే ఇంట్లో వాళ్ల మొహం చూడలేం. మేము కూడా చనిపోతాం. నువ్వు ఇలా చేస్తే ఇన్నాళ్లు నేను మీ అన్నయ్య పడ్డ కష్టానికి ఫలితం ఏముందని చంద్రకళ అంటుంది. చంద్రకళ మాటలకు కన్విన్స్ అయిన క్రాంతి తను ఒక్కతి లేకుంటేనే మన కుటుంబం హ్యాపీగా ఉంటుందని అంటాడు క్రాంతి.
మరోవైపు శాలిని తెగ టెన్షన్ పడుతుంటుంది. శాలిని ఎలా వణికిపోతుందో చూడు అని కామాక్షితో శ్రుతి అంటుంది. నేరుగా శ్రుతి దగ్గరికి వెళ్తాడు క్రాంతి. అందరి ముందు వద్దు గదిలో మాట్లాడుదామని శాలిని అంటాడు. కానీ, క్రాంతి మాత్రం శాలినిని ఒక్కటి కొడతాడు. శాలిని ఏం చెప్పాలని ట్రై చేసిన కొడుతూనే ఉంటాడు క్రాంతి. అంతా షాక్ అవుతారు.
ఇది రాక్షసి
ఆడపిల్లపై చేయి చేసుకోవడం ఏంట్రా అని రఘురాం అంటే.. ఇది రాక్షసి నాన్న. మన ఇంటికి పట్టిన దరిద్రం అని శాలిని పీక పట్టుకుంటాడు క్రాంతి. అంతా కలిసి విడిపిస్తారు. ఈ చంద్రే ఏదో నూరిపోసుంటుందని కామాక్షి అంటుంది. అలా చెప్పే ఇన్నాళ్లు మోసం చేసింది ఈ శాలిని. మొత్తం కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని వచ్చిందని క్రాంతి అంటాడు.
{{/usCountry}}ఆడపిల్లపై చేయి చేసుకోవడం ఏంట్రా అని రఘురాం అంటే.. ఇది రాక్షసి నాన్న. మన ఇంటికి పట్టిన దరిద్రం అని శాలిని పీక పట్టుకుంటాడు క్రాంతి. అంతా కలిసి విడిపిస్తారు. ఈ చంద్రే ఏదో నూరిపోసుంటుందని కామాక్షి అంటుంది. అలా చెప్పే ఇన్నాళ్లు మోసం చేసింది ఈ శాలిని. మొత్తం కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని వచ్చిందని క్రాంతి అంటాడు.
{{/usCountry}}శాలిని చాలా కోల్పోయింది. బిడ్డను కూడా కోల్పోయిందని కామాక్షి అంటుంది. దాంతో నవ్వుతూ చప్పట్లు కొడతాడు క్రాంతి. అయ్యో అత్తా అదంతా నాటకం. అసలు శాలిని ప్రెగ్నెంటే కాలేదు. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని ఆడిన నాటకం అని క్రాంతి చెబుతాడు. ఎందుకోసం ఇదంతా. మీ అమ్మ పగ కోసమేగా అని నిలదీస్తాడు క్రాంతి.
మళ్లీ క్రాంతి పీక పట్టుకుంటే క్రాంతి నీకు నిజం తెలియచేయాలని చూశాం కానీ హంతకుడు కావాలని కాదని చంద్రకళ అంటుంది. ఇంకా దీన్ని కాపాడుతున్నావా వదినా అని శాలిని వల్ల చంద్రకళ కోల్పోయింది, నిందలు మోసింది చెబుతాడు క్రాంతి. చంద్ర వదినను ప్రతిదానికి శాలిని బలి పశువు చేసిందని క్రాంతి చెబుతాడు.
శాలిని పాపాలు చెప్పిన క్రాంతి
శాలిని చేసిన తప్పులు, పాపాలు, రఘురాంను చంపాలనుకుంది అంతా వివరిస్తాడు క్రాంతి. దాంతో రఘురాంకు అంతా గుర్తుకు వస్తుంది. ఆరోజు నిజం చెప్పొద్దని బతిమిలాడిందని, నేను వినకపోయేసరికి నా తలపై కొట్టిందని రఘురాం చెబుతాడు. ఇన్నాళ్లు నీ మాయలో పడి చంద్రపై కోపం పెంచుకున్నావా అని శ్యామల, కామాక్షి తిడతారు.
శ్రుతి పెళ్లి వరకు వెళ్లేలా చేసింది శాలినినే అని విరాట్ అంటాడు. ఇంత పగ నీకెందుకు అని శ్యామల అడుగుతుంది. వాళ్ల అమ్మను బిజినెస్‌లో నేను గెలవనివ్వలేదని పగ పోసి పంపింది. ఇప్పుడు దానికి ఫలితం ఏంటో నేను బహుమతిగా పంపిస్తాను అని జగదీశ్వరి అంటుంది.
నా భర్త ప్రాణాలు తీయాలని చూసిన వారిని విడిచిపెట్టనని ముందే చెప్పాను. నేను మాట మీద నిలబడే మనిషిని అని లోపలికి గన్ తీసుకొచ్చి శాలిని తలకు గురి పెడుతుంది జగదీశ్వరి. దాంతో అంతా షాక్ అవుతారు. అమ్మ నీ చేతికి ఎందుకుమ్మ రక్తం అంటుకోవడం, నేను చంపేస్తా అని క్రాంతి అంటాడు. ఇద్దరిని ఆపుతుంది చంద్రకళ.
ఒంటరిగా బతకాలి
చంపడం కరెక్ట్ కాదు. ఏ తాళిని అడ్డుపెట్టుకుందో అదే తాళితో ఒంటరిగా బతకాలి. ప్రాణాలతో విడిచిపెట్టారని పశ్చాత్తాపంతో బతకాలి. రేయ్ క్రాంతి గెంటేయిరా అని శ్యామల అంటుంది. దాంతో శాలినిని క్రాంతి గెంటేస్తాడు. కామాక్షి కూడా గెంటేస్తుంది.
నువ్వే గెలిచావ్ చంద్ర. ఇంటిదీపాన్ని నిలబెట్టే కోడలివి అనిపించున్నావ్. నువ్వు నాలో మార్పు చూశావ్. కానీ, నేనే మారలేదు. మారితే బాగుండేది. మళ్లీ ఇంకొక్క అవకాశం ఇవ్వండి అని వేడుకుంటుంది శాలిని. అదంతా డ్రామా వదినా నమ్మకని క్రాంతి అంటాడు.
చంద్రపై ప్రేమ
చంద్రపై చూపించే ప్రేమకు లొంగిపోయానని, తనకు అలా ఉండాలని ఉందని, అవకాశం ఇవ్వమని రివర్స్‌లో ట్రై చేస్తుంది శాలిని. కానీ, క్రాంతి నమ్మడు. బయటకు పంపేస్తాడు. చంద్రకళను ప్రేమగా హత్తుకుంటుంది జగదీశ్వరి. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.